SOS alert
-
కేబీఆర్ పార్కు: ప్లీజ్ ఇక్కడ నేనున్నానని అందరికీ చెప్పరూ!
ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు అవతలి వారికి ఆ విషయం తెలియజేసేందుకు పూర్వకాలంలో గ్రామాలు, ఇతర చారిత్రక ప్రాంతాల్లో ధర్మ గంటలు ఏర్పాటు చేసేవారు. సమస్య ఉన్న వారు ఇక్కడికి వచ్చి ధర్మ గంటను మోగిస్తే సంబంధిత అధికారులు లేదా గ్రామ పెద్దలు అక్కడికి వచ్చి వారి సమస్యను విని పరిష్కరించేవారు. సాక్షి, బంజారాహిల్స్: బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద ‘సేవ్ అవర్ సోల్’ (ఎస్‌వోఎస్) టవర్‌ను రెండేళ్ల క్రితం ఏర్పాటు చేశారు. కేబీఆర్ పార్కు ప్రధాన గేటు ముందు ఏర్పాటు చేసిన ఈ స్తంభానికి పైన ఒక కెమెరా ఏర్పాటు చేశారు. మధ్యలో ఒక బటన్ ఏర్పాటు చేసి అది నొక్కి మాట్లాడితే సంబంధిత కమాండ్ కంట్రోల్లో వారు చెప్పేది వినడమే కాకుండా వారు ఎవరో చూసేందుకు కూడా కెమెరాలు బిగించారు. చదవండి: సినిమా కథను తలపించే లవ్‌స్టోరీ.. ప్రియుడి కోసం భారత్‌కు.. అతడి మరణంతో... ► ఈ ఎస్‌వోఎస్ స్తంభం ఏర్పాటు చేసిన ఏడాదిన్నర తర్వాత ఇటీవలే దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. ► అయితే ఇక్కడొక ధర్మగంట ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ► వారం క్రితం ఇదే కేబీఆర్ పార్కు జీహెచ్ఎంసీ వాక్‌వేలో సినీ నటి షాలూ చౌరాసియాపై, ఈ నెల 2వ తేదీన ఫిలింనగర్‌కు చెందిన ఓ యువతిపై, జనవరి 22వ తేదీన ఓ వైద్యురాలిపై ఆగంతకుడు దాడి చేశాడు. ఆ సమయంలో ఇలాంటి ధర్మగంట ఆ ప్రాంతంలో అందుబాటులో ఉండి ఉంటే వీరు క్షణాల్లో తమ సమస్యను చెప్పుకొని పోలీసుల దృష్టికి వారి సమస్యను తీసుకెళ్లే ఆస్కారం ఉండేది. ► ఈ ఎస్‌వోఎస్ స్తంభం గురించి చాలా మందికి తెలియదు. పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కూడా ఈ ఎస్‌వోఎస్‌కు సంబంధించి కనెక్షన్ కూడా బిగించారు. ► ఎవరైనా తమ సమస్యను చెప్పుకోగానే క్షణాల్లో సమీపంలోని పెట్రోలింగ్ పోలీసులు అక్కడికి చేరుకునే విధంగా దీన్ని ఏర్పాటు చేశారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై బాధితులకు న్యాయంచేసే విధంగా ఏర్పాట్లు చేశారు. చదవండి: టీఎస్ఆర్టీసీపై కిన్నెరసాని మొగులయ్య పాట.. ► తీరా లక్షలాది రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన ఈ ఎస్‌వోఎస్ స్తంభం ఎవరికీ తెలియని దుస్థితిలో ఉండిపోయింది. ► కనీసం ఆ స్తంభం విషయంలో అవగాహన కల్పించాలనే ఆలోచన కూడా సంబంధిత అధికారులకు లేకుండా పోయింది. పలుమార్లు ఈ ఎస్‌వోఎస్ స్తంభంపై అవగాహన కల్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేసినా అధికారులు పట్టించుకోలేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ► కేబీఆర్ పార్కుతో పాటు పీవీఎన్‌ఆర్‌మార్గ్‌లో వీటిని ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీటిపై విస్తృత అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ► బసవతారకం కేన్సర్ ఆస్పత్రి వద్ద, జూబ్లీహిల్స్ రోడ్ నం. 92 సీవీఆర్ న్యూస్ వద్ద, స్టార్ బక్స్ హోటల్ వద్ద, కళింగ కల్చరల్ ట్రస్ట్ అగ్రసేన్ చౌరస్తాలో, బాలకృష్ణ ఇంటి ముందు వీటిని ఏర్పాటు చేయడం ద్వారా వాకర్లకు, సందర్శకులకు ఎంతగానో ఉపయోగపడుతుందని వీరు పేర్కొంటున్నారు. -
అనుకోకుండా ఆ మెసేజ్‌లు: ఇబ్బందుల్లో ఆపిల్ యూజర్లు
శాన్ ఫ్రాన్సిస్కో: ఆపిల్ యూజర్లు మరోసారి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. యూజర్లకు సంబంధంలేకుండానే ఎమర్జన్సీ ఎస్ఓఎస్ మెసేజ్‌లో డెలివరీ అవుతున్నాయట. ఆపిల్ డివైస్‌లు అనుకోకుండా అత్యవసర మెసేజ్‌లను పంపడం తాజాగా కలకలం రేపింది. అనుకోకుండా ఆపిల్ వాచ్‌లు అత్యవసర సందేశాలను పంపుతున్నాయని కొంతమంది యూజర్లు గగ్గోలు పెడుతున్నారు. ఈ సంఘటనలకు సంబంధించిన ఉదంతాలపై ట్విటర్లో పోస్ట్ చేశారు. జాసన్ రోలే అనే వినియోగదారుడు ట్వీట్ ప్రకారం ఆయన ఆపిల్వాచ్ బటన్ ప్రెస్ కావడంతో పోలీసులకు అత్యవసర మెసేజ్ వెళ్లింది. దీంతో పోలీసులు అర్థరాత్రి పరుగెత్తుకు వచ్చారు. ఇలాంటి అ నేక సంఘటనల గురించి ఆపిల్ వినియోగదారులు ట్విట్టర్ లో రిపోర్ట్ చేశారు. ఎస్ఓఎస్ అలర్ట్‌తో తమ బంధువులు ఆందోళనలో మునిగిపోయారని మరికొంతమంది వాపోయారు. జార్జ్ ఎడ్మండ్స్ అనే వినియోగదారుడు మైక్రో-బ్లాగింగ్ సైట్లో ఇలా వ్రాశాడు: "గత రాత్రి ఆలస్యంగా ఇంటికి వెళ్లాను.. నిద్రపోయాను. నా ఫోన్లో అత్యవసర బన్ ప్రెస్ అయింది. దీంతో నిద్రనుంచి లేసి చూసేసరికి సోదరివి బోలెడు మిస్ కాల్స్. నా కేదో అయిపోయిందని భయపడిపోయింది’’. అంతేకాదు ఇలాంటి సమస్యే ఐఫోన్లలో కూడా ఉత్పన్నం కావచ్చని ది వెర్జ్ నివేదించింది. ఎస్ఓఎస్ అలర్ట్ బటన్: యూజర్లు క్లిష్టమైన లేదా అత్యసవరమైన సహాయం అవసరమైన సమయాల్లో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ఉపకరించే వర్చువల్ ఎమర్జెన్సీ బటన్ ఇది. పోలీసులు, బంధువులు సహా ఐదు ఎమర్జెన్సీ కాంటాక్టులకు కాల్స్, ఎస్ఎంఎస్ చేసుకునే సౌలభ్యం. బాధితులు, ఫిర్యాదుదారుల లొకేషన్ ఇండికేషన్ ఆధారంగా ఆటోమేటెడ్‌గా మెసేజ్‌లను పంపుతుంది. -
మీ మొబైల్ఫోన్లో 9 అంకె నొక్కితే చాలు!
న్యూఢిల్లీ: ఆపత్కాలంలో మహిళలను సత్వరమే ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం వినూత్నంగా ముందడుగు వేస్తోంది. మహిళలు ఆపదలో ఉన్నప్పుడు మొబైల్లోని ఒక్క డిజిట్ (అంకె) గట్టిగా నొక్కినా చాలు పోలీసులకు, తమ సన్నిహితులకు 'ప్యానిక్ అలర్ట్' వెళ్లేవిధంగా సరికొత్త విధానాన్ని అందుబాటులోకి తీసుకువస్తోంది. యూజర్ మొబైల్లోని '9' నెంబర్‌ను గట్టిగా నొక్కడం ద్వారా ఎస్‌వోఎస్ సందేశం పోలీసులతోపాటు మరో తొమ్మిదిమంది ఎంచుకున్న వ్యక్తులకు వెళుతుంది. ఈ సందేశంలో యూజర్ ఉన్న ప్రదేశం వివరాలు కూడా ఉంటాయి. స్మార్ట్‌ఫోన్‌లో ఈ సర్వీసు అలర్ట్ చాలా ప్రభావంతంగా పనిచేసే అవకాశముంది. అదేవిధంగా మాములు ఫోన్లలోనూ ఈ సర్వీసు అప్‌గ్రేడ్ చేసే వీలుంది. సాధారణ ఫోన్లలో ఉచితంగా ఈ సర్వీసును అప్‌గ్రేడ్ చేసేందుకు మొబైల్ ఫోన్ తయారీదారులు, టెలిఫోన్ సర్వీసు ప్రోవైడర్లు ముందుకొచ్చారని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నెల నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. 'ప్రతి మొబైల్‌ఫోన్‌లోనూ ఈ సర్వీసు పనిచేస్తుంది. మొబైల్లో ఒక అదనపు బటన్ పెట్టుకోవడం లేదా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం కంటే మొబైల్ ఫోన్లోని ప్రస్తుత పొగ్రామ్‌ను అప్‌గ్రేడ్ చేసుకొని ఈ నూతన సర్వీసును వాడటం మంచింది' అని సీనియర్ అధికారి ఒకరు వివరించారు. ఈ మేరకు నూతన సేవలు అందించాలంటూ కేంద్ర టెలికమ్యూనికేషన్ శాఖ త్వరలోనే టెలికం ప్రొవైడర్లకు అధికారిక ఆదేశాలు ఇచ్చే అవకాశముంది.