సేతుపతి.. అఘోరాధిపతి? | Vijay Sethupathi plays an action hero who fights for social justice | Sakshi
Sakshi News home page

సేతుపతి.. అఘోరాధిపతి?

Published Sun, Jun 30 2019 2:48 AM | Last Updated on Sun, Jun 30 2019 2:48 AM

Vijay Sethupathi plays an action hero who fights for social justice - Sakshi

విజయ్‌ సేతుపతి

సినిమా సినిమాకు గెటప్స్‌తో ప్రయోగాలు చేస్తుంటారు తమిళ హీరో విజయ్‌ సేతుపతి. ప్రస్తుతం ఎస్పీ జననాథన్‌ దర్శకత్వంలో ‘లాభం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో శ్రుతీహాసన్‌ హీరోయిన్‌. ఈ సినిమాలో రెండు విభిన్న గెటప్స్‌లో విజయ్‌ సేతుపతి కనిపిస్తారట. తాజాగా ఈ సినిమాలో విజయ్‌ సేతుపతి లుక్‌ ఒకటి బయటకు వచ్చింది. పొడుగు జుట్టు, ఫుల్‌ గడ్డంతో ఆయన లుక్‌ ఉంది. ఇది అఘోరాల పాత్రలను పోలి ఉండబోతోందని చెన్నై టాక్‌. దీంతో సేతుపతి అఘోరాధిపతి అయ్యారు అని సరదాగా ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ఇంతకీ ‘లాభం’లో  విజయ్‌ సేతుపతి పాత్ర ఏంటో తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement