soniya ghandhi
-
‘స్టార్’లొస్తున్నారు..
ముందస్తు ఎన్నికల ఘట్టంలో చివరి అంకమైన నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. ప్రచారానికి ఇంకా 13 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాన పార్టీలన్నీ అగ్రనేతలను రప్పించే ప్రయత్నంలో ఉన్నాయి. ఇప్పటికే వివిధ పార్టీలకు చెందిన స్టార్ క్యాంపెయినర్లు సీఎం కేసీఆర్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, టీపీసీసీ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క, విజయశాంతి, గద్దర్, ప్రొఫెసర్ కోదండరామ్ తదితరులు ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల ప్రచారం నిర్వహించారు. బహిరంగ సభలు నిర్వహించి ఆయా పార్టీల అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. తాజాగా గురువారంతో నామినేషన్ల ఉపసంహరణ అనంతరం పోటీలో ఉండే అభ్యర్థుల జాబితా వెలువడింది. దీంతో మిగిలిన 13 రోజుల్లో ప్రచారాన్ని హోరెత్తించేందుకు ప్రధాన పార్టీలు సభల నిర్వహణ, వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇప్పటికే కొందరు అగ్రనేతల పర్యటనల షెడ్యూల్‌ను ప్రకటించిన రెండు ప్రధాన పార్టీలు.. మరో రెండు మిగతా షెడ్యూల్ సైతం ఖరారు చేసేందుకు కసరత్తులో మునిగాయి. సాక్షిప్రతినిధి, కరీంనగర్: మహాకూటమి తరఫున ప్రచారం నిర్వహించేందుకు సోనియాగాంధీ శుక్రవారం హైదరాబాద్‌లో సభకు హాజరవుతుండగా, 24 నుంచి టీపీసీసీ స్టార్ క్యాంపెయినర్లంతా ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ప్రచారం నిర్వహించేలా షెడ్యూల్ సిద్ధం చేసినట్లు చెప్తున్నారు. ఈ మేరకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ.రేవంత్‌రెడ్డి ఈ నెల 24 కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. చొప్పదండి నియోజకవర్గం గంగాధర, మంత్రి కేటీఆర్ ప్రాతినిథ్యంతో వహిస్తున్న సిరిసిల్లతో పాటు వేములవాడ నియోజకవర్గాల్లో ఆయన సభలు నిర్వహించనున్నారు. 26న గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ మరోమారు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సుడిగాలి పర్యటనలు, సభలు నిర్వహించనున్నారు. జగిత్యాల, కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జగిత్యాలలో ధర్మపురి, కోరుట్ల, జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల ఉమ్మడి సభ, 2:45కు కరీంనగర్లో మానుకొండూరు, కరీంనగర్ జిల్లాల ఉమ్మడి సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, హరీష్‌రావు, ఎంపీ కవితలు సైతం ఆయా నియోజవకర్గాల్లో పర్యటించనున్నారు. ఇదిలా ఉండగా ఈ పది రోజుల్లో బీజేపీ తరఫున ప్రచారానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆ పార్టీ అధినేత అమిత్‌షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ రానున్నారని సమాచారం. అలాగే కాంగ్రెస్ నుంచి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉమ్మడి జిల్లాలో ఓ సభకు ప్లాన్ చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఖుష్బూ, విజయశాంతి తదితరులు ప్రచారంలో పాల్గొనే అవకాశాలున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అలాగే బహుజన లెఫ్ట్ ఫ్రంట్ నేతలు కూడా ఆ కూటమి అగ్రనేతలతో ప్రచారం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. -
ముంచుకొస్తున్న నామినేషన్ల గడువు
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: శాసనసభ ఎన్నికల్లో అత్యంత కీలకఘట్టమైన నామినేషన్ల ప్రక్రియకు గడువు ముంచుకొస్తుండటంతో ఆశావహులు, అభ్యర్థుల్లో టెన్షన్ నెలకొంది. ప్రచారంలో దూసుకుపోతున్న వివిధ పార్టీల అభ్యర్థుల తమ ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుండగా.. మరో వైపు సొంత పార్టీలో టికెట్లు ఆశించి భంగపడిన వారు ఇప్పటికే స్వతంత్రులుగా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతుండడం గమనార్హం. ఈ చర్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నామినేషన్ల ప్రక్రియకు ఇంకా రెండు పనిదినాలు మాత్రమే మిగిలిఉన్నాయి. దీంతో శని, సోమవారాల్లో భారీగా నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. అంతేకాదు మిగిలిన ఈ రెండు రోజులు కూడా మంచి ముహూర్తాలే కావడంతో... ఇది వరకే దాఖలు చేసిన వారు సైతం మరో సెట్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు అన్ని పార్టీలకు సంబంధించిన కీలకమైన నేతలు కూడా ప్రచార పర్వానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో చేపట్టిన పర్యటనలు ఖరారయ్యాయి. ఈనెల 21న జడ్చర్లలో ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. అలాగే 25న దేవరకద్ర, నారాయణపేట పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వీటితో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలకు కలిపి నారాయణపేటలో ఈనెల 25న జరగనున్న బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. రెబెల్స్ చిచ్చు జిల్లాలో మహాకూటమి, టీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు దాదాపు ఖరారయ్యారు. కొన్ని స్థానాల్లో టికెట్లు రాకపోవడంతో నిరాశకు గురైన ఆశావహులు ధిక్కార స్వరాన్ని వినిపిస్తూనే రెబల్స్‌గా నామినేషన్లు వేసేందుకు సిద్ధమవుతున్నారు. కొందరు స్వతంత్రులుగా రంగంలోకి దిగగా మరికొందరు కొత్త పార్టీల వైపు దృష్టి సారించారు. పార్టీల అధినేతలు చేసిన బుజ్జగింపులు ఫలించడం లేదు. ఏకంగా నామినేషన్లు వేసి ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. అమమ్మతి నేతల తిరుగుబాటుతో అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. ఇప్పటికే మహాకూటమిలో భాగంగా మహబూబ్‌నగర్ స్థానాన్ని టీడీపీకి కేటాయించడంతో.. టీపీసీసీ కార్యదర్శిగా ఉన్న మారేపల్లి సురేందర్‌రెడ్డి పార్టీకి రాజీనామా చేసి ఎన్సీపీ తరఫున బరిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే మక్తల్‌లో కూడా సీటును టీడీపీకి కేటాయించడంతో అక్కడ జెడ్పీటీసీ సభ్యుడు శ్రీహరి రెబెల్‌గా బరిలో దిగనున్నట్లు చెబుతున్నారు. అదే విధంగా కాంగ్రెస్ పెండింగ్‌లో ఉంచిన దేవరకద్ర విషయంలో డోకూరు పవన్‌కుమార్‌కు టికెట్ కేటాయించకుంటే పార్టీకి రాజీనామా చేస్తామంటూ ఆయన అనుచరులు హెచ్చరికలు జారీ చేశారు. అలాగే ఒక వేళ తనకు టికెట్ కేటాయించకుంటే రెబెల్‌గా బరిలో నిలవాలని యోచిస్తున్నట్లు ఆయన సన్నిహితులు పేర్కొంటున్నారు. ప్రచారానికి శ్రీకారం.. అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి అభ్యర్థులు దాదాపు ఖరారు కావడంతో ప్రచారంలో నిమగ్నమయ్యారు. ముఖ్యంగా పార్టీల అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం ముఖ్యనేతలు కూడా రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో ప్రచారం చేపట్టాలని నిర్ణయించారు. ఇది వరకే వనపర్తిలో ప్రజాఆశీర్వాద సభలో పాల్గొన్నారు. తాజాగా ఈ నెల 21న మంత్రి లక్ష్మారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జడ్చర్ల నియోజకవర్గంలో జరిగే బహిరంగసభలో కేసీఆర్ పాల్గొననున్నారు. అలాగే ఈనెల 25న ఉమ్మడి జిల్లాలోని దేవరకద్ర, నారాయణపేట, షాద్‌నగర్‌లో కేసీఆర్ పర్యటిస్తారు. అనంతరం మరో రెండు రోజుల తర్వాత జిల్లాలో పర్యటనలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నారు. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు మరోసారి జిల్లాలో పర్యటిం చనున్నారు. ఇప్పటికే ఎన్నికల శంఖారావాన్ని పాలమూరు నుంచే ఆయన ప్రారంభించిన విషయం విదితమే. తాజాగా ఈనెల 25న నారాయణపేటలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కొడంగల్, మక్తల్, నారాయణపేట మూడు స్థానాలకు కలిపి ఒకే చోట ఏర్పాటుచేసిన ఈ సభలో అమిత్ షా పాల్గొని ప్రసంగిస్తారు. వీరికి తోడు కాంగ్రెస్ పార్టీ తరఫున జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సభలు కూడా ఏర్పాటు చేయాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు. అందుకు అనుగుణంగా కొడంగల్‌లో రాహుల్‌గాంధీ సభను, గద్వాలలో సోనియాగాంధీ సభ నిర్వహణకు కాంగ్రెస్ పార్టీ వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. -
సోనియా గాంధీ విలవిలలాడుతోంది : భట్టి విక్రమార్క
సాక్షి, ఖమ్మం : సోనియా గాంధీ ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరకపోవటంతో ఆమె విలవిలలాడుతోందని కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ చర్యల వల్ల రైతులు అధోగతి పాలు అయ్యారని, ఏ ఆత్మగౌరవం కోసం తెలంగాణ తెచ్చుకున్నామో అది లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రచార స్ట్రాటజీ పేపర్ ముసాయిదాను త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అణగారిన, బలహీన వర్గాల ఆత్మగౌరవం, ఆత్మాభిమానం కోసం పోరాటం సాగుతోందని వ్యాఖ్యానించారు. రీ డిజైనింగ్ వల్ల గోదావరి నుంచి ఒక్కచుక్క నీరు కూడా రాకుండా పోయిందని అన్నారు. ఇసుక మాఫియా రాష్ట్రంలో దోపిడీకి పాల్పడుతోందని ఆరోపించారు. ఫ్యూడల్ ప్రభుత్వాన్ని దించి ప్రజల అజెండానే మా అజెండాగా.. ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఈ ఎన్నికలను సామాన్య, మధ్య తరగతుల ప్రజలకు.. ఫ్యూడల్స్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా అభివర్ణించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మీడియా మీద కూడా ఆంక్షలు విధించిందన్నారు. -
సోనియా దయవల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు
మహబూబాబాద్ : సోనియాగాంధీ దయ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శనివారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సోనియాగాంధీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ కేవలం తమ పోరాట ఫలితంగానే రాష్ట్రం ఏర్పడిందని చెప్పడం వారి అవివేకానికి నిదర్శనమని అన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మునిసిపల్ చైర్పర్సన్ డాక్టర్ భూక్యా ఉమ, పట్టణ అధ్యక్షుడు రామగోని రాజుగౌడ్, జడ్పీటీసీ మూలగుండ్ల వెంకన్న, నాయకులు దసృనాయక్, హెచ్.వెంకటేశ్వర్లు, బానోత్ ప్రసాద్, నెమ్మది సుదర్శన్, డాక్టర్ మురళీనాయక్, నూనావత్ రమేష్, కత్తి స్వామి, చెలమల నారాయణ, పెండ్యాల శ్రీను, దళ్‌సింగ్, జలీల్ పాల్గొన్నారు. కాంగ్రెస్ కార్యాలయంలో జెండాను ఆవిష్కరించిన డీసీసీ అధ్యక్షుడు భరత్‌చందర్‌రెడ్డి -
నేతల నోట.. ‘నాయిని’ మాట
సాక్షి ప్రతినిధి, వరంగల్ : ప్రజా చైతన్యయాత్ర బహిరంగ సభలో ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి రాష్ట్ర నేతలు హామీలు ఇవ్వడం చర్చనీయాంశమైంది. ఈ సభలో ప్రసంగించిన నేతలు నాయిని రాజేందర్‌రెడ్డి భవిష్యత్ విషయంలో స్పష్టత ఇవ్వాల్సిందిగా వేదికపైనే పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కోరారు. దీంతో పీసీసీ ఛీప్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ‘కష్టకాలంలో పనిచేసిన ఎవ్వరీని మర్చి పోం. నాలుగేళ్ల క్రితం అధికారం కోల్పోయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండేది. ఇప్పుడు ఎలా పటిష్టంగా ఉందో చూస్తున్నాం. రాజేందర్‌రెడ్డిలాంటి నేతలు కేసులకు వెరవకుండా కష్టపడి పని చేశారు. వారి కష్టాన్ని తప్పకుండా గుర్తిస్తాం’ అని హామీ ఇచ్చారు. అంతకు ముందు వీహెచ్ మాట్లాడుతూ చాలా మంది పార్టీలోకి వస్తున్నారు. వాళ్లను రమ్మనండి, కానీ పార్టీ జెండాలను మోసే వాళ్లను గుర్తించాలి. కేసులను ఎదుర్కొని నిలబడ్డ రాజేందర్‌రెడ్డిలాంటి వాళ్లను పార్టీ గుర్తించాలి. వచ్చీ రాంగనే కుర్చీల కూసుంటనంటే కుదరదు’ అని వేదికపైనే అన్నారు. ఆ తర్వాత సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ నాయిని రాజేందర్‌రెడ్డిని ఎమ్మెల్యే చేద్దామా ? వద్దా ? అని సభికులను ప్రశ్నించారు. నాయినికి టిక్కెట్ ఇవ్వాలంటూ వేదిక మీద నుండే నేరుగా పార్టీ పెద్దలను అడుగుతున్నానని చెప్పారు. ఈ విషయంపై నేరుగా సోని యాగాంధీతో మాట్లాడుతానన్నారు. జెండా మోశా డు.. కష్టపడ్డాడు.. ఖర్చుపెట్టాడు.. అతడికి టికెట్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరుతానని చెప్పారు. చివర్లో శాసనమండలిలో కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ కష్టకాలంలో పార్టీని నడిపించిన రాజేందర్‌రెడ్డికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. చివరగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండేవారని, తనకు అత్యంత సన్నిహితులైన వేం నరేందర్‌రెడ్డి, సీతక్కతో పార్టీలో చేరామని, కాంగ్రెస్‌లో తమకు న్యాయం జరుగుతుంది’ అని చెప్పడం కొసమెరుపు. -
మన్మోహన్‌ను రాష్ట్రపతి చేస్తారనుకున్నా
న్యూఢిల్లీ: 2012లో రాష్ట్రపతి అభ్యర్థిగా తనను కాకుండా.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ప్రతిపాదిస్తారని భావించానని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. తాజా పుస్తకం ‘కొలిషన్ ఇయర్స్’లో 2012లో రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ఆయన ప్రస్తావించారు. యూపీఏ ప్రభుత్వంలో, పార్లమెంట్లో తాను పోషిస్తున్న కీలక పాత్రను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్రపతి అభ్యర్థిగా తనను ఎంపిక చేయకపోవచ్చని భావించానని ప్రణబ్ ఆ పుస్తకంలో పేర్కొన్నారు. 2007లోనూ ఆ కారణంగానే తనను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించలేదన్నారు. ‘2012 జూన్ 2న సోనియాగాంధీతో సమావేశమయ్యాను. ప్రణబ్‌జీ.. రాష్ట్రపతి పదవికి మిమ్మల్ని మించిన అభ్యర్థి వేరెవరూ లేరు. కానీ మన ప్రభుత్వంలో మీరు పోషిస్తున్న కీలక పాత్రనూ విస్మరించలేం. అందువల్ల రాష్ట్రపతి అభ్యర్థిత్వానికి వేరెవరి పేరునైనా మీరు చెప్పగలరా? అని సోనియా నన్ను ప్రశ్నించారు. మీరు తీసుకునే ఏ నిర్ణయానికైనా బద్ధుడినై ఉంటానని జవాబిచ్చి వచ్చేశాను. అయితే, ఆ సమావేశం తరువాత ఇంటికి వెళ్లాక.. యూపీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా నాటి ప్రధాని మన్మోహన్‌ను ఎంపిక చేసి, నన్ను ప్రధానిగా నియమిస్తారేమోనన్న ఆలోచన నాకు వచ్చింది. ఈ విషయంపై ఆమె తీవ్రంగా ఆలోచించారని కూడా నాకు తరువాత తెలిసింది’ అని ప్రణబ్ పేర్కొన్నారు. ఒక సందర్భంలో.. పార్లమెంట్లో విపక్షాల ఆరోపణలకు దీటుగా బదులిచ్చిన తరువాత.. ‘అందుకే మిమ్మల్ని రాష్ట్రపతి చేయలేను’ అని సోనియా అనడాన్ని ప్రణబ్ ఆ పుస్తకంలో ప్రస్తావించారు. జూన్‌లో యూపీఏ అభ్యర్థిగా ప్రణబ్‌ను ప్రకటించారు. ఆ తర్వాతి ఘటనలను ప్రణబ్ వివరిస్తూ.. ‘రాష్ట్రపతి అభ్యర్థిగా నన్ను ప్రకటించాక సోనియా నాకు ఉద్వేగభరిత వీడ్కోలునిచ్చారు. తర్వాత నావైపు చిరునవ్వుతో చూస్తూ.. మీ శక్తిసామర్థ్యాలనే కాదు, మీ ఆగ్రహావేశాలనూ ఇక మిస్ అవుతాం అన్నారు’ అని పేర్కొన్నారు. -
నేను థాకరేను కలవడంపై సోనియా అసంతృప్తి: ప్రణబ్
న్యూఢిల్లీ: 2012 రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా శివసేన దివంగత నేత బాల్ థాకరేను తాను కలవడం పట్ల కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పట్లో అసంతృప్తి వ్యక్తం చేశారని మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలిపారు. ఈ విషయాన్ని తాను రాసిన ‘ది కొలేషన్ ఇయర్స్’ పుస్తకంలో ప్రణబ్ పేర్కొన్నారు. తాను 2012 జూలై 13వ తేదీన థాకరేను ఆయన ఇంట్లో కలసినట్లు ప్రణబ్ చెప్పారు. థాకరేతో భేటీ కావద్దని సోనియా సూచించారని, అయితే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సూచన మేరకు థాకరేను కలసినట్లు చెప్పారు. తర్వాత ఢిల్లీకి చేరుకున్న తనని కాంగ్రెస్ నాయకురాలు గిరిజా వ్యాస్ కలిశారని చెప్పారు. ‘థాకరేతో నేను సమావేశం కావడం పట్ల సోనియా, అహ్మద్ పటేల్ అసంతృప్తిగా ఉన్నారని గిరిజా వ్యాస్ నాతో చెప్పారు. వారి అసంతృప్తికి గల కారణాన్ని నేను అర్థం చేసుకున్నాను’ అని ప్రణబ్ తెలిపారు. -
సీఎం కిరణ్ దుర్యోధనుడు
మేము అధికారంలోకి వస్తే ఓరుగల్లు రెండో రాజధాని దళిత మోర్చా సదస్సులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హన్మకొండ సిటీ, న్యూస్‌లైన్ : కేంద్రంలో ప్రధానమంత్రిగా ధృతరాష్ర్డుడు, రాష్ట్రంలో సీఎంగా దుర్యోధనుడు ఉన్నాడని... వచ్చే మహాభారత పోరాటంలో ధర్మం, న్యాయం గెలుస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత బీజేపీ అధికారంలోకి వస్తే ఓరుగల్లును రెండో రాజధానిగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. హన్మకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలోని మైదానంలో ఆదివారం బీజేపీ దళిత మోర్చా జిల్లాస్థాయి సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన కిషన్‌రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్.అంబేద్కర్‌ను కాంగ్రెస్ పార్టీ అన్నింటా అవమానించిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రూపొందించిన అంబేద్కర్ చిత్రపటాన్ని పార్లమెంట్లో ఏర్పాటు చేయకపోతే భారత మాజీ ప్రధాని వాజ్‌పేయి ప్రతిపక్ష నాయకుడిగా పోరాటం చేశారని గుర్తు చేశారు. ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్లో పెట్టించారని, అంబేద్కర్‌కు భారతరత్న కూడా ఇప్పించించేందుకు కృషిచేశారన్నారు. వాజ్‌పేయి ప్రభుత్వం దళితుల దే వుడైన అంబేద్కర్‌కు ప్రాధాన్యమిచ్చి రూ.100 కోట్లతో ఆయన స్మారక కేంద్రం నిర్మాణానికి పూనుకుని పనులు మొదలుపెడితే యూపీఏ సర్కార్ అధికారంలోకి రాగానే వాటిని నిలిపివేసిందని ఆరోపించారు. అవినీతి, కుంభకోణాల్లో కూరుకుపోయిన యూపీఏ సర్కార్‌కు గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పట్టించుకోకపోవడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. రాహుల్‌గాంధీ ఐరన్ లెగ్ అని.. ఇటీవ ల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తామని ఆయన భీరాలు పలికితే పార్టీ ఘోర పరాజయం పాలైందని విమర్శించారు. దళితులంతా దండుగా కదలాలి : సంజయ్పాశ్వాన్ వచ్చే ఎన్నికల్లో దళితులంతా దండుగా కదిలి బీజేపీకి అండగా నిలవాలని ఆ పార్టీ దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడు సంజయ్పాశ్వాన్ కోరారు. సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ఓరుగల్లుకు పోరాట చరిత్ర ఉందని, ఈ ప్రాంత దళితులు సమస్యల పరిష్కారం కోసం ఏక తాటిపై నిలిచి ఉద్యమిస్తారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళితుల అభివృద్ధి, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. భారత రాజ్యాంగ నిర్మా త డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రిజర్వేషన్లు ప్రవేశ పెట్టడంతోనే దళితులు సమాజంలో ఇంకా జీవిస్తున్నారని చెప్పారు. వేటగాడి రూపంలో వెంట పడుతున్న అగంతకులపై దళితులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వచ్చే ఎన్ని కల్లో నరేంద్రమోడీ ప్రధాని కాగానే అభివృద్ధి ఎలా ఉండాలి, కులాలు, కులవృత్తుల వారీగా ప్రణాళిక తయారు చేసుకుని ముందుకుపోతున్నామన్నారు. పరిశ్రమల అభివృద్ధికి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాయి అమ్మిన వ్యక్తి దేశానికి ప్రధాని ఎలా అవుతారని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుందని.. చాయి అమ్మిన వారికే పేదల కష్టాలు తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. దళిత, గిరిజనులు, రైతులు, కార్మికులు, వ్యాపారులు, పాన్‌షాప్, చాయి అమ్మేవారంతా మోడీకి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. టికెట్ ఆశించడం లేదు.. హన్మకొండ సిటీ : జిల్లాలో బీజేపీ అభివృద్ధికి తాను ఎంతో కృషి చేస్తున్నాను.. అయినప్పటికీ కొంతమంది నాయకులు వృద్ధుడిని అని చెబుతూ తనను పార్టీ కార్యక్రమాలకు దూరం పెడుతున్నారు.. నేను టికెట్ ఆశించి పార్టీలో ఉండడం లేదని... బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి అన్నారు. సదస్సులో పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి జంగారెడ్డిని మాట్లాడాలని కోరారు. అయితే కొద్ది సేపటికే సమయభావం దృష్ట్యా జంగారెడ్డిని మాట్లాడించలేక పోతున్నామని, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి మాట్లాడతారని చెప్పారు. దీంతో కోపోద్రిక్తుడైన జంగారెడ్డి వేదిక దిగి వెళ్లిపోయారు. గమనించిన పార్టీ నాయకులు వెంటనే ఆయనను సముదాయించి వేదికపైకి తీసుకొచ్చి మాట్లాడించారు. ఈ సందర్భంగా జంగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ దళితులకు అండగా ఉంటుందని చెప్పారు. తాను 1980లోనే ఎస్సీ వర్గీకరణ కావాలని పోరాటం చేశానని, అప్పుడు మందకృష్ణ మాదిగ ఇంకా ఉద్యమం మొదలు పెట్టలేదని తెలిపారు. సదస్సులో దళిత మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కేశపాక రాములు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింత సాంబమూర్తి, నాయకులు డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్, పుష్పలీల, ఎడ్ల అశోక్‌రెడ్డి మార్తినేని ధర్మారావు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, దుగ్యాల ప్రదీప్‌కుమార్, కాసం వెంకటేశ్వర్లు, సునీల్, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి, రావు పద్మ, ఆజ్మీరా కృష్ణవేణి, చాడా శ్రీనివాస్‌రెడ్డి, వన్నాల శ్రీరాములు, జయపాల్, రమేశ్, రాందాస్, ప్రభాకర్, విజయరావు, మార్టీన్ లూథర్, మందాడి సత్యనారాయణరెడ్డి, తిరుపతిరె డ్డి, రాంబాబు, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, డాక్టర్ పి.విజయ్‌చందర్‌రెడ్డి, డాక్టర్ కె.అశోక్‌రెడ్డి, శ్రీరాముల మురళీమనోహర్, పాల్గొన్నారు. కాగా, జిల్లాలోని ఆయా ప్రాంతాల నుంచి యువకులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున బీజేపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇదిలా ఉండగా, పార్టీ దళిత మోర్చా జాతీయ అధ్యక్షుడు సంజయ్ పాశ్వాన్ హిందీలో ప్రసంగించగా మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లాకు చెందిన పార్టీ నాయకురాలు పుష్పలీల ఆయన ప్రసంగాన్ని తెలుగులో అనువదించారు. పార్టీ నాయకుడు గందె నవీన్ కిషన్‌రెడ్డికి గదను అందించగా, డాక్టర్ రామగళ్ల పరమేశ్వర్ తలపాగ ధరింపజేశారు. స్టాచ్ ఆఫ్ యూనిటి ప్రచార రథం ప్రారంభం గుజరాత్‌లోని నర్మదా నది వద్ద నిర్మించనున్న సర్దార్ వల్లబ్బాయి పటేల్ విగ్రహ నిర్మాణానికి ఉక్కును, మట్టిని సేకరించేందుకు చేపట్టనున్న ప్రచార రథాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఆదివారం హన్మకొండలో జరిగిన దళిత సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా వాహనంపై ఏర్పాటు చేసిన సర్థార్ వల్లబ్బాయి పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. గుజరాత్ నుంచి ఈ విగ్రహాన్ని ఇక్కడికి పంపించారు. విగ్రహ నిర్మాణ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రథం జిల్లాలోని ప్రతి గ్రామంలో తిరుగుతూ ఉక్కు, మట్టి సేకరిస్తుంది.