కారు బాంబు‌ పేలుడు.. 20 మంది మృతి | Car Bomb Explosion In Somalia | Sakshi
Sakshi News home page

కారు బాంబు‌ పేలుడు.. 20 మంది మృతి

Published Sat, Mar 6 2021 6:00 PM | Last Updated on Sat, Mar 6 2021 6:48 PM

Car Bomb Explosion In Somalia - Sakshi

మొగాదీషు: సోమాలియా రాజధాని మోగదిషులో బాంబు దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మంది మృతి చెందారు. ఓ రెస్టారెంట్‌లోకి బాంబుతో కూడిన వాహనం దూసుకెళ్లి పేలిపోయింది. దీంతో హోటల్‌తోపాటు సమీప ఇళ్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. సుమారు 30 మందికి గాయాలు కాగా వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాంబు దాడి వెనుక అల్‌-షహబ్‌ సంస్థ హస్తం ఉందని సోమాలియా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

అల్‌-షహబ్‌ సంస్థకు అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నట్లు గుర్తించారు. దేశంలో జరగాల్సిన ఎన్నికలపై ప్రతిపక్ష కూటమి శనివారం మొగాదీషులో సమావేశం కావల్సి ఉండగా బాంబ్‌ పేలుడు ఘటనతో ఆ సమావేశాన్ని వాయిదా వెసినట్లు తెలుస్తోంది.

చదవండి:  కూలిన ఆర్మీ హెలికాప్టర్‌..
చదవండి:  ‘దెయ్యం’ పట్టింది; దెబ్బలు తాళలేక నిజం చెప్పింది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement