
సాక్షి, చెన్నై : సొంత ప్రతిఫలం కోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు సౌందర్‌రాజన్ విమర్శించారు. తెలుగు ప్రజలందరూ చంద్రబాబు తీరును గమనిస్తున్నారని.. ఆయనకు ప్రజలే తగిన బుద్ది చెప్తురని ఆమె అన్నారు. మహాకూటమిలో ఉన్న పార్టీలన్నీ మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమైనవని.. కొత్త పార్టీలేవీ వాటిలో లేవని వ్యాఖ్యానించారు. ప్రజల క్షేమాన్ని మరిచి చంద్రబాబు తన ప్రయోజనాల కోసమే మోదీని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment