జీడిమెట్లలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: జీడిమెట్ల ప్రాంతంలోని సోనాలి పరిశ్రమలో గురువారం అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నికీలలు భారీగా ఎగిసి పడటంతో భద్రత సిబ్బంది వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను అదుపు చేశారు.
ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అందులోభాగంగా పోలీసులు ... భద్రత సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు.