Somalia blast
-
బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సోమాలియా.. 100కు చేరిన మృతుల సంఖ్య
సోమాలియా రాజధాని మొగదిషులో సంభవించిన బాంబు పేలుళ్ల ఘటనలో మృతుల సంఖ్య 100కు పెరిగిందని ఆ దేశ అధ్యక్షుడు హసన్ షేక్ ప్రకటించారు. రద్దీగా ఉండే ప్రాంతంలో పేలుళ్లు సంభవించడంతో మరో 300 మంది గాయపడినట్లు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. కాగా మొగదిషులోని విద్యాశాఖ కార్యాలయం బయట రద్దీగా ఉండే జోబ్ కూడలి వద్ద శనివారం(ఆక్టోబర్ 29) రెండు కారు బాంబులు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. సోమాలియా అధ్యక్షుడు సహా ప్రధాని, ఇతర ఉన్నతాధికారులు దేశంలో హింసాత్మక తీవ్రవాదాన్ని, ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్‌ను ఎదుర్కోవడంపై చర్చిస్తుండగానే రాజధానిలో రెండు చోట్ల భారీ పేలుళ్లు సంభవించింది. అంతేగాక గత ఐదేళ్లకాలంలో సోమాలియాలో జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. విద్యాశాఖ కార్యాలయం గోడ వద్ద తొలి పేలుడు జరగ్గా, రద్దీగా ఉన్న ఒక రెస్టారెంట్ ముందు మరో కారు బాంబు పేలింది. సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహమూద్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. పేలుడు ధాటికి వాహనాలు తుక్కుతుక్కైనట్లున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తున్నాయి. మృతదేహాలు చెల్లచెదురుగా పడిపోయాయి. అల్ ఖైదా ప్రోద్భలంతో పనిచేసే అల్‌సబాబ్ ఉగ్ర సంస్థే ఈ పేలుళ్లు జరిపి ఉంటుందని అధ్యక్షుడు ఆరోపించారు. రాజధానిని లక్ష్యంగా చేసుకుని ఈ పేలుళ్లకు కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్నారు. గతంలో చాలా సార్లు మొగదిషులో అల్‌సబాబ్ సంస్థే పేలుళ్లకు తెగబడింది. అయితే అల్ షబాబ్ దీనిపై స్పందించలేదు. మరోవైపు సోమాలియా రాజధాని మొగదిషులో జరిగిన ఉగ్రదాడులను భారత్ ఖండించింది. ఉగ్రదాడి తర్వాత సోమాలియాలో మరణించిన వారి కుటుంబాలకు భారత్ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. ఇదిలా ఉండగా పేలుళ్లపై తమదే బాధ్యతంటూ ఎవరూ ప్రకటించుకోలేదు. ఇదిలా ఉండగా ఇదే జంక్షన్లో ఐదేళ్ల క్రితం(2017) ట్రక్ బాంబ్ పేలిన ఘటనలో 500 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఘటన ఉగ్ర సంస్థ అల్ షబాబ్ పనేనని తేలింది. చదవండి: హిజాబ్ ఆందోళనల వేళ పోలీసు కస్టడీలో సెలబ్రిటీ చెఫ్ మృతి.. అంత్యక్రియలకు వేలాది మంది హాజరు -
కారు బాంబు పేలుడు.. 20 మంది మృతి
మొగాదీషు: సోమాలియా రాజధాని మోగదిషులో బాంబు దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. ఓ రెస్టారెంట్లోకి బాంబుతో కూడిన వాహనం దూసుకెళ్లి పేలిపోయింది. దీంతో హోటల్‌తోపాటు సమీప ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సుమారు 30 మందికి గాయాలు కాగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాంబు దాడి వెనుక అల్-షహబ్ సంస్థ హస్తం ఉందని సోమాలియా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అల్-షహబ్ సంస్థకు అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు గుర్తించారు. దేశంలో జరగాల్సిన ఎన్నికలపై ప్రతిపక్ష కూటమి శనివారం మొగాదీషులో సమావేశం కావల్సి ఉండగా బాంబ్ పేలుడు ఘటనతో ఆ సమావేశాన్ని వాయిదా వెసినట్లు తెలుస్తోంది. చదవండి: కూలిన ఆర్మీ హెలికాప్టర్.. చదవండి: ‘దెయ్యం’ పట్టింది; దెబ్బలు తాళలేక నిజం చెప్పింది! -
భారీ పేలుడు: 76 మంది మృతి
మొగదిషు : సొమాలియాలో ఉగ్రవాదుల రక్తపాతం సృష్టించారు. రాజధాని మొగదిషులో భారీ పేలుడు సంభవించింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. ఈ ఘటనలో 76 మంది మృతి చెందారు. నగరానికి చెందిన ఓ చెక్ పాయింట్ సమీపంలో శక్తివంతమైన పేలుడు జరిగింది. దీంతో అక్కడున్న వారంత మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ ఘటన పట్ల ఇప్పటి వరకు ఏ ఉగ్రవాద సంస్థ అధికారిక ప్రకటన చేయలేదు. సొమాలియాలో సాధారణంగా ఆల్‌ఖయిదా అనుబంధ సంస్థ అల్ షబాబ్ తరుచూ ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తూ ఉన్న విషయం తెలిసిందే. పేలుడు జరిగిన ప్రదేశం నుంచి సుమారు 76 మంది మృతదేహాలను వెలికితీసినట్లు ఆమిన్ అంబులెన్స్ డైరక్టర్ అబ్దుల్కాదిర్ అదన్ తెలిపారు. ఇంకా పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు. మృతిచెందినవారిలో విద్యార్థులు, పోలీసు ఆఫీసర్లు ఉన్నారు. -
ఆత్మాహుతి దాడి..10 మంది మృతి
మొగదిషు(సోమాలియా): సోమాలియా రాజధాని నగరం మొగదిషులో శనివారం బాంబుల మోత మోగింది. రెండు కార్లతో ఆత్మాహుతి దళ సభ్యులు దాడికి దిగారు. సోమాలియా అంతర్గత మంత్రిత్వ శాఖ భవనంపై ఆత్మాహుతి దాడికి దిగడంతో 10 మంది చనిపోయారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడ్డారని స్థానిక సమాచార శాఖా మంత్రి దహిర్ మహ్మద్ గల్లె తెలిపారు. ఈ ఘటనను ఆఫ్రికన్ యూనియన్ మిషన్ తీవ్రంగా ఖండించింది. చనిపోయిన వారిలో సైనికులు, జర్నలిస్టులు, సాధారణ పౌరులు కూడా ఉన్నారని మీడియా పేర్కొంది. అల్ షాబాద్ అనే మిలిటెంట్ గ్రూప్ ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు ప్రభుత్వం భావిస్తోంది. -
సోమాలియాలో ఉగ్ర బీభత్సం
-
సోమాలియాలో ఉగ్ర బీభత్సం
మొగదిషు: సోమాలియా రాజధాని మొగదిషులో శనివారం రాత్రి(భారత కాలమానం)అత్యంత శక్తిమంతమైన బాంబు పేలడంతో 231 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 275 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఆఫ్రికా కొమ్ముగా పేరుపడ్డ సోమాలియాలో ఈ స్థాయిలో దాడి జరగడం ఇదే మొదటిసారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. మొగదిషులో రద్దీగా ఉన్న మార్కెట్‌ను కుదిపేసిన ఈ పేలుడులో మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. పేలుడు తీవ్రతకు పెద్ద ఎత్తున మంటలు చెలరేగి అనేక మంది గుర్తుపట్టలేనంతగా కాలిపోయారు. పలువురు క్షతగాత్రుల శరీర భాగాలు తెగిపడగా వారిని కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఇంతవరకూ ప్రభుత్వం తరఫున అధికారికంగా మృతుల సంఖ్యను ప్రకటించలేదు. ఈ దాడిని జాతీయ విపత్తుగా పేర్కొన్న సోమాలియా ప్రభుత్వం ఇది అల్‌కాయిదా అనుబంధ ఉగ్రవాద సంస్థ అల్ షబాబ్ పనేనని ఆరోపించింది. సోమాలియా అధ్యక్షుడు మొహమద్ అబ్దుల్లాహీ మూడు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు.ఒక పక్క రక్తమోడుతున్నా తమవారి కోసం పలువురు భవనాల శిథిలాల కింద వెదకడం ప్రమాదస్థలం వద్ద భీతావహ పరిస్థితికి అద్దం పట్టింది. ప్రమాదం జరిగినప్పటి నుంచీ నగరం అంబులెన్స్‌ల సైరన్లతో మార్మోగింది. ‘మా పదేళ్ల అనుభవంలో ఇలాంటి భయంకర దాడిని చూడలేదు’ అని ఆమిన్ అంబులెన్స్ సర్వీస్ ట్వీట్ చేసింది. శిథిలాల కింద చిక్కుకున్న పలువురు పేలుడు తీవ్రతకు సోమాలియా విదేశాంగ కార్యాలయం సమీపంలో ఉన్న సఫారీ హోటల్ కుప్పకూలడంతో శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఆదివారం తెల్లవారుజాము వరకూ ఫ్లాష్ లైట్ల వెలుగులో తీవ్రంగా శ్రమించారు. ప్రజలు ముందుకొచ్చి రక్తదానం చేయాలని ఆస్పత్రులు ఇచ్చిన పిలుపుకు వేలాదిమంది స్పందించారు. ‘ఒక పక్క మృతదేహాలు, మరొపక్క క్షతగాత్రులతో ఆస్పత్రి మొత్తం నిండిపోయింది. శరీర భాగాలు తెగిపడ్డ వారిని కొన ప్రాణాలతో ఆస్పత్రి తీసుకొస్తున్నారు’ అని స్థానిక ఆస్పత్రి డైరెక్టర్ మొహమద్ యూసుఫ్ చెప్పారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని సాధారణ పౌరుల్ని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారని సోమాలియా సమాచార శాఖ మంత్రి అబ్దిరహమాన్ ఒమర్ పేర్కొన్నారు. ‘ఈ రోజు దుర్దినం. వారెంతో క్రూరంగా, నిర్దయగా ప్రవర్తించారు. ఉగ్రవాదులపై పోరుకు మనమంతా ఏకం కావాలి’ అని ఆయన పిలుపునిచ్చారు. -
సోమాలియాలో ఆత్మాహుతి దాడి
మొగదిష్ : సోమాలియా రాజధాని మొగదిష్ విమానాశ్రయంలో మంగళవారం భారీ పేలుడు సంభవించింది. కారులో వచ్చిన ఆత్మాహుతి దళ సభ్యుడొకరు తనను తాను పేల్చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరోవైపు పేలుడుకు తమదే బాధ్యత అని ఆల్ షెబాబ్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఆత్మాహుతి దాడితో పాటు మరో పేలుడు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో 8మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.