ఎమ్మెల్యే దారుణ హత్య
ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లోని పెషావర్‌లో కైబర్ పక్తున్వ ప్రావిన్స్ ఎమ్మెల్యే సర్దార్ సోరన్ సింగ్ శుక్రవారం దారుణ హత్యకు గురయ్యారు. సోరన్ సింగ్ ప్రయాణిస్తున్న కారుపై దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆయన అక్కడికక్కడే మరణించారు. సోరన్ సింగ్ వైద్యుడిగా, టీవీ యాంకర్‌గా, రాజకీయ నాయకుడిగానే కాకుండా ఖైబర్ ఫక్త్వవా మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆయన ఉన్నారు.