ఎదుటివారిని ఎంత ప్రేమిస్తున్నారో చెప్పేయండి: అనుష్క
Anushka Shetty: ‘‘అందరితో ప్రేమగా ఉండండి. ఎదుటివారిని ఎంతగా ప్రేమిస్తున్నారో చెప్పండి. వాళ్ల గురించి ఏమనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి. అతిగా స్పందిస్తున్నారని బాధపడకండి. ఎక్కువగా ప్రేమను చూపించండి ప్రపంచంలో ఇంకా మంచితనం ఉందని నిరూపించండి’’ అంటున్నారు అనుష్క. తాజాగా ఆమె తన ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ చేశారు. దాని సారాంశం ఏంటంటే... ‘‘అన్నింటిలోనూ మంచినీ, అందాన్నీ వెతకండి. ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి. అంతేకానీ జరిగినదాన్ని తలుచుకుంటూ బాధపడకండి.
కొత్త ఆరంభాలను స్వాగతించండి. ఎప్పుడూ హాయిగా నవ్వండి. ఎక్కువగా ఆశలు పెట్టుకోండి. ఎక్కువగా బతికేందుకు ప్రయత్నించండి. మీతో మీరు ఎక్కువగా గడపండి. మీ బాధలను పోగొట్టేవారితో ఉండండి. మీరింకా బతికే ఉన్నారని గుర్తు చేసే అంశాలను దృష్టిలో ఉంచుకుని మీరెంత అదృష్టవంతులో ఊహించుకోండి. జీవితం ఎంత బాగుందో గుర్తు చేసుకోండి. ప్రపంచంలో అందమైనవన్నీ మాయమైపోతున్నాయి. మీ హృదయం కూడా అందులో ఓ భాగం కాకుండా చూసు కోండి’’ అన్నారు అనుష్క.