రెండో టెస్టులో దక్షిణాఫ్రికా-ఎ జట్టు తడబడి పుంజుకుంది
ప్రిటోరియా: భారత్-ఎతో శనివారం ప్రారంభమైన నాలుగు రోజుల అనధికార రెండో టెస్టులో దక్షిణాఫ్రికా-ఎ జట్టు తడబడి పుంజుకుంది. పార్నెల్ (64 నాటౌట్), హర్మర్ (68 నాటౌట్)లు అర్ధసెంచరీలతో ఆదుకోవడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 81.3 ఓవర్లలో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది. ఎల్సీ డివిలియర్స్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది.
ఓపెనర్లు హెండ్రిక్స్ (2), ఎల్గర్ (0), రోసోవ్ (3) వెంటవెంటనే అవుట్ కావడంతో ప్రొటీస్ 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. టెంబా బావుమా (42), ఆన్‌టాంగ్ (28)లు నాలుగో వికెట్‌కు 40 పరుగులు జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. 20వ ఓవర్లో ఆన్‌టాంగ్... 33వ ఓవర్లో నాలుగు బంతుల వ్యవధిలో సోలెకిలి (13), బావుమాలు వెనుదిరిగారు. దీంతో దక్షిణాఫ్రికా 97 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి మరోసారి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో పార్నెల్, హర్మర్ వికెట్‌ను కాపాడుకుంటూ నిలకడగా ఆడారు. వీరిద్దరు ఏడో వికెట్‌కు అజేయంగా 134 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. ఆరంభంలో చెలరేగిన భారత బౌలర్లు తర్వాత నిరాశపర్చారు. ఈశ్వర్ పాండే, రసూల్ చెరో రెండు వికెట్లు తీశారు.
స్కోరు వివరాలు
దక్షిణాఫ్రికా ‘ఎ’ ఇన్నింగ్స్: హెండ్రిక్స్ (సి) సాహా (బి) పాండే 2; ఎల్గర్ (సి) నదీమ్ (బి) కౌల్ 0; రోసోవ్ (సి) పుజారా (బి) పాండే 3; బావుమా ఎల్బీడబ్ల్యూ (బి) రసూల్ 42; ఆన్‌టాంగ్ (సి) విజయ్ (బి) నదీమ్ 28; సోలెకిలి (సి) నదీమ్ (బి) రసూల్ 13; పార్నెల్ నాటౌట్ 64; హర్మర్ నాటౌట్ 68; ఎక్స్‌ట్రాలు: 11; మొత్తం: (81.3 ఓవర్లలో 6 వికెట్లకు) 231.
వికెట్లపతనం: 1-2; 2-2; 3-11; 4-51; 5-97; 6-97
బౌలింగ్: ఈశ్వర్ పాండే 16-3-49-2; సిద్ధార్థ్ కౌల్ 14.3-4-43-1; బిన్ని 8-4-13-0; నదీమ్ 22-5-65-1; పర్వేజ్ రసూల్ 18-6-39-2; రాయుడు 3-0-14-0.