గ్రహణమొర్రికి ఉచితంగా శస్త్రచికిత్స
సాక్షి, హైదరాబాద్: గ్రహణమొర్రి బాధిత బాలల పెదవులపై చిరునవ్వులు పూయిం చేందుకు ‘స్మైల్ ఇంటర్నేషనల్ నెట్వర్క్, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ ఇన్ నీడ్’ సంయుక్తంగా కృషి చేస్తున్నాయి. ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా నంద్యాలలోని శాంతిరామ్ మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్లో ఈ నెల 22 నుంచి 28 వరకు ఉచితంగా శస్త్ర చికిత్సలు జరపనున్నారు. కార్యక్రమ నిర్వహణలో భాగం గా శుక్రవారం స్మైల్ నెట్వర్క్ మెడికల్ టీం అమెరికా నుంచి హైదరాబాద్‌కు వచ్చిం ది. ఫౌండేషన్ చిల్డ్రన్ ఇన్ నీడ్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ గీత, టామ్ చిత్తా వీరికి స్వాగతం పలికారు.
బేగంపేటలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నిర్వాహకులు మాట్లాడుతూ.. ‘‘ఏపీ, తెలంగాణలోని గ్రహణ మొర్రి బాధితులైన 60 మంది చిన్నారులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు నిర్వహిస్తున్నామని, బాధితులకు వారి సహాయకులకు హాస్పిటల్ ఖర్చులు, భోజన వసతి, రవాణా ఖర్చులు కూడా సమకూర్చుతామం.’ అని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యునెటైడ్ స్టేట్ కౌన్సిల్ జనరల్ మైఖేల్ మల్లిన్స్, ఈ శస్త్ర చికిత్స నిర్వహణకు సహకరిస్తున్న ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ డిప్యూటీ చైర్మన్ ఎన్.వి. సతీష్‌కుమార్‌రెడ్డి .. ఎఫ్.సి.ఎన్, స్మైల్ నెట్వర్క్ సేవల్ని ప్రశంసించారు.