‘మ్యూజిక్ మ్యాజిక్’ పాటలు
‘‘మన క్లాసిక్ సంగీతానికి రాక్ మ్యూజిక్‌ని మిక్స్ చేసి క్లాసిక్ రాక్ సంగీతంతో ఈ సినిమా చేశాం. కొత్త నటీనటులందరూ బాగా నటించారు. ఆరు నెలలు కష్టపడ్డాం’’ అని దర్శకుడు మంత్రాక్షర్ డీఎస్ చెప్పారు.
సోహెల్, త్రినాథ్, కిమాయ, ఇర్ఫాన్ ముఖ్యతారలుగా పాల్రెడ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై శ్రీకాంత్‌రెడ్డి నిర్మించిన ‘మ్యూజిక్ మ్యాజిక్’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది.
పాటల సీడీని ఆండ్రూ విడుదల చేసి, తొలిప్రతిని శ్రీకాంత్‌రెడ్డికి అందించారు. ఈ చిత్రాన్ని ఆదరించాలని నిర్మాత ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఇంకా విష్ణు, సీహెచ్ కిరణ్, సందీప్‌కిషన్, దామోదర్ ప్రసాద్ తదితరులు మాట్లాడారు.