south africa cricketers
-
IPL 2023: గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. హ్యాండ్ ఇచ్చిన కిల్లర్ మిల్లర్
David Miller: ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు ఛాంపియన్ ఆటగాడు డేవిడ్ మిల్లర్ సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరంగా ఉండనున్నట్లు స్వయంగా వెల్లడించాడు. వరల్డ్ కప్ సూపర్ లీగ్ (WCSL)లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగే అత్యంత కీలకమైన రెండు వన్డే మ్యాచ్‌లకు అందుబాటులో ఉండేందుకు మిల్లర్‌తో పాటు ఐపీఎల్లో పాల్గొనే పలువురు సఫారీ స్టార్ ప్లేయర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. సరిగ్గా ఐపీఎల్-2023 ప్రారంభ తేదీనే (మార్చి 31) సౌతాఫ్రికా నెదర్లాండ్స్‌తో తొలి వన్డే, అనంతరం ఏప్రిల్ 2న రెండో వన్డే ఆడాల్సి ఉంది. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే ప్రపంచ కప్‌కు నేరుగా అర్హత సాధించాలంటే దక్షిణాఫ్రికా ఈ రెండు వన్డేల్లో గెలిచి తీరాలి. అందుకే క్రికెట్ సౌతాఫ్రికా స్టార్ ఆటగాళ్లనంతా ఈ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండాలని కోరింది. ఇది మ్యాండేటరీ కాకపోయినప్పటికీ.. జాతీయ జట్టు అవసరాల దృష్ట్యా సౌతాఫ్రికా క్రికెటర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిల్లర్‌తో పాటు సఫారీ ఆటగాళ్లు ఎయిడెన్ మార్క్రమ్ (ఎస్ఆర్హెచ్), హెన్రిచ్ క్లాసెన్ (ఎస్ఆర్హెచ్), మార్కో జన్సెన్ (ఎస్ఆర్హెచ్), అన్రిచ్ నోర్జే, లుంగి ఎంగిడి (ఢిల్లీ క్యాపిటల్స్), ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రెవిస్ (ముంబై ఇండియన్స్), క్వింటన్ డికాక్ (లక్నో), రబాడ (పంజాబ్) ఐపీఎల్-2023లో వారాడే ఒకటి, రెండు మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. కాగా, గతేడాది ఐపీఎల్‌కు ముందు కూడా సౌతాఫ్రికా క్రికెటర్లకు ఇలాంటి పరిస్థితే ఏర్పడింది. అయితే అప్పుడు రబాడ, ఎంగిడి, జన్సెన్, మార్క్రమ్, డస్సెన్‌లు జాతీయ జట్టుకు కాకుండా ఐపీఎల్‌కు ప్రధమ ప్రాధాన్యత ఇచ్చి లీగ్‌లో ఆడారు. అప్పుడు సౌతాఫ్రికా.. బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ ఆడింది. ఐపీఎలా లేక జాతీయ జట్టా అన్న నిర్ణయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ఆటగాళ్లకే వదిలేయడంతో వారు అప్పట్లో ఐపీఎల్‌కే ఓటేశారు. -
ఒకే జట్టులో కోహ్లి-బాబర్, బుమ్రా-అఫ్రిది..?
ప్రస్తుత తరంలో మేటి క్రికెటర్లుగా పరిగణించబడే విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, రోహిత్ శర్మలు ఒకే జట్టులో ఆడితే చూడాలని ఉందా..? అయితే మీ కోరిక నెరవేరే రోజు మరెంతో దూరంలో లేదు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) ప్రత్యేక చొరవ తీసుకుని ఈ బ్యాటింగ్ దిగ్గజాలను ఒకే డ్రెస్సింగ్ రూమ్ షేర్ చేసుకునేలా ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ఆసియా దేశాల క్రికెటర్లు ఓ జట్టులో, ఆఫ్రికా దేశాల క్రికెటర్లు మరో జట్టుగా ఏర్పడి జరిగే ఆఫ్రో-ఆసియా క్రికెట్ కప్‌ను పునఃప్రారంభించాలని ఏసీసీ కసరత్తు చేస్తుంది. వివిధ కారణాల చేత 2007లో నిలిచిపోయిన ఈ టోర్నీని తిరిగి నిర్వహించేందుకు ఏసీసీ ప్రతినిధులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా వారు భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తదితర క్రికెట్ బోర్డులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ విషయాన్ని ఏసీసీ కమర్షియల్ అండ్ ఈవెంట్స్ హెడ్ ప్రభాకరన్ తన్రాజ్ మీడియాకు వెల్లడించారు. ఈ టోర్నీ నిర్వహణకు బీసీసీఐ అంగీకరిస్తే మిగతా దేశాల క్రికెట్ బోర్డుల నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని ప్రభాకరన్ అభిప్రాయపడ్డాడు. బీసీసీఐ కనుక ఏసీసీ ప్రతిపాదనకు ఓకే చెబితే రోహిత్ శర్మ, మహ్మద్ రిజ్వాన్, విరాట్ కోహ్లి, బాబర్ ఆజమ్, జస్ప్రీత్ బుమ్రా, షాహీన్ అఫ్రిది లాంటి ప్రపంచస్థాయి క్రికెటర్లను ఒకే జట్టులో చూడవచ్చు. కాగా, ఈ టోర్నీ తొలిసారి 2005లో జరిగింది. నాడు షాహిద్ అఫ్రిది, వీరేంద్ర సెహ్వాగ్, సనత్ జయసూర్య లాంటి విధ్వంసకర ఆటగాళ్లు కలిసి ఆసియా జట్టుకు ప్రాతినిధ్యం వహించగా.. గ్రేమ్ స్మిత్, ఏబీ డివిలియర్స్, జాక్ కలిస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఆఫ్రికా జట్టు తరఫున ఆడారు. ఆసియా ఎలెవెన్ తరఫున భారత్, పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్ దేశాల ఆటగాళ్లు ఆడగా.. ఆఫ్రికా ఎలెవెన్ తరఫున సౌతాఫ్రికా, కెన్యా, జింబాబ్వే దేశాల క్రికెటర్లు ఆడారు. చదవండి: పాకిస్తాన్ మాజీ క్రికెటర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. -
క్రికెట్‌కు దుర్దినం: ఎస్‌ఏసీఏ
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో భారత పర్యటనను కుదించడాన్ని దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ (ఎస్‌ఏసీఏ) తీవ్రంగా విమర్శించింది. క్రికెట్‌కు ఇది దుర్దినమని, ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల దేశంలో ఆట చాలా నష్టపోతుందని వ్యాఖ్యానించింది. ‘అంతర్జాతీయ క్రికెట్‌కు ఇది చెడ్డ రోజు. ఆటగాళ్లకే కాకుండా అభిమానులకు కూడా పెద్ద నష్టం. రెండు దేశాల బోర్డు నిర్ణయాలతో ఓ పూర్తి స్థాయి సిరీస్ చేజారింది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోటీని కోల్పోతున్నాం. దేశంలో క్రికెట్ ప్రయోజనాలను ఎవరూ కాపాడలేకపోతున్నారు. మొత్తానికి ఇక్కడ క్రికెట్ ఓడింది’ అని ఎస్‌ఏసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ ఐరిష్ ధ్వజమెత్తారు. టూర్‌ను కుదించడం వల్ల ఆర్థికంగా సీఎస్ఏ తీవ్రంగా నష్టపోతుందని వాపోయారు. క్రికెటర్లతో పాటు ఆట అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.