sour experience
-
అఖిలప్రియకు చేదుఅనుభవం
విజయవాడ: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు గురువారం చేదు అనుభవం ఎదురైంది. అఖిలప్రియ సచివాలయానికి వెళుతుండగా అదే మార్గంలో ప్రతిపక్ష నేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాన్వాయ్ వచ్చింది. జగన్ వస్తున్నారని తెలిసి రైతులు, స్థానికులు భారీగా తరలివచ్చారు. రోడ్డు పొడవునా వాహనాలు బారులు తీరడంతో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో చేసేదేమి లేక అఖిలప్రియ అక్కడి నుంచి వెనుదిరిగారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) పరిధిలోని గ్రామాల్లోని రైతులను కలుసుకునేందుకు వైఎస్ జగన్ నేడు పర్యటిస్తున్నారు. -
చంద్రబాబుకు చేదు అనుభవం
-
చంద్రబాబుకు చేదు అనుభవం
విజయవాడ: రాష్ట్రస్థాయి పుష్ప, ఫల ప్రదర్శన ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. చంద్రబాబు ఎదుట కాల్ మనీ బాధితులు ఆందోళనకు దిగారు. టీడీపీ నేతలే కాల్ మనీ వ్యాపారులుగా మారి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న బంధువులు నుంచి రక్షణ కల్పించాలని నినాదాలు చేశారు. బాధితుల ఆందోళనతో చంద్రబాబు అవాక్కయ్యారు. సభలో అల్లరి చేయొద్దంటూ హెచ్చరించే ప్రయత్నం చేశారు. క్యాంప్ కార్యాలయానికి వచ్చి కలవాలని బాధితులకు సూచించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత కాల్ మనీ బాధితుల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. చంద్రబాబు ఎదుట నినాదాలు చేసిన శివరామ్ అనే యువకుడిని సీఎం వెళ్లిపోయిన తర్వాత పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.