SP jananathan
-
డైరెక్టర్ మృతి, హాస్పిటల్ బిల్ కట్టిన విజయ్ సేతుపతి
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారు. ఇటివల లాక్డౌన్లో ఆనారోగ్యంతో ఆస్పత్రి పాలైన ఓ హస్య నటుడికి ఆర్థిక సాయింతో పాటు వైద్య చికిత్సకు డబ్బు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా విజయ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నాడు. కష్టకాలంలో తనని ఆదరించిన దర్శకుడు ఎస్పీ జననాథన్ హాస్పిటల్ బిల్లు కట్టి కృతజ్ఞత తిర్చుకున్నాడు. కాగా మార్చి 14న తమిళ దర్శకుడు ఎస్పీ జగనాథన్ బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించిన సంగతి తెలిసిందే. జననాథన్, విజయ్‌తో ‘లాభం’ అనే చిత్రం తీస్తున్న సంగతి తెలిసిందే. ఇదే ఆయన చివరి చిత్రం. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్‌ప్రోడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే ఈ మూవీ విడుదల కాకముందే ఆయన ఆకస్మికంగా మరణించడంతో చిత్ర యూనిట్ తీవ్ర దిగ్ర్భాంతికి గురైంది. కెరీర్ ప్రారంభంలో తనను ఆర్థికంగా ఆదుకోవడమే కాకుండా ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెట్టిన దర్శకుడి మరణం విజయ్ సేతుపతిని బాగా కలచివేసింది. జననాథన్ చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకున్న విజయ్ ఇప్పుడు హాస్పిటల్ ఛార్జీలు మొత్తం కట్టి ఆయన రుణం తీర్చుకున్నాడట. దర్శకుడు జననాథన్ కుటుంబ సభ్యులను విజయ్ ఒక్క రూపాయి కూడా కట్టనివ్వలేదట. అంతేకాదు ఆయన అనారోగ్యం వార్త తెలియగానే అందరికంటే ముందు విజయ్ స్పందించి హాస్పిటల్‌కి వెళ్లి పలకరించాడట. ఆయన చనిపోయాడని తెలిసిన అనంతరం అంతిమ సంస్కారాలు పూర్తయ్యేవరకు జననాథన్ కుటుంబంతో పాటే ఉండి కన్నీటీ పర్యంతరం ఆయ్యారట. ఆయన స్టార్ హీరో అన్న విషయం పక్కన పెట్టి సామాన్యుడిలా అక్కడ అందరితో కలిసిపోయాడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఇది తెలిసి ఆయన అభిమానులు తమ అభిమాన హీరోని చూసి మురిసిపోతున్నారు. చదవండి: నిహారిక కొత్త సినిమా.. కీలక పాత్రలో విజయ్ సేతుపతి ఆ దర్శకుని కుటుంబంలో మరో తీరని విషాదం ప్రముఖ దర్శకుడు కన్నుమూత -
సేతుపతి.. అఘోరాధిపతి?
సినిమా సినిమాకు గెటప్స్‌తో ప్రయోగాలు చేస్తుంటారు తమిళ హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో ‘లాభం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్. ఈ సినిమాలో రెండు విభిన్న గెటప్స్‌లో విజయ్ సేతుపతి కనిపిస్తారట. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి లుక్ ఒకటి బయటకు వచ్చింది. పొడుగు జుట్టు, ఫుల్ గడ్డంతో ఆయన లుక్ ఉంది. ఇది అఘోరాల పాత్రలను పోలి ఉండబోతోందని చెన్నై టాక్. దీంతో సేతుపతి అఘోరాధిపతి అయ్యారు అని సరదాగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ‘లాభం’లో విజయ్ సేతుపతి పాత్ర ఏంటో తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాల్సిందే. -
విరామానికి విరామం
రెండేళ్లవుతుంది తమిళంలో శ్రుతీహాసన్ స్క్రీన్‌పై కనిపించి. సూర్యతో చేసిన ‘సింగం 2’ తమిళంలో శ్రుతి లాస్ట్ సినిమా. ఆ తర్వాత సినిమాలను తగ్గించి సంగీతం మీద దృష్టి పెట్టారామె. లండన్‌లో మ్యూజికల్ షోలు కూడా నిర్వహించారు. అంతే కాకుండా వీలున్నంత సమయాన్ని బాయ్‌ఫ్రెండ్ మైఖేల్‌తో ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మధ్య బాలీవుడ్ దర్శకుడు మహేశ్ మంజ్రేకర్ సినిమాను అంగీకరించారు. ఆ సినిమా షూటింగ్ జరుగుతోంది. లేటెస్ట్గా శ్రుతీ ఓ తమిళ చిత్రం అంగీకరించినట్టు సమాచారం. రెండేళ్ళ గ్యాప్ తర్వాత అంగీకరించిన సినిమా ఇది. విజయ్ సేతుపతి హీరోగా యస్పీ జననాథన్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రుతీహాసన్ అయితే బావుంటుందని భావించి ఆమెను సంప్రదించారట. శ్రుతీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. శ్రుతీ రెండేళ్ల విరామానికి విరామం ఇచ్చి మళ్లీ సినిమాలను అంతే స్పీడ్‌గా చేస్తారో లేదో చూడాలి మరి. -
ఉరిశిక్ష ఇతివృత్తంగా పొరంబోకు
ఉరిశిక్ష అవసరం? కాదా? అన్న అంశాన్ని చర్చించే చిత్రంగా పొరంబోకు ఉంటుందని ఆ చిత్ర దర్శకుడు ఎస్పీ జననాథన్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని ఈయన ఫస్ట్‌కాపీ బేస్డ్ మీద యూటీవీకి సంస్థకు చేసి పెట్టారు. ఆర్య, విజయ్ సేతుపతి, శ్యామ్, కార్తీకలు హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఈ నెల 15న తెరపైకి రానుంది. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం చెన్నైలో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ముందుగా దర్శకుడు ఎస్పి జననాథన్ మాట్లాడుతూ పొరంబోకు చిత్రాన్ని ఫస్ట్‌కాపీ విధానంలో యూటీవీ సంస్థకు చేశానని తెలిపారు. దీంతో బాధ్యత పెరిగిన విషయం నిజమేనని అయితే పూర్తి స్వేచ్ఛ లభించిందని అన్నారు. తాను అనుకున్న విధంగా చిత్రాన్ని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా రూపొందించానని తెలిపారు. చిత్ర కథ గురించి చెప్పాలంటే గత పదేళ్లలో ప్రపంచవ్యాప్తంగా 1400 మంది ఉరిశిక్షకు గురయ్యారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. వారిలో పలు కమ్యూనిస్టులు ఉన్నారన్నారు. ఇలాంటి అంశాలను సుదీర్ఘంగా చర్చించి తయారు చేసిన కథా చిత్రం పొరంబోకు అని వివరించారు. అసలు ఇలాంటి ఉరిశిక్షలు అవసరమా? కాదా? అన్న విషయాన్ని చర్చించే చిత్రంగా పొరంబోకు ఉంటుందన్నారు. ఈ చిత్రంలో ఆర్య ఒక విప్లవకారుడి పాత్రను పోషించారని చెప్పారు. విప్లవకారుడనగానే నల్లదుస్తులు, పెరిగిన గడ్డం, మీసాల వేషధారణలతోనే సినిమాల్లో చూపించారన్నారు. దాన్ని మార్చాలనే ఆర్య ఈ చిత్రంలో విభిన్నంగా చూపించమని అన్నారు. కారణం భగత్‌సింగ్ లాంటి విప్లవ వీరులు చాలా అందంగా ఉండేవారన్నారు. అదే విధంగా నటుడు శ్యామ్‌ను పోలీసు అధికారిగాను, విజయ్‌సేతుపతిని ఒక వైవిధ్య భరిత పాత్రలోనూ చూపించామని పేర్కొన్నారు. నటి కార్తీకాను కుయిలి అనే పోరాట యోధిని పాత్రలో నటింప చేశామని చెప్పారు. ఇప్పటి వరకు అందమైన యువతి పాత్రలో నటించిన కార్తీకను ఈ చిత్రంలో యాక్షన్ నాయకిగా చూపించామని తెలిపారు. ఇది మల్టీస్టారర్ చిత్రం కావడంతో మొదట్లో కాస్త భయపడినా ఆర్య, విజయ్ సేతుపతి, శ్యామ్ ముగ్గురు ఎలాంటి ఈగో లేకుండా నటించడంతో తాననుకున్నది తెరపై చూపించగలిగానని దర్శకుడు జననాథన్ అన్నారు.