జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో భారత పర్యటనను కుదించడాన్ని దక్షిణాఫ్రికా క్రికెటర్స్ అసోసియేషన్ (ఎస్‌ఏసీఏ) తీవ్రంగా విమర్శించింది. క్రికెట్‌కు ఇది దుర్దినమని, ఇలాంటి తప్పుడు నిర్ణయాల వల్ల దేశంలో ఆట చాలా నష్టపోతుందని వ్యాఖ్యానించింది. ‘అంతర్జాతీయ క్రికెట్‌కు ఇది చెడ్డ రోజు. ఆటగాళ్లకే కాకుండా అభిమానులకు కూడా పెద్ద నష్టం.
రెండు దేశాల బోర్డు నిర్ణయాలతో ఓ పూర్తి స్థాయి సిరీస్ చేజారింది. ముఖ్యంగా టెస్టు ఫార్మాట్‌లో రెండు అగ్రశ్రేణి జట్ల మధ్య పోటీని కోల్పోతున్నాం. దేశంలో క్రికెట్ ప్రయోజనాలను ఎవరూ కాపాడలేకపోతున్నారు. మొత్తానికి ఇక్కడ క్రికెట్ ఓడింది’ అని ఎస్‌ఏసీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోనీ ఐరిష్ ధ్వజమెత్తారు. టూర్‌ను కుదించడం వల్ల ఆర్థికంగా సీఎస్‌ఏ తీవ్రంగా నష్టపోతుందని వాపోయారు. క్రికెటర్లతో పాటు ఆట అభివృద్ధి కార్యక్రమాలపై కూడా దీని ప్రభావం ఉంటుందని హెచ్చరించారు.
క్రికెట్‌కు దుర్దినం: ఎస్‌ఏసీఏ
Published Wed, Oct 23 2013 12:47 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement