son stab
-
‘ప్రియురాలి’ కోసం కొడుకుని చంపిన తల్లి
బ్రసిలియా: బ్రెజిల్లో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలి కోసం ఓ కసాయి తల్లి కడుపు చీల్చుకు పుట్టిన బిడ్డను చంపేసింది. ఈ భయంకరమైన సంఘటనలో 27 ఏళ్ల మహిళ, తన ప్రియురాలి సహాయంతో, తన తొమ్మిదేళ్ల కొడుకును పొడిచి, శరీరాన్ని ముక్కలు చేసి.. ఆపై బార్బెక్యూలో కాల్చింది. బాధితుడిని రువాన్ మేకాన్ డా సిల్వా కాస్ట్రోగా గుర్తించారు. ఈ ఏడాది మేలో చిన్నారిని, అతని తల్లి రోసానా ఆరి డా సిల్వా కాండిడో, ఆమె భాగస్వామి కాసిలా ప్రిస్సిలా శాంటియాగో డమాస్కేనో పెస్సోవాతో(28) కలిసి దారుణంగా హత్య చేసింది. ఈ కేసుకు సంబంధించి నవంబర్ 25న కోర్టు కాండిడోకు 65 సంవత్సరాల జైలు శిక్ష విధించగా, ఆమెకు సాయం చేసినందుకు గాను పెసోవాకు 64 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. (చదవండి: పదేళ్ల బాలికపై పూజారి అఘాయిత్యం) ఈ ఏడాది మే 31 రాత్రి సమయంలో రువాస్ తన ఇంటిలో నిద్రపోతున్నాడు. ఆ సమయంలో మహిళలిద్దరు బాలుడిపై దాడి చేశారు. కాండిడో అతని ఛాతీలో 11 సార్లు పొడిచింది. పెస్సోవా చిన్నారిని క్రిందికి పడేసింది. అనంతరం ఇద్దరు కలిసి బాలుడిని ముక్కలుగా కట్ చేసి.. బార్బెక్యూ గ్రిల్ మీద ఉంచి కాల్చేశారు. తరువాత వారు ఆ అవశేషాలను సూట్‌కేస్‌లో నింపి.. సమాంచాయియా ప్రాంతంలో పడేస్తుండగా.. ఇద్దరు యువకులు వారిని గమనించారు. సాక్షులలో ఒకరు, ఉత్సుకతతో, సూట్‌కేస్‌ను తెరిచి చూసి.. దానిలో ఉన్న వాటిని చూసి జడుసుకున్నాడు. సూట్‌కేస్‌లో ఎముకలు వంటివి ఉండటంతో వెంటనే దీని గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక దర్యాప్తులో భాగంగా ఇద్దరు మహిళలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చారు. రెండు రోజుల క్రితం కోర్టు వీరికి శిక్ష విధించింది. -
పబ్జీ కోసం తండ్రిపై కత్తితో దాడి!
లక్నో: పబ్జీ గేమ్‌ను భారత్‌తో బ్యాన్ చేసిన దాని వల్ల జరుగుతున్న దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా గంటలు గంటలు పబ్జీ అడొద్దు అని చెప్పినందకు ఒక కొడుకు తన తండ్రిని కత్తితో గాయపరిచాడు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో చోటు చేసుకుంది. అమర్ అనే వ్యక్తిని అతని తండ్రి ఇర్ఫాన్ పబ్జీ అడొద్దు అంటూ మందలించాడు. ప్రతిసారి అలా అడ్డుచెప్పడంతో విసుగుచెందిన అమర్ అతని తండ్రిపై విచక్షణా రహితంగా దాడి చేసి అతని గొంతు వద్ద అనేకసార్లు కత్తితో దాడి చేశాడు. అనంతరం అతను కూడా కత్తితో పొడుచుకున్నాడు. ఇంటి నుంచి బయటకు రక్తపు మరకలతో వచ్చిన అతడిని రక్షించడానికి స్థానికులు ప్రయత్నించిన వారిపై కూడా దాడి చేయబోయాడు. గాయపడిన తండ్రి కొడుకులను ఆసుపత్రిలో చేర్పించారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే అమర్‌కు డ్రగ్స్ అలవాటు ఉందని అతని కుటుంబ సభ్యులు తెలియజేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. భారత్‌లో పబ్జీని ఆపేసినప్పటికి ఇప్పటికే ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న వారు ఆడటానికి వీలు కల్పిస్తుండంటతో యువత పబ్జీకి బానిసలుగా మారుతున్నారు. చదవండి: పబ్జీ ముసుగులో బాలికపై దారుణం -
హైకోర్టులో లాయర్‌పై కొడుకు కత్తితో దాడి
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నై హైకోర్టులో న్యాయవాది మణిమారన్పై కన్న కొడుకే కత్తితో దాడి చేశాడు. హైకోర్టు ఆవరణలో భారీ భద్రతను తప్పించుకుని నిందితుడు కత్తితో కోర్టులోకి ప్రవేశించాడు. న్యాయవాదులు, సిబ్బంది, క్లయింట్లు చూస్తుండగానే తండ్రిపై దాడి చేసి కత్తితో పొడిచాడు. ఈ ఘటనతో కోర్టులో ఉన్నవారు షాకయ్యారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలంగా మణిమారన్ కు, ఆయన కొడుకుకు మధ్య విబేధాలున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.