తెలుగు విద్యార్థుల సమస్యలపై చర్చిస్తా: మంత్రి గంటా | Telugu student issues discussed : the minister | Sakshi
Sakshi News home page

తెలుగు విద్యార్థుల సమస్యలపై చర్చిస్తా: మంత్రి గంటా

Published Wed, Jan 6 2016 7:47 PM | Last Updated on Sun, Sep 3 2017 3:12 PM

Telugu student issues discussed : the minister

తమిళనాడులో తెలుగుభాష పరీక్ష విధానం రద్దు.. తెలుగు విద్యార్థుల సమస్యలపై ఆ రాష్ట్ర సీఎంతో చర్చిస్తామని రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. బుధవారం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తెలుగుభాష రద్దు నిర్ణయాన్ని తమిళనాడు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఇప్పటికే తమిళనాడు ముఖ్య మంత్రి జయలలితకు,  చంద్రబాబు నాయుడు లేఖ రాశారని చెప్పారు. మంత్రి పల్లె రఘునాథరెడ్డి స్వయంగా వెళ్లి సమస్యపై చర్చించారని అన్నారు.  మూడో విడత జన్మభూమి కార్యక్రమం విజయవంతంగా సాగుతోందన్నారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement