Sounderrajan
-
గెలుపెరుగని తమిళిసై.. తొలి మహిళా గవర్నర్‌గా రికార్డ్
సాక్షి, హైదరాబాద్: తమిళనాడుకు చెందిన బీజేపీ నేత డా.తమిళసై సౌందర్‌రాజన్ (58) తెలంగాణ తొలి మహిళా గవర్నర్‌గా నియమితులై ప్రత్యేక గుర్తింపును పొందారు. తమిళనాడులో బీజేపీ కీలక నేతగా వ్యవహరిస్తున్న తమిళసై.. ప్రస్తుతం ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైద్య వృత్తి నుంచి వచ్చిన తమిళిసై అనతికాలంలోనే బీజేపీ మహిళా అగ్రనేతగా ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోలి గ్రామంలో 1961 జూన్2న కుమారి అనంతన్, కృష్ణ కుమారి దంపతులకు తమిళిసై జన్మించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయిన జూన్ 2నే ఆమె జన్మదినం కావడం విశేషం. సౌందర్‌రాజన్ మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తిచేశారు. అనంతరం కొంత కాలంపాటు వైద్యురాలిగా సేవలందించారు. ఆమె భర్త సౌందర్‌రాజన్ కూడా తమిళనాడులో ప్రముఖ వైద్యుడే. కార్యకర్త నుంచి పార్టీ చీఫ్‌గా.. సౌందర్‌రాజన్ తండ్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా గుర్తింపు పొందారు. ఆ పార్టీ తరఫున పార్లమెంట్‌కు కూడా ఎన్నికయ్యారు. కుటుంబమంతా కాంగ్రెస్ పార్టీతో కొనసాగినప్పటికీ.. తమిళసై మాత్రం భిన్నంగా బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో మద్రాస్ మెడికల్ కళాశాలలో చదువుతున్న రోజుల్లో విద్యార్థిని నాయకురాలుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అనంతరం బీజేపీలో పూర్తిస్థాయి కార్యకర్తగా చేరి అనేక పదవుల్లో పార్టీకి సేవలందించారు. 1999లో సౌత్ చెన్నై జిల్లా విద్యా విభాగం కార్యదర్శిగా, 2001లో రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, ఆ తరువాత 2007 పార్టీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా, 2013లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఉన్నారు. తాజాగా తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైయ్యారు. చదవండి: తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్ అన్నింటా ఓటమే.. సుదీర్ఘ కాలంపాటు రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యే అవకాశం సౌందర్‌రాజన్‌కు రాలేదు. 2006, 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఘోర పరాజాయాన్ని చవి చూశారు. అనంతరం 2009, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేసి ఓటమి చెందారు. గత ఎన్నికల్లో తూత్తుకుడి లోక్‌సభ స్థానం నుంచి డీఎంకే నేత కనిమొళిపై పోటీ చేసి 2 లక్షలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్
-
తెలంగాణ నూతన గవర్నర్‌గా సౌందర్‌రాజన్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ నూతన గవర్నర్‌గా తమిళనాడుకు చెందిన తమిళి సై సౌందర్‌రాజన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయం తీసుకుంది. తెలంగాణ గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను బదిలీ చేస్తూ.. నూతన గవర్నర్‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. సౌందర్ రాజన్ ప్రస్తుతం తమిళనాడు బీజేపీ చీఫ్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అలాగే తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులయ్యారు. గవర్నర్ల నియమకంలో కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది. బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమించి.. అక్కడ ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న కల్రాజ్ మిశ్రాను రాజస్తాన్‌కు బదిలీ చేసింది. తెలంగాణ: తమిళిసై సౌందర్‌రాజన్ హిమాచల్ ప్రదేశ్: బండారు దత్తాత్రేయ రాజస్తాన్: కల్రాజ్ మిశ్రా మహారాష్ట్ర: భగత్‌సింగ్ కోశ్యారీ కేరళ: మహ్మద్ ఖాన్ -
‘కూటమిలో కొత్త పార్టీలు లేవు’
సాక్షి, చెన్నై : సొంత ప్రతిఫలం కోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు సౌందర్‌రాజన్ విమర్శించారు. తెలుగు ప్రజలందరూ చంద్రబాబు తీరును గమనిస్తున్నారని.. ఆయనకు ప్రజలే తగిన బుద్ది చెప్తురని ఆమె అన్నారు. మహాకూటమిలో ఉన్న పార్టీలన్నీ మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమైనవని.. కొత్త పార్టీలేవీ వాటిలో లేవని వ్యాఖ్యానించారు. ప్రజల క్షేమాన్ని మరిచి చంద్రబాబు తన ప్రయోజనాల కోసమే మోదీని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. -
బీజేపీ అధ్యక్షురాలిగా తమిళిసై
చెన్నై, సాక్షి ప్రతినిధి : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) రాష్ట్ర అధ్యక్షురాలిగా డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ నియమితులయ్యూరు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా శనివారం ప్రకటించారు. మరో సీని యర్ నేత హెచ్ రాజాను జాతీయ కార్యదర్శిగా పార్టీ నియమించింది. పార్టీలో అనేక హోదాల్లో పనిచేసిన అనుభవం ఉన్న తమిళిసైకు పార్టీ పగ్గాలు ఇస్తారనే ప్ర చారం ఎంతో కాలంగా సాగుతోంది. అయితే ఆమెకు పోటీగా సీనియర్ నేతలు ఇల గణేశన్, హెచ్ రాజాల పేర్లు కూడా వినిపించాయి. గవర్నర్ పదవిని ఆశిస్తున్న ఇల గణేషన్ స్వచ్ఛదంగా పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో పోటీ తమిళిసై, రాజాల మధ్యనే నడిచింది. దాదాపు రెండు నెలలుగా సాగుతున్న ఉత్కంఠకు పార్టీ ఎట్టకేలకూ తెరదించి తమిళిసైకు పార్టీ పగ్గాలు అప్పగించింది. మహిళాకర్షణతో చెక్ దక్షిణాది రాష్ట్రాల్లో అధికారం చేజిక్కుంచుకునే అంశం లో బీజేపీ ఏ ఒక్క అవకాశాన్ని చేజార్చుకునేలా లేదు. రాబోయే సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకోసం పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా స్వయంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. రాష్ర్టంలో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోడీని ప్రకటించిన తరువాత ఆపార్టీకి జీవం వచ్చింది. తిరుచ్చిలో మోడీ నిర్వహించిన తొలి ఎన్నికల ప్రచార సభతో ఒక్కసారిగా ఎక్కడలేని ఊపువచ్చింది. ఆ తరువాత వరుసగా తమిళనాడులో సాగిన మోడీ సభలతో బీజేపీ ఒక ప్రధాన పార్టీగా మారిపోయింది. అన్నాడీఎంకే, డీఎంకే మినహా అన్ని ప్రాంతీ య పార్టీలు బీజేపీ పొత్తుకోసం క్యూకట్టాయి. కూటమి లో చేరిపోయాయి. రాష్ట్రంలో బలమైన ఏకైక జాతీయ పార్టీగా వెలుగొందుతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ పరిణామంతో ఖంగుతింది. ఎన్నికల ఫలితాల తరువాత బలహీన పార్టీగా కాంగ్రెస్ మారిపోయింది. దీంతో ప్రాంతీయ పార్టీలు బీజేపీ చుట్టూ తిరుగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలే కొలమానం రాష్టంలోని జాతీయ, ప్రాంతీయ పార్టీల బలాబలాలకు 2016 అసెంబ్లీ ఎన్నికలే కొలమానంగా మారనున్నా రుు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర కాలం మాత్రమే ఉండడంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్ర అసెంబ్లీపై దృష్టి పెట్టినట్లు సమాచారం. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న పొన్ రాధాకృష్ణన్‌కు కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కడంతో కొత్త అధ్యక్షుని అన్వేషణ మొదలైంది. పాత పరిస్థితులలోనైతే ఏదో ఒక వ్యక్తికి కట్టబెట్టి చేతులు దులుపుకునేవారు. ప్రతికూల పరిస్థితులను సైతం అనుకూలంగా మార్చగల చతురుడిగా అమిత్‌షాపై ముద్రపడిపోగా, ఆ ముద్రను తమిళనాడుపై కూడా వేసేందుకు ఆయన భారీ కసరత్తునే చేసినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీని బలమైన పార్టీగా తీర్చిదిద్దగల వారికే అధ్యక్ష పదవిని కట్టబెట్టాలని జాప్యం చేస్తూ వచ్చారు. రాష్ట్ర అధ్యక్షుని స్థానానికి మొన్నటి వరకు వినపడిన హెచ్ రాజాను జాతీయ కార్యదర్శిగా నియమించడం ద్వారా తమిళిసైకు మార్గం సుగమం చేశారు. రాష్ట్రంలో అమ్మ (సీఎం జయలలిత) హవాను దీటుగా ఎదుర్కోవాలంటే మరో మహిళ అవసరమని అమిత్ షా భావించినట్లు సమాచారం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నందున కాంగ్రెస్ మినహా దాదాపుగా అన్ని పార్టీలు కమలనాథుల కరుణ కోసం కాచుకుని ఉన్నాయి. అన్నాడీఎంకే పరోక్షంగా ఇప్పటికే స్నేహహస్తం చాచింది. అయితే గతంలో బీజేపీకి వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో చేదు అనుభవం ఉంది. అలాగని బలమైన ప్రాంతీయ పార్టీ లేకుండా రాష్ట్రంలో నెగ్గుకురావడం అసాధ్యం. ఈ అంశాలన్నీ అమిత్‌షా తన అంతర్గత సమావేశంలో రాష్ట్ర నేతలతో చర్చించినట్లు సమాచారం. కాబట్టే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని నియామకంలో అమిత్‌షా ఆచితూచి అడుగువేసినట్లు జాతీయనేత ఒకరు పేర్కొనడం గమనార్హం.