South Central Railway Recruitment Cell
-
ఆర్ఆర్సీ గ్రూప్ -డి ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులు
హైదరాబాద్: సౌత్ సెంట్రల్ రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నవంబర్ 16, 23, 30 తేదీల్లో గ్రూప్ డి పోస్టుల భర్తీకి రాత పరీక్ష నిర్వహించనుంది. ఆఫ్లైన్ (పేపర్ బేస్ట్)లో జరిగే ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుం ది. సమయం 90 నిమిషాలు. ఈ తరుణంలో గ్రూప్-డి పరీక్షకు సమగ్ర స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందించడంతో పాటు సాక్షి నిపుణులతో రూపొందించిన ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్ట్లు, మాక్ టెస్టులను రూపొందించింది. వీటితో పాటు డౌన్లోడ్ చేసుకునేందుకు వీలుగా ‘కీ’తో కూడిన మోడల్ పేపర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మోడల్ టెస్ట్స్ ప్రత్యేకతలు: అన్ని ప్రశ్నలకు సమాధానాలతో 5 గ్రాండ్ టెస్ట్లు 24/7 ఎన్ని సార్లైనా పరీక్ష రాసుకునే సౌలభ్యం పరీక్ష ముగిసిన వెంటనే గ్రేడులతో కూడిన ఫలితాలు అభ్యర్థి ప్రదర్శనను తెలిపే గ్రాఫికల్ పెర్ఫార్మెన్స్ రిపోర్టులు సబ్జెక్టుల వారీ వీక్ అండ్ స్ట్రాంగ్ ఏరియా అనాలసిస్ వెబ్సైట్:http://onlinetests.sakshieducation.com/http://sakshieducation.com/RRB/ Groupd-model-test.html -
రైల్వే గ్రూప్-డి ఫలితాలు వెల్లడి
సాక్షి,హైదరాబాద్: దక్షిణ మధ్య రైల్వే రిక్రూట్మెంట్ సెల్ 2012 ఆగస్టు 17న నిర్వహించిన గ్రూప్ డి ఫలితాలను శుక్రవారం వెల్లడించింది. ఈ పరీక్షల్లో 1,098 మంది ఉద్యోగాలకు ఎంపికైనట్లు సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. వీరికి రూ.1,800 గ్రేడ్ పేతో జీతభత్యాలు లభిస్తాయని పేర్కొన్నారు. రూ.5,200 నుంచి రూ.20,200 వేతన స్కేలు ఉంటుందన్నారు. ఎంపికైన అభ్యర్థులకు త్వరలో అపాయింట్మెంట్ లెటర్లు అందుతాయని చెప్పారు. ఫలితాలు, ఇతర వివరాలకు 040-27788824 కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చని సూచించారు.