sneha deepthi
-
WPL: దాదాపు పదేళ్ల తర్వాత ‘అమ్మ’ నుంచి మళ్లీ ఆటకు.. మెరిసిన వైజాగ్ తేజం
WPL 2023 Auction-Sneha Deepthi: 16 ఏళ్ల 204 రోజులు... 2013 ఏప్రిల్‌లో విశాఖటాన్నికి చెందిన స్నేహ దీప్తి అత్యంత పిన్న వయసులో అంతర్జాతీయ టి20ల్లో ఆడిన భారత ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఆ తర్వాత మరో టి20 మ్యాచ్‌లో బరిలోకి దిగిన ఆమె అదే నెలలో తన ఏకైక వన్డే కూడా ఆడింది. అనంతరం అంతర్జాతీయ క్రికెట్‌కు ఆమె దూరమైంది. దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు దాదాపు పదేళ్ల తర్వాత స్నేహ దీప్తికి అరుదైన రీతిలో తొలి డబ్ల్యూపీఎల్‌లో ఆడే అవకాశం దక్కింది. వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ. 30 లక్షలకు సొంతం చేసుకుంది. సాధారణంగా దశాబ్ద కాలం పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరం అంటే కెరీర్ ముగిసినట్లే. కానీ దీప్తి 26 ఏళ్ల వయసులో మళ్లీ సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇన్నేళ్ల పాటు ఆటకు దూరం కాకుండా ‘అమ్మ’గా మారిన తర్వాత కూడా క్రికెట్లో ఆమె కొనసాగిన తీరు స్ఫూర్తిదాయకం. దక్షిణ మధ్య రైల్వే తరఫున దూకుడైన బ్యాటింగ్‌తో గుర్తింపు తెచ్చుకున్న స్నేహ ఆంధ్ర జట్టు తరఫున నిలకడైన ప్రదర్శనతో చిన్న వయసులోనే భారత జట్టులో అవకాశం దక్కించుకుంది. దేశవాళీలో దక్షిణ మధ్య రైల్వే తరఫున చక్కటి ఇన్నింగ్స్‌లతో ఆమె గుర్తింపు తెచ్చుకుంది. ఫిబ్రవరి 2021లో ఆమెకు పాప పుట్టింది. ఈ సమయంలోనే ఆటకు విరామమిచ్చి స్నేహ సెప్టెంబర్‌లోనే మళ్లీ దేశవాళీ క్రికెట్లోకి అడుగు పెట్టింది. అప్పటి నుంచి క్రికెట్‌ను కొనసాగిస్తూ ఇప్పుడు డబ్ల్యూపీఎల్‌తో మళ్లీ అందరి దృష్టిని ఆకర్షించడం విశేషం. – సాక్షి క్రీడా విభాగం చదవండి: వేలంలో అత్యధిక ధర పలికిన తెలుగు క్రికెటర్? ఎవరు ఏయే జట్లకు ఆడబోతున్నారంటే.. Eoin Morgan: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ క్రికెటర్ -
166 బంతుల్లో 350
♦ వన్డేలో ట్రిపుల్ సెంచరీ చేసిన స్నేహ ♦ 58 ఫోర్లు, 11 సిక్సర్లతో మోత సాక్షి, హైదరాబాద్ : మామూలుగా వన్డేల్లో డబుల్ సెంచరీ కొట్టడమే మహా గొప్ప. అలాంటిది ఆంధ్ర క్రికెట్ సంఘం నార్త్‌జోన్ క్రికెట్లో ఓ మహిళా క్రికెటర్ ఏకంగా ‘మూడొందలు’ బాదేసింది. ఇప్పటి వరకు పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని ఈ ఫీట్‌ను వైజాగ్ అమ్మాయి స్నేహ దీప్తి (166 బంతుల్లో 350; 58 ఫోర్లు, 11 సిక్సర్లు) అలవోకగా అందుకుంది. ఫలితంగా ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో విశాఖపట్నం 503 పరుగుల భారీ తేడాతో శ్రీకాకుళంపై ఘన విజయం సాధించింది. ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కాలేజి గ్రౌండ్లో జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన విశాఖపట్నం 50 ఓవర్లలో 4 వికెట్లకు 608 పరుగులు చేసింది. తర్వాత శ్రీకాకుళం 24.5 ఓవర్లలో 105 పరుగులకే కుప్పకూలింది. స్నేహ దీప్తి బౌలింగ్‌లోనూ మెరిసింది. మూడు ఓవర్లు వేసి రెండు మెయిడెన్లతో కేవలం 2 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టింది.