ఈ ఏడాది అమర జవాన్లు 64 మంది
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్లో ఉడీ దాడి మృతులను కలుపుకుని ఈ ఏడాది ఇప్పటి వరకు 64 మంది సైనికులు మరణించారు. ఆరేళ్లలో ఈ సంఖ్యే అత్యధికం. 2010లో 69 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. దక్షిణ ఆసియా తీవ్రవాద పోర్టల్(ఎస్ఏటీపీ) నివేదికలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.
ఆశ్చర్యకరంగా నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట పౌర మృతుల సంఖ్య ఈ ఏడాది మూడు దశాబ్దాల్లో కనిష్టంగా నమోదైందని పోర్టల్ తెలిపింది. 1990 నుంచి 2007 మధ్య ఏడాదికి సగటున 800 మంది పౌరులు చనిపోయారని వెల్లడించింది.