‘బూతుపురాణం’పై విచారణకు ఆదేశం
అనంతపురం సెంట్రల్: కళ్యాణదుర్గంలో ట్రాఫిక్ క్లియర్ చేయలేదంటూ ఓ కానిస్టేబుల్‌ను సీఐ శివప్రసాద్ బూతులు తిట్టి మనస్తాపానికి గురి చేసినట్లు ‘కానిస్టేబుల్‌పై సీఐ బూతుపురాణం’ శీర్షికన శుక్రవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ స్పందించారు. అసలేం జరిగిందని ఆరా తీశారు. ఘటనపై విచారణ చేసి సమగ్ర నివేదిక అందజేయాలని కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణను ఆదేశించారు.