లక్నో: గోండు ప్రజలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపేందుకు సహకరించిన ఎస్పీ, జిల్లా కలెక్టర్, మరో 13 మంది అధికారులపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేటు వేసింది. గత నెలలో సోన్‌భద్ర జిల్లాలో భూవివాదంలో జరిగిన కాల్పుల్లో 10 మంది గోండు ప్రజలు మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి అదనపు ముఖ్య కార్యదర్శి, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు నివేదిక సమర్పించారు. సీఎం యోగి ఆదివారం మాట్లాడుతూ.. కాల్పులు జరిపేలా నిందితులకు అధికారులు సహకారం అందించారని విచారణలో తేలిందన్నారు. దీంతో జిల్లా మెజిస్ట్రేట్ అంకిత్ కుమార్ అగర్వాల్, ఎస్పీ సల్మాన్ తాజ్ పాటిల్ మరో 13 మందిపై వేటు వేశామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment