South Indian movie industry
-
ఓకే ఏడాదిలో నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ!
ఓటీటీ వచ్చాక థియేటర్లకు ప్రేక్షకుల పరుగులు తగ్గిపోయాయి. వెండితెర ప్రదర్శనలు వారాలకే పరిమితమయ్యాయి. ఎంత పెద్ద హీరో సినిమా అయినా.. సినిమా ఎంత బాగున్నా సరే యాభై రోజుల లోపు స్మార్ట్ తెరకు తేవాల్సిందే. అందుకే బెనిఫిట్ షోలు.. అడ్డగోలుగా పెంచుతున్న టికెట్ రేట్లతో సినిమాలకు కలెక్షన్లు రాబడుతున్న రోజులివి. అయినా అనుకున్న ఫిగర్‌ను రీచ్ కాలేకపోతున్నారు కొందరు నిర్మాతలు. కానీ, కళ్లు చెదిరేరీతిలో కలెక్షన్లతో.. ఈ ఏడాది టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది మలయాళ చిత్ర పరిశ్రమ. వాస్తవికతతో పాటు ఆహ్లాదకరమైన కథలను అందించే చిత్ర పరిశ్రమగా పేరున్న మాలీవుడ్‌కు పేరు దక్కింది. అంతర్జాతీయంగానూ ఆ చిత్రాలకు అంతే గుర్తింపు దక్కుతోంది. కానీ, ఇదే పరిశ్రమకు వంద కోట్ల చిత్రం ఒక కలగానే ఉండేది. లిమిట్ బడ్జెట్, దానికి తగ్గట్లుగా తెరకెక్కే చిత్రం.. అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టేది మలయాళ సినిమా. ఫలితంగా రూ.20.. 30 కోట్ల కలెక్షన్లు రావడమే కష్టంగా ఉండేది. అయితే.. మలయాళం సినిమా మొదలైన 85 ఏళ్లకు(1928లో తొలి చిత్రం రిలీజ్..).. హాఫ్ సెంచరీ క్లబ్‌లోకి ‘దృశ్యం’(2013) రూపంలో ఓ చిత్రం అడుగుపెట్టింది. ఆ తర్వాత మరో మూడేళ్లకు ‘పులిమురుగన్’ సెంచరీ క్లబ్‌కి అడుగుపెట్టిన తొలి మల్లు చిత్ర ఘనత దక్కించుకుంది. అలాంటి సినీ పరిశ్రమ ఇప్పుడు.. 2024 ఏడాదిలో ఏకంగా నాలుగు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాది ట్రేడ్ పండితులనే ఆశ్చర్యపోయేలా చేసింది.ఈ ఏడాది విడుదలైన మలయాళ చిత్రాల్లో ఐదు సినిమాలు కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించాయి. అందులో మొదటిది.. మంజుమ్మల్ బాయ్స్. కేరళ-తమిళనాడు సరిహద్దులోని మిస్టరీ గుహల్లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన చిత్రమిది. కేరళలో మాత్రమే కాదు.. తమిళనాట సైతం ఈ చిత్రం సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. కమల్ హాసన్ ‘గుణ’ లోని పాట.. మంజుమ్మల్ బాయ్స్ బ్యాక్‌డ్రాప్‌కే హైలైట్. టోటల్ రన్లో ఏకంగా డబుల్ సెంచరీ(రూ.240 కోట్ల వసూళ్లు) రాబట్టి.. ఆ భాషలో కలెక్షన్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.ది గోట్ లైఫ్ (ఆడుజీవితం)పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పెట్టి నటించిన సినిమా. విడుదలకు ముందే అంతర్జాతీయ వేదికల్లోనూ ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. ఎడారి దేశంలో ఓ వలసజీవి ఎదుర్కొనే అవస్థలే ఈ చిత్ర కథాంశం. నజీబ్ అనే వ్యక్తి వాస్తవ గాథను బెన్యామిన్ ‘ఆడుజీవితం’గా నవల రూపకంలోకి తీసుకెళ్తే.. దానిని రచయిత కమ్ దర్శకుడు బ్లెస్సీ వెండితెరపైకి తేవడానికి 16 ఏళ్లు పట్టింది. కలెక్షన్లపరంగా 150 కోట్లు రాబట్టిన ఈ చిత్రం.. అవార్డులను సైతం కొల్లగొట్టింది.ఆవేశం ఫహద్ ఫాజిల్ వన్ మేన్ షో. ముగ్గురు కాలేజీ యువకులకు, ఎమోషనల్ గ్యాంగ్‌స్టర్ రంగా మధ్య నడిచే కథ ఇది. మలయాళంలో జీతూ మాధవన్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం ఏకంగా 156 కోట్లు రాబట్టింది ఈ చిత్రం. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల్లో రీల్స్ ద్వారా ఈ చిత్రం మరింత ఫేమస్ అయ్యింది.ఏఆర్ఎం(అజయంతే రంధం మోషణం)మిన్నల్ మురళితో తెలుగువారిని సుపరిచితుడైన టోవినోథామస్ లీడ్‌లో తెరకెక్కిన చిత్రం. ఓ వంశంలో మూడు తరాలకు.. ఓ విగ్రహ నేపథ్యంతో నడిచే కథ ఇది. జితిన్‌లాల్ ఈ యాక్షన్ థిల్లర్‌ను తెరకెక్కించారు. ఫుల్ రన్లో వంద కోట్లు రాబట్టింది ఈ చిత్రం.ప్రేమలుమలయాళంలో చిన్నచిత్రంగా వచ్చి.. కలెక్షన్లపరంగా అద్భుతం సృష్టించింది ఈ చిత్రం.యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా గిరిష్ ఏడీ దీనిని తెరకెక్కించాడు. ఏకంగా 136 కోట్ల వసూళ్లు రాబట్టింది.ఈ చిత్రాలు బోనస్..మాలీవుడ్‌కు నిజంగా ఇది లక్కీ ఇయరే. పై ఐదు చిత్రాలు మాత్రమే కాదు.. కలెక్షన్లపరంగా మరికొన్ని చిత్రాలు రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టాయి. ఇందులో.. విపిన్ దాస్ డైరెక్షన్లో పృథ్వీరాజ్ సుకుమారన్-బసిల్ జోసెఫ్-నిఖిలా విమల్ నటించిన గురువాయూర్ అంబలనాదయిల్, రూ.90 కోట్లతో సెంచరీ క్లబ్‌కి ఎక్కడం మిస్ అయ్యింది ఈ సినిమా. ఇక.. వినీత్ శ్రీనివాసన్ డైరెక్షన్లో ప్రణవ్ మోహన్‌లాల్ లీడ్ో నటించిన ‘‘వర్షన్గలక్కు శేషం’’, దింజిత్ అయ్యతాన్ డైరెక్ట్ చేసిన లేటెస్ట్ సెన్సేషన్ ‘‘కష్కింద కాండం’’, మమ్మూటి నటించిన ‘టర్బో’, ‘భ్రమయుగం’ చిత్రాలు మాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించి.. ఇతర చిత్ర పరిశ్రమలు కుళ్లుకునేలా చేశాయి. -
సౌత్ సినిమాలను చూసి భయపడుతున్నారు: బాలీవుడ్ నటుడు
సౌత్ సినిమాలపై బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పుష్ప, కేజీఎఫ్ చాప్టర్ 2, ఆర్ఆర్ఆర్ సినిమా విజయాలు బాలీవుడ్ దర్శకనిర్మాతలకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయని వ్యాఖ్యానించాడు. కరోనా వైపరీత్యం తర్వాత రిలీజైన 'పుష్ప' డబ్బింగ్ వర్షన్ హిందీలో రూ.106 కోట్ల గ్రాస్ సాధిస్తే ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2.. బాలీవుడ్లో తలా రూ.300 కోట్లను అవలీలగా రాబట్టాయి. కానీ అక్కడి హిందీ సినిమాలు మాత్రం వందల కోట్లను వసూళ్లు చేయడంలో వెనకబడుతున్నాయి. దీనిపై మనోజ్ బాజ్‌పాయ్ ఢిల్లీ టైమ్స్‌తో మాట్లాడుతూ.. 'ఈమధ్య కాలంలో ఎన్నో బ్లాక్బస్టర్లు వచ్చాయి. ఇది చూసి హిందీ ఇండస్ట్రీలో పనిచేసే ఫిలింమేకర్స్ భయపడిపోతున్నారు. వాళ్లకు ఏం చేయాలో కూడా తోచడం లేదు. కానీ ఒకరకంగా ఇది బాలీవుడ్‌కు గుణపాఠం నేర్పింది. దీన్నుంచి తప్పకుండా ఎంతో కొంత నేర్చుకోవాలి. సౌత్ వాళ్లు సినిమా పట్ల ఎంతో ప్యాషన్‌తో పని చేస్తారు. తీసే ప్రతి సన్నివేశం కూడా ఈ ప్రపంచంలోనే బెస్ట్ సీన్‌గా ఉండాలన్న తపనతో తీస్తారు.' 'పుష్ప, కేజీఎఫ్, ఆర్ఆర్ఆర్ సినిమాలు చూసినట్లయితే ఎలాంటి లోటుపాట్లు లేకుండా క్లీన్‌గా కనిపిస్తాయి. ప్రతి ఫ్రేమ్ కూడా ఎంతో నిబద్ధతతో తీసినట్లు సులువుగా అర్థమవుతుంది. ఈ అంకితభావం మనదగ్గర(హిందీలో) లేదు. మనం ఎప్పుడూ బాక్సాఫీస్ కలెక్షన్ల గురించి ఆలోచించామే తప్ప మనల్ని మనం విమర్శించుకోలేదు. అందుకే ఆ సినిమాలు విభిన్నమైనవి అని వేరు చేసి మాట్లాడుతున్నాము. కానీ ఇది కచ్చితంగా ఒక గుణపాఠం. తప్పకుండా దీన్నుంచి మెళకువలు నేర్చుకోవాల్సిందే' అని చెప్పుకొచ్చాడు. చదవండి: అప్పుడే ఓటీటీకి సమంత ‘కణ్మనీ రాంబో ఖతీజా’!, స్ట్రీమింగ్ ఎక్కడంటే.. ఏంటి, పుష్ప 2 సినిమాకు బన్నీ అన్ని కోట్లు తీసుకుంటున్నాడా? -
సౌత్‌లో అలా చేసేవారు, అవమానంగా అనిపించేది: నటి
ఇండస్ట్రీలో ఎంతోమంది బాడీ షేమింగ్‌కు గురయ్యారు. సన్నగా ఉంటే బొద్దుగా ఉండాలని, బొద్దుగా ఉన్నవారినేమో కాస్త సన్నబడాలని నటీమణుల మీద ఒత్తిడి తెచ్చేవారు. ఇలాంటి పరిస్థితే నటి ఎరికా ఫెర్నాండేజ్‌కు ఎదురైందట. ఈ విషయాన్ని ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 'అప్పట్లో సౌత్‌లో హీరోయిన్లు కొంత బొద్దుగా ఉంటే ఇష్టపడేవారు. నేనేమో సన్నగా ఉండేదాన్ని. అందుకని నా శరీరంపై ప్యాడ్స్ పెట్టి మేనేజ్ చేయడానికి ప్రయత్నించేవాళ్లు. వాళ్లు అలా చేస్తుంటే నాకు మహా సిగ్గుగా అనిపించేది. చాలా అవమానంగా ఫీలయ్యేదాన్ని. ప్యాడ్స్ పెట్టుకుని నటించేందుకు అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉండేది. వాళ్లు కోరుకున్నట్లు నేను లేనేంటా అని చాలాసార్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అందరినీ యాక్సెప్ట్ చేస్తున్నారు. అది సంతోషకరమైన పరిణామం' అని ఎరికా చెప్పుకొచ్చింది. కాగా 2011లో పాంటలూన్స్ ఫెమినా మిస్ ఫ్రెష్ ఫేస్, 2010, 2011లో పాంటలూన్స్ ఫెమినా మిస్ మహారాష్ట్ర అవార్డులు గెలుచుకుంది ఎరికా ఫెర్నాండేజ్. ఇక సినిమాల విషయానికి వస్తే 'గాలిపటం' సినిమాలో కథానాయికగా అలరించిన ఎరికా పలు తమిళ, కన్నడ చిత్రాల్లో నటిస్తోంది. బాలీవుడ్‌లోనూ 'కుచ్ రంగ్ ప్యార్ కే ఐసేభీ' చిత్రంలో ఓ పాత్రలో మెరిసింది. -
సదరన్ స్పైస్ 5th August 2018
-
సినీ మహిళల కోసం అసోసియేషన్
పెరంబూరు: సినీ మహిళా సంరక్షణ కోసం ఒక అసోసియేషన్ ప్రారంభం కానుంది. సౌత్ ఇండియన్ ఫిలిం ఉమెన్స్ అసోసియేషన్ పేరుతో మే ఒకటవ తేదీన ప్రారంభించనున్నట్లు వైశాలి సుబ్రమణియన్ గురువారం వెల్లడించారు. దీని గురించి ఆమె తెలుపుతూ సినీరంగంలో మహిళల సంక్షేమం కోసం ఈ అసోసియేషన్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ అసోసియేషన్‌కు తాను అధ్యక్షురాలిగానూ, వీపీ.ఈశ్వరి కార్యదర్శకురాలుగానూ, ఎస్.మీనా మరుదాసి ఉపకార్యదర్శిగానూ, ఎం.గీత కోశాధికారిగానూ, ఎంజల్ సామ్రాజ్ ఉపాధ్యక్షురాలిగానూ బాధ్యతలు నిర్వమించనున్నట్లు తెలిపారు. ఈ విషయం గురించి ఫెఫ్సీ అధ్యక్షుడు ఆర్కే. సెల్వమణికి తెలియజేయగా మంచి ప్రయత్నం అమలు ప్రారంభించండి అని ప్రోత్సహించారని చెప్పారు. అదే విధంగా దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, ఛాయాగ్రాహకుల సంఘం అధ్యక్షుడు పీసీ.శ్రీరామ్ తమ ప్రయత్నం విజయవంతం కావాలని ఆకాంక్షించారని తెలిపారు. మే ఒకటవ తేదీన జరగనున్న ఈ అసోసియేషన్ ఆవిర్భావ వేడుకకు చిత్రపరిశ్రమకు చెందిన 24 శాఖలకు చెందిన ప్రముఖులతో పాటు పీసీ.శ్రీరామ్, నటుడు సత్యరాజ్, నటి రోహిణి, రేవతి, సచ్చు, పుష్కర్గాయత్రి విశ్చేయనున్నారని తెలిపారు. అదేవిధంగా తమ సౌత్ ఇండియన్ ఫిలిం ఉమెన్స్ అసోసియేషన్‌లో సినీపరిశ్రమకు చెందిన మహిళలందరూ సభ్యులుగా చేరాలని వైశాలి సుబ్రమణియన్ తెలిపారు. -
అప్పటి వరకూ థియేటర్లు బంద్
-
అప్పటి వరకూ థియేటర్లు బంద్ : సురేష్ బాబు
సాక్షి, హైదరాబాద్ : డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల వైఖరికి నిరసనగా శుక్రవారం నుంచి థియేటర్లను మూసివేస్తున్నట్లు దక్షిణ భారత నిర్మాతల మండలి తీర్మానించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,కేరళ, తమిళనాడులో బంద్‌కు పిలుపునిస్తూ టాలీవుడ్ నిర్మాత సురేష్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లీస్ చిత్రాలకు విర్చువల్ ప్రింటింగ్ చార్జీలు వేయడం లేదని, కానీ ప్రాంతీయ చిత్రాలకు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రాంతీయ చిత్రాలకు వీపీఎస్ ధరలను పూర్తిగా రద్దు చేయాలని అప్పటి వరకూ థియేటర్ల బంద్ కొనసాగుతుందని పేర్కొన్నారు. -
సమంత సంచలన వ్యాఖ్యలు
దక్షిణాది చిత్రపరిశ్రమతో దుస్తుల విషయంలో అంత అభిరుచి లేదన్న నటి సమంత వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం ఈ అమ్మడికి కొత్తేమీకాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి మాటలతో వివాదాల్లో ఇరుక్కున్నారు. కాగా ఇటీవల చెన్నైలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సమంత టిప్‌టాప్‌గా తయారయ్యి వచ్చారు. ముఖ్యంగా ఆమె దుస్తులు చూపరులను ఆకర్షించాయి. ఇదే విషయాన్ని ఆమెతో అంటే అందుకు బదులిస్తూ డ్రస్ విషయంలో బాలీవుడ్‌తో పోల్చితే దక్షిణాది చిత్రపరిశ్రమలో అభిరుచి తక్కువేనన్నారు. అయితే ఈ విషయం గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పుడు అలాంటి అవసరం ఏర్పడిందన్నది తన భావన అన్నారు. తన వరకు కాస్ట్యూమ్స్ విషయంలో అధిక శ్రద్ధ చూపుతున్నట్లు పేర్కొన్నారు. ఏదయినా కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు రకరకాల దుస్తులు ధరిస్తానని అన్నారు. అవి ఇతరులను ఆకర్షిస్తున్నప్పుడు తనకూ సంతోషంగా ఉంటుందని తెలిపారు. ఇప్పుడు దక్షిణాది తారలు ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారని సమంత అన్నారు.