soudhi
-
హజ్ యాత్రలో 20 లక్షలు
మౌంట్ అరాఫత్: హజ్ యాత్రలో భాగంగా ఇప్పటివరకూ దాదాపు 20 లక్షల మంది ముస్లింలు సౌదీలోని ‘అరాఫత్’ కొండను దర్శించుకున్నారని సౌదీ అరేబియా ప్రభుత్వం శనివారం తెలిపింది. ఈ యాత్ర సందర్భంగా ఎలాంటి తొక్కిసలాటలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. హజ్ యాత్రలో భాగంగా భక్తులు తొలుత మక్కాను దర్శించి కాబా చుట్టూ ఏడుసార్లు తిరుగుతారు. మరుసటి రోజూ మినా నుంచి అరాఫత్ పర్వతం వద్దకు చేరుకుంటారు. మహమ్మద్ ప్రవక్త తన చివరి ఆధ్యాత్మిక ప్రవచనాన్ని ఇక్కడి నుంచే అందించారు. -
కేటీఆర్ చొరవ.. 39 మందికి విముక్తి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ చొరవతో గల్ఫ్‌లో మగ్గుతున్న 39 మంది తెలంగాణ కార్మికులకు విముక్తి లభించింది. సౌదీ అరేబియాలోని జే అండ్ పీ కంపెనీలో దాదాపు ఏడాదిన్నర కాలంగా బంధించబడ్డ కార్మికులు ఈరోజు హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్‌కు చేరుకున్న వారికి ప్రయాణ ఖర్చుల నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున ఆర్థికసాయం చేసింది. కరీంనగర్, నిర్మల్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు చెందిన సుమారు 60 మంది కార్మికులు గత ఏడాది సౌదీలో నిర్మాణరంగ సంస్థలో పని కోసం వెళ్లారు. అయితే గత ఆరు నెలలుగా వారికి ఎలాంటి వేతనాలు ఇవ్వకుండా కంపెనీ పని చేయించుకోవడంతో పాటు సరైన, ఆహారాన్ని కూడా సంస్థ అందించలేకపోయింది. అనేక కష్టాలు పడుతున్న కార్మికులు తమ సమస్యను ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌కి తెలియజేశారు. దీంతో కార్మికుల సమస్యల పైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కేటీఆర్ కోరారు. దీంతోపాటు కేంద్ర విదేశాంగ అధికారుల సహాయం కూడా తీసుకోవాలని కేటీఆర్ ఆదేశించారు. వారందరి కృషి ఫలితంగా కార్మికులు తెలంగాణ గడ్డమీద అడుగుపెట్టారు. సౌదీ నుంచి తెలంగాణ కార్మికులు స్వరాష్ట్రానికి చేరుకోవడం పట్ల కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. సౌదీలోని భారత రాయభార కార్యాలయంతోపాటు, తెలంగాణ ఎన్నారై శాఖాధికారులకు దన్యవాదాలు తెలిపారు. -
ఫ్లయింగ్ ష్యాషన్ షో...!
అక్కడ మోడళ్లు లేకుండానే ఆకర్షణీయమైన, రంగు రంగుల దుస్తులు తమ ‘ఫ్యాషన్ పరేడ్’ను తామే నిర్వహించాయి. సంప్రదాయ ఫ్యాషన్‌షోలకు భిన్నంగా డ్రోన్లు మోడళ్ల పాత్ర పోషించి ర్యాంప్‌పై నడిచాయి. ఇదంతా ఎక్కడో నూతన పోకడలు, కొత్త ఫ్యాషన్లకు పుట్టిళ్ల వంటి మిలాన్, న్యూయార్క్, పారిస్ నగరాల్లో జరిగిందనుకుంటే మీరు పొరబడినట్టే...ఇంకా మహిళలపై ఆంక్షలు అమలయ్యే, స్త్రీలకు సంపూర్ణహక్కులు కొరవడిన సౌదీ అరేబియాలో ఇలాంటి వినూత్నమైన ప్రయోగం జరిగింది. ఇటీవల జెద్దాలోని హిల్టన్ హోటల్లో జరిగిన ఈ ప్రదర్శనను ‘ఫ్యాషన్ హౌస్’గా పిలుస్తున్నారు. మధ్యప్రాచ్యంలో ఇలాంటి నవతరం టెక్నాలజీకి ఊతమిచ్చేందుకు ఈ షో నిర్వహించారు. అల్జవాహర్జీ అనే డిజైనర్ దీని వెనక సాగించిన కృషి వల్ల ఇది సాధ్యమైంది. రంజాన్ మాసం పవిత్రతకు భంగం కలగకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇంతవరకున్న భావనలకు భిన్నంగా సౌదీ అరేబియాలో గత ఏప్రిల్‌లో జరిగిన ఫ్యాషన్వీక్లో మహిళలుపాల్గొనేందుకు అనుమతినిచ్చారు. మొదట ముస్లిం మహిళలు ధరించే బురఖాను పోలిన ‘నల్లటి అబయ’ను, రెండో ఐటెంగా నల్లటి హ్యాంగర్‌కు తగిలించిన పొడవైన ‘ఆకుపచ్చ కుర్తా’ (దానితోపాటు« ధరించే నెక్లెస్‌తో సహా), మూడో వస్తువుగా స్ట్రాపులతో ఉన్న ప్రింటెడ్ డ్రస్ ప్రదర్శించారు. ఈ మూడు ప్రదర్శనలకు సంబంధించిన వీడియోలో అక్కడి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారి వేలాది వ్యూస్‌ను సొంతం చేసుకున్నాయి. గత ఫిబ్రవరిలో ఇటలీకి చెందిన ఫ్యాషన్ హౌస్ ‘డాల్స్ అండ్ గబానా’ బ్రాండ్ హ్యాండ్‌బ్యాగ్‌లను డ్రోన్ల ద్వారా ప్రదర్శించింది. ఇలాంటి షోలను నిర్వహించడం సాంకేతికంగా సమస్యలతో కూడుకున్నదే. డ్రోన్ల సిగ్నళ్లకు అంతరాయం కలగని విధంగా అతిథుల ఫోన్లలో వైఫైను ఆపేయాలంటూ ముందుగా విజ్ఞప్తిచేశారు. దాదాపు గంట పాటు అయోమయ పరిస్థితులు కొనసాగాక, చివరకు ఈ షో మొదలైంది. డ్రోన్ల ద్వారా హ్యాడ్బ్యాగ్ల మోడలింగ్ వీడియోలు ఆ తర్వాత ఆన్లైన్లో హల్చల్ చేశాయి. -
బతుకుదెరువు కోసం వెళ్లి.. తిరిగిరాని లోకాలకు..
- పెనగలూరు వాసి కువైట్‌లో మృతి పెనగలూరు: బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన ఓ వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. మండలంలోని కొండూరు పంచాయతీ వీఎంపురానికి చెందిన సానేపల్లె నరసింహులు(48) ఆదివారం కువైట్‌లో మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. కువైట్‌కు వెళ్లి బిల్డింగ్ పని చేస్తుండగా రెండవ అంతస్తు నుంచి కాలు జారి ప్రమాదవశాత్తు కింద పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. కువైట్‌లో ఉన్న తమ బంధువులు విషయం తెలిపారని చెప్పారు. ఆయనకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
సౌదీలో రాయికల్ వాసి మృతి
రాయికల్ : రాయికల్‌కు చెందిన గొల్లపల్లి హరీందర్ (46) అనే కార్మికుడు అనారోగ్యంతో సౌదీలో మృతిచెందాడు. తొమ్మిదేళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ వెళ్లిన హరీందర్ వారం క్రితం అనారోగ్యంతో మృతిచెందగా.. కుటుంబీకులకు ఆలస్యంగా సమాచారం అందింది. విషయం తెలుసుకున్న కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తెచ్చేలా చర్యలు చేపట్టాలని వారు వేడుకుంటన్నారు.