Sonebhadra
-
‘సోన్‌భద్ర’ కేసులో కలెక్టర్, ఎస్పీపై వేటు
లక్నో: గోండు ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపేందుకు సహకరించిన ఎస్పీ, జిల్లా కలెక్టర్, మరో 13 మంది అధికారులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేటు వేసింది. గత నెలలో సోన్‌భద్ర జిల్లాలో భూవివాదంలో జరిగిన కాల్పుల్లో 10 మంది గోండు ప్రజలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అదనపు ముఖ్య కార్యదర్శి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు నివేదిక సమర్పించారు. సీఎం యోగి ఆదివారం మాట్లాడుతూ.. కాల్పులు జరిపేలా నిందితులకు అధికారులు సహకారం అందించారని విచారణలో తేలిందన్నారు. దీంతో జిల్లా మెజిస్ట్రేట్ అంకిత్ కుమార్ అగర్వాల్, ఎస్పీ సల్మాన్ తాజ్ పాటిల్ మరో 13 మందిపై వేటు వేశామని తెలిపారు. -
రెండు రైళ్లు ఢీ: ఇద్దరు మృతి
రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రెండు రైళ్లు ఢీ కొన్నాయి. ఆ ఘటనలో ఇద్దరు ప్రయాణీకులు మరణించగా, మరో 12 మందికిపైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. రెండు రైళ్లు ఢీ కొన్న సంఘటన ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకి 410 కిలోమీటర్ల దూరంలో సోనిభద్ర సమీపంలో గత అర్థరాత్రి చోటూ చేసుకుంది. వారణాసి- శక్తినగర్ ఇంటర్ సిటీ రైలు సోనిభద్ర సమీపంలోని ఒబ్రా డామ్ రైల్వే స్టేషన్ వద్ద నిలిచి ఉంది. అయితే అప్పటికే స్టేషన్లో ఆగి ఉన్న కాత్ని ఎక్స్‌ప్రెస్‌కు రైల్వే సిబ్బంది గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దాంతో కాత్ని ఎక్స్‌ప్రెస్ వేగంగా వెళ్లి ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీ కొట్టింది. ఆ ఘటనపై రైల్వే శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.