
సాక్షి, హైదరాబాద్ : డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్ల వైఖరికి నిరసనగా శుక్రవారం నుంచి థియేటర్లను మూసివేస్తున్నట్లు దక్షిణ భారత నిర్మాతల మండలి తీర్మానించింది. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక,కేరళ, తమిళనాడులో బంద్‌కు పిలుపునిస్తూ టాలీవుడ్ నిర్మాత సురేష్‌బాబు పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంగ్లీస్ చిత్రాలకు విర్చువల్ ప్రింటింగ్ చార్జీలు వేయడం లేదని, కానీ ప్రాంతీయ చిత్రాలకు మాత్రం అధికంగా వసూలు చేస్తున్నారని అన్నారు. ప్రాంతీయ చిత్రాలకు వీపీఎస్ ధరలను పూర్తిగా రద్దు చేయాలని అప్పటి వరకూ థియేటర్ల బంద్ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment