Sruthihasan
-
స్ఫూర్తి శ్రుతి
‘‘మనకు మనం ప్రేరణగా నిలవలేనప్పుడు ఇతరుల్లో ఆ ప్రేరణను వెతుక్కోవాలి. ఇతరులకు ఆదర్శవంతంగా ఉండేవారిని అనుసరించాలి. వారిని స్ఫూర్తిగా తీసుకుని మన ఆశయాలను సాధించాలి’’ అంటోంది ఓ అమ్మాయి. శ్రుతీహాసన్ అంటే ఆ అమ్మాయికి చాలా అభిమానం. ఆ అభిమానమే ఆమెను ఓ చెడు అలవాటుకి దూరం చేసింది. ఒత్తిడిని అధిగమించడానికి ఆ అమ్మాయి రోజుకి 20 సిగరెట్లు కాల్చేది. అయితే ఆరోగ్యానికి అది అంత మంచిది కాదని తనకు తెలుసు. ఆమె ఈ అలవాటు మానుకోవడానికి శ్రుతి ఎలా కారణంగా నిలిచారంటే.. శ్రుతీహాసన్ చేసే ప్రైవేట్ మ్యూజికల్ ఆల్బమ్స్, తన గురించి చదివిన కొన్ని కథనాలు ఆ అమ్మాయికి స్ఫూర్తినిచ్చాయి. సిగరెట్ తాగడంకన్నా శ్రుతి పాటలు, కథనాలు తనకు రిలీఫ్నిచ్చాయంటోంది. పైగా శ్రుతీహాసన్ నవ్వుతున్న ఫొటోలను చూస్తుంటే ఎక్కడ లేని పాజిటివిటీ వచ్చేస్తుందని ఆ అభిమాని పేర్కొంది. ఇవన్నీ ఆమె ధూమపానానికి దూరం కావడానికి కారణం అయ్యాయి. ‘‘నా జీవితంలో ఆశావహ దృక్పథానికి కారణమైన మీకు కృతజ్ఞతలు శ్రుతి. నేను బెటర్ పర్సన్ కావడానికి స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు. శనివారంతో నేను సిగరెట్ మానేసి వంద రోజులైంది’’ అని ట్వీట్ చేసింది ఆ అమ్మాయి. కాగా గత నెల 12న ధూమపానం మానేసి 78 రోజులు అయిందని ఆ అమ్మాయి చేసిన ట్వీట్‌కి ‘నువ్వు సాధించగలవు. ఇలాగే స్ట్రాంగ్‌గా ఉండు’ అని సమాధానం ఇచ్చారు శ్రుతీహాసన్. తాజాగా 100 రోజుల ట్వీట్‌కి స్పందిస్తూ.. పువ్వుల బొమ్మలను పోస్ట్ చేసి, ఆ అభిమానిని అభినందించారు శ్రుతి. అభిమాన తారలను స్ఫూర్తిగా తీసుకుని మంచి బాటలో వెళ్లే అభిమానులు ఉంటారు. అందుకు ఇదొక నిదర్శనం. -
బయటపెట్టండి.. బయటపడండి!
శ్రుతిహాసన్‌లో ఏదో కోల్పోయిన భావన ఇలియానా వారం రోజులు బయటకు రాలేదు దీపికా పదుకోన్ అంతకు ముందులా చలాకీగా లేదు పరిణీతీ చోప్రా వారాల తరబడి బయటకు రాలేదు పాయల్ ఘోష్ పరిస్థితీ ఇంతే సీనియర్ నటి ఖుష్బూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కారణం... డిప్రెషన్ మన తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నది డిప్రెషన్ వల్లే... నాలుగు రోజుల క్రితం హిందీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్శ్రుతీహాసన్ ఆత్మహత్యకు కారణం ఇదే.. ఇప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఒకటే మాట.. మనసులో బాధ ఉంటే ఆ బాధను బయటపెట్టండి.. డిప్రెషన్ నుంచి బయటపడండి.. శ్రుతీహాసన్, ఇలియానా, దీపికా, పరిణీతి, పాయల్, ఖుష్బూ డిప్రెషన్‌ను తరిమికొట్టారు. ఇప్పుడు హాయిగా ఉన్నారు. ఈ ఆరుగురు నాయికలూ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం. వాళ్లకంటే బలమైనదాన్ని ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు ఖుష్బూ. కథానాయికగా తెలుగు, తమిళ్, ఇతర భాషల్లో ఓ వెలుగు వెలిగారు. డబ్బు, పేరు రెండూ ఉన్నాయి. కానీ ఖుష్బూని ఏదో సమస్య డిప్రెషన్లోకి నెట్టేసింది. ఆమెకు ఇక జీవితం ఆగిపోయిందనిపించింది. ‘‘జీవితం చాలా చీకటిగా అనిపించింది. సమస్యలను చూడ్డానికి భయపడి నా కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా నాకనిపించింది. అన్ని బాధలూ మరచిపోయి నిద్రపోవాలనుకుంటే నా మానసిక స్థితి నన్ను నిద్రపోనివ్వలేదు’’ అని గతాన్ని తలుచుకున్నారు ఖుష్బూ. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. అయితే తను పడిపోతే చూడాలనుకునేవారిని జయించాలనే పట్టుదల ఆమెను బతికించింది. ‘‘నా మనసుని బాధపెట్టి, నన్ను భయపెట్టి, నన్ను చీకట్లోకి నెట్టాలనుకున్నవాళ్ల కోసం నా అమూల్యమైన జీవితాన్ని ఎందుకు వదలుకోవాలి అనుకున్నాను. వాళ్లకంటే బలమైనదాన్ని అని నిరూపించుకోవాలనుకున్నాను. నా స్నేహితుల సహాయంతో డిప్రెషన్ నుంచి బయటపడ్డాను’’ అన్నారు ఖుష్బూ. ‘‘ఎవరి జీవితమూ సాఫీగా సాగదు, సమస్యలకు పారిపోకూడదు. మనల్ని ఏ సమస్యా ఏమీ చేయలేనంత బలంగా తయారవ్వాలి’’ అని సలహా ఇచ్చారు ఖుష్బూ. ప్రతి సెకనూ నరకమే ‘ఓం శాంతి ఓం’ అంటూ బాలీవుడ్లో తన కెరీర్‌ని చాలా ప్రశాంతంగా మొదలుపెట్టారు దీపికా పదుకోన్. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయ్యారు. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో కూడా పడ్డారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చోవడమే ఆలస్యం అనే సమయంలో ఇద్దరూ విడిపోయారు. తన డిప్రెషన్‌కి ఇదే కారణం అని చెప్పలేదు కానీ ఆ తర్వాత దీపికా మానసికంగా కుంగిపోయారు. ‘‘ఆ సమయంలో ప్రతి సెకను నాకు నరకంలా అనిపించేది. దేని మీదా ఆసక్తి ఉండేది కాదు. కొన్ని రోజులు ఇదే పరిస్థితి. వన్ ఫైన్ డే బతకడం అంటే ఇలా కాదు అనిపించింది. మా అమ్మానాన్నతో మనసు విప్పి మాట్లాడాను. డాక్టర్ని సంప్రదించాను. నా మానసిక ఒత్తిడినంతా పోగొట్టేసుకున్నాను. మన బాధను బయటకు చెప్పాలి. అప్పుడే దాన్ని దూరం చేయగలుగుతాం’’ అన్నారు దీపికా. అంతే కాదు.. ఇలా డిప్రెషన్‌తో బాధపడుతున్నవారి కోసం ఓ సంస్థ కూడా నడుపుతున్నారామె. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దీపికా తన ట్వీటర్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఆత్మహత్య పరిష్కారం కాదు. మెంటల్ హెల్త్ గురించి ఇవాళ చాలామంది బయటకు వచ్చి మాట్లాడటం అభినందనీయం. డిప్రెషన్లో ఉన్నవాళ్లు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరి కాదు. మీతో పాటు అందరూ ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యం నమ్మకం’’ అన్నారు. ఐదేళ్లుగా మానసిక ఒత్తిడి ‘‘నేను ఐదేళ్లుగా మానసిక వేదనతో బాధపడుతున్నా’’ అని ఇటీవల పాయల్ ఘోష్ తన ట్వీటర్లో పేర్కొన్నారు. తెలుగు చిత్రాలు ‘ప్రయాణం’, ‘ఊసరవెళ్లి’, ‘మిస్టర్ రాస్కెల్’లో నటించిన ఆమె తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. కెరీర్‌పరమైన కారణాలే పాయల్ మానసిక ఒత్తిడికి కారణం అని తెలుస్తోంది. ‘‘నేను ఐదేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నా. ఒక్కోరోజు బాగా బాధపడేదాన్ని. ఆ సమయంలో ఆత్మహత్య బెటర్ అనిపించేది. మందులు తీసుకుంటున్నా. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలబడుతున్నారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడితే మంచిది’’ అన్నారు పాయల్. అయితే ఏంటి? గోవా బ్యూటీ ఇలియానా నాలుగైదేళ్ల క్రితం వరకూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. బాలీవుడ్ కాలింగ్ అంటూ అక్కడికెళ్లారు. అయితే ఇక్కడ చేసినన్ని సినిమాలు చేయలేకపోతున్నారు. కానీ ఇలియానాకి అదేం పెద్ద సమస్య కాదు. తన శరీరాకృతిని విమర్శించారు. అది ఇలియానాని మానసికంగా కుంగదీసింది. ఓ వారం అంతా ఇంట్లోనే ఉండిపోయారు. ఆత్మహత్య చేసుకుంటే? అనే ఆలోచన మొదలైంది. ఈ ఆలోచన ప్రమాదం అని గ్రహించి, తన స్థితి గురించి ఎవరో ఒకరికి చెప్పుకోవాలనుకున్నారు. ఆ టైమ్‌లోనే డాక్టర్ని కలిశారు. ‘ఇలా జరిగిపోతుందేమో’ అని భయపడేకంటే ‘అయితే ఏంటి?’ అనే భావన పెంచుకోవాలని ఆ డాక్టర్ చెప్పిన సలహా ఇలియానాకి బాగా నచ్చింది. ‘‘ఈ ప్రపంచంలో ఏ ఒక్కరినీ మన లుక్స్‌తో కానీ ప్రవర్తనతో కానీ సంతృప్తిపరచలేం. అందుకే మనం మనలా ఉండటం అలవాటు చేసుకోవాలి. నేను నా కోసం బతుకుతున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. ఎవరో ఏదో అన్నారని మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు’’ అంటున్నారు ఇలియానా. మూడేళ్ల మానసిక ఒత్తిడి చిన్నప్పుడు, సినిమాల్లోకి వచ్చాక శ్రుతీహాసన్ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురయ్యారట. అయితే గడచిన మూడేళ్లల్లో ఆమె మానసికంగా చాలా కుంగిపోయారు. ‘‘నా ఒత్తిడి గురించి బయటకు చెప్పడానికి సిగ్గు అనిపించింది. కానీ చెప్పకపోతే ఇవాళ ఇంత హాయిగా ఉండగలిగేదాన్ని కాదు. నా సమస్య చెప్పుకుని మానసిక చికిత్స పొందుతున్నాను. అలా ఒత్తిడి నుంచి దూరం కాగలిగాను. ధ్యానం, యోగా వంటి వాటితో మానసిక ప్రశాంతత లభిస్తోంది. ‘మెంటల్ ఇల్నెస్’ అనేది బయటకు చెప్పకూడనిది కాదు. చెబితేనే దూరం అవుతుంది’’ అన్నారు శ్రుతీహాసన్. రోజుకి పదిసార్లు ఏడ్చాను మరో భామ పరిణీతీ చోప్రా గురించి చెప్పాలంటే.. 2014–2015 మధ్యకాలంలో పరిణీతి కెరీర్ ఏం బాగాలేదు. ‘దావత్–ఎ–ఇష్క్’, ‘కిల్ దిల్’.. ఇలా వరుసగా ఆమె నటించిన సినిమాలు పరాజయంపాలయ్యాయి. సక్సెస్‌లో ఉన్నవారి డోర్ ముందుకు డేట్స్ లేవన్నా అవకాశాలు వస్తాయి. ఫ్లాప్‌లో ఉన్నవారికి ఆ చాన్స్ ఉండదు. అలా పరిణీతికి అవకాశాలు తగ్గాయి. సరిగ్గా అప్పుడే ఓ పెద్ద సంస్థలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం, ఇల్లు కొనడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు. ఖర్చులకు కూడా డబ్బులు ఉండేవి కాదు. ‘‘అప్పుడు వారాల తరబడి ఇంటి నుంచి బయటకు రాలేదు. రోజుకి కనీసం పదిసార్లయినా ఏడ్చేదాన్ని. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు’’ అన్నారు పరిణీతి చోప్రా. అయితే తన సోదరుడు, స్టయిలిస్ట్ సహాయంతో ఆమె డిప్రెషన్ నుంచి బయటపడగలిగారు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్ని దగ్గరివాళ్లతో పంచుకోవాలంటున్నారు పరిణీతి. -
సేతుపతి.. అఘోరాధిపతి?
సినిమా సినిమాకు గెటప్స్‌తో ప్రయోగాలు చేస్తుంటారు తమిళ హీరో విజయ్ సేతుపతి. ప్రస్తుతం ఎస్పీ జననాథన్ దర్శకత్వంలో ‘లాభం’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో శ్రుతీహాసన్ హీరోయిన్. ఈ సినిమాలో రెండు విభిన్న గెటప్స్‌లో విజయ్ సేతుపతి కనిపిస్తారట. తాజాగా ఈ సినిమాలో విజయ్ సేతుపతి లుక్ ఒకటి బయటకు వచ్చింది. పొడుగు జుట్టు, ఫుల్ గడ్డంతో ఆయన లుక్ ఉంది. ఇది అఘోరాల పాత్రలను పోలి ఉండబోతోందని చెన్నై టాక్. దీంతో సేతుపతి అఘోరాధిపతి అయ్యారు అని సరదాగా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ‘లాభం’లో విజయ్ సేతుపతి పాత్ర ఏంటో తెలియాలంటే సినిమా విడుదల వరకూ వేచి చూడాల్సిందే. -
పెళ్లైయినా నటిస్తా!
భర్త కోసమో, అత్త కోసమో నటనను త్యాగం చేయకూడదంటున్నారు నటి శ్రుతిహాసన్. ఈ బ్యూటీ ఎంత బోల్డో ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన మనసుకు అనిపించింది నిర్భయంగా చెప్పేస్తారు. గ్లామరంటే ఏమిటి? పెళ్లి చేసుకోకుండానే పిల్లల్ని కంటాను లాంటి ఏ నటి అనడానికి సాహసించని వ్యాఖ్యలు చేయడం శ్రుతికే సాధ్యం. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న శ్రుతిహాసన్ నటుడు సూర్యకు జంటగా నటించిన తాజా చిత్రం సీ–3 ప్రపంచ వ్యాప్తంగా రేపు తెరపైకి రానుంది. ఈ అమ్మడు ఎప్పుడు భేటీ ఇచ్చినా అది ఆసక్తికరంగానే ఉంటుంది. తన తాజా ఇంటర్వూ్యలోనూ అలాంటి పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి.అవేమిటో చూద్దామా ‘నేను నటిగా రంగప్రవేశం చేసి ఏడేళ్లయ్యింది. ఆరంభ కాలంలో కంటే ఇప్పుడు చాలా పరిణితి చెందాను. చాలెంజింగ్ విషయాలను ధైర్యంగా ఎదుర్కొనే పరిపక్వత చెందాను. పాపులర్ నటిని కావడంతో తలెత్తే విమర్శనలను సాధకంగా మార్చుకోగలుగుతున్నాను. సక్సెస్ హీరోలకే సినిమాలు విజయం సాధిస్తే అందుకు హీరోలనే కారణం చేస్తుండడం సహజంగా మారింది. హీరోయిన్లను పట్టించుకోవడం లేదు.అయినా నేనీ విషయం గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు. నా పాత్ర బాగుందా? ఆ పాత్రకు న్యాయం చేశానా అన్న అంశాల గురించే ఆలోచిస్తాను. ఇప్పుడు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలకు ప్రాముఖ్యత పెరుగుతోంది. హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు రావడం స్వాగతించదగ్గ విషయం. నా జోక్యం ఉండదు నా తండ్రి కమలహాసన్ నుంచి నటి గౌతమి దూరం కావడానికి మీరే కారణమా? అని చాలా మంది అడుగుతున్నారు. నా తండ్రి వ్యక్తిగత జీవితం గురించి నేను బహిరంగంగా మాట్లాడదలచుకోలేదు. ఇతరుల వ్యక్తి గత జీవితాల గురించి మాట్లాడే అలవాటు నాకు లేదు. ఇంకా చెప్పాలంటే ఇలాంటి వివాదాస్పద ప్రశ్నలను ఎలా ఎదుర్కోవాలన్నది నేర్చుకున్నాను. ప్రశంసలను ఆశించకుంటే విమర్శలను, సమస్యలను సులభంగా పరిష్కరించుకోవచ్చు. పెళ్లెప్పుడంటున్నారు కథానాయికలు వివాహానంతరం నటనకు దూరం అవుతున్నారు. అది కరెక్ట్ కాదు. నటన వృత్తి లాంటిదే. భర్త చెప్పారనో, అత్త కాదన్నారనో నటనను త్యాగం చేయకూడదన్నది నా అభిప్రాయం. పెళ్లెప్పుడు చేసుకుంటారు. సయమం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. పెళ్లి అయ్యి ,తల్లి అయిన తరువాత కూడా నేను నటించాలనుకుంటున్నారు. ఎందుకంటే నటనంటే నాకు చాలా ఇష్టం. -
మా నాన్నలానే అతనికీ ఆడవాళ్లంటే గౌరవం!
‘బి ద బిచ్’.. శ్రుతీహాసన్ చేసిన లేటెస్ట్ వీడియో ఇది. ‘బిచ్’ అనేది అనకూడని పదమే అయినా అలా పిలిపించుకోవడానికి తనకేం అభ్యంతరం లేదంటూనే అసలు బిచ్ అంటే ఏంటి అనే దానికి ఈ వీడియోలో శ్రుతి ఇచ్చిన కొత్త నిర్వచనం అందరికీ నచ్చింది. ‘భేష్ శ్రుతీ.. భలే చెప్పావ్’ అని వీడియోను చూసినవాళ్లందరూ ఈ బ్యూటీని అభినందిస్తున్నారు. ‘‘నాకు నచ్చినట్లు చేస్తూ.. నా బతుకు నేను బతుకుతున్నందుకే ఎవరనైనా నన్ను బిచ్ అని పిలిచారనుకోండి నాకు నో ప్రాబ్లమ్’’ అని ఈ వీడియో ద్వారా శ్రుతి స్టేట్మెంట్ ఇచ్చారు. ‘‘ఇలా అన్నాను కదా అని నన్ను ‘స్త్రీవాది’ అనుకుంటారేమో.. నేను కాదు’’ అని కూడా అన్నారామె. సమాజంలో బోల్డన్ని మార్పులొచ్చినట్లుగానే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు స్త్రీలకు గౌరవపెరిగిందనుకుంటున్నారా అనే ప్రశ్నను శ్రుతీహాసన్ ముందుంచితే - ‘‘ఈ విషయంలో నాకు పెద్ద కన్ఫ్యూజన్ ఉంది. మా నాన్నగారు (కమల్‌హాసన్) చాలా ఓపెన్ మైండెడ్. అమ్మా, కజిన్స్.. ఇలా చాలామంది ఆడవాళ్ల మధ్య పెరిగారాయన. అందుకే ఆడవాళ్లంటే నాన్నగారికి అభిమానం, గౌరవం. ఆడవాళ్ల గురించి మా నాన్నగారి దగ్గర టాపిక్ వచ్చిన ప్రతిసారీ వాళ్లంటే ఆయనకెంత గౌరవమో నాకర్థమైంది. కానీ, బయటి మగవాళ్లల్లో ఆడవాళ్ల పట్ల నాకా గౌరవం కనిపించలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ ఒకతను ఉన్నాడు. అతను కూడా ఆడవాళ్లను గౌరవిస్తాడు. నా మీద వీళ్లిద్దరి ప్రభావం చాలా ఉంటుంది. సమాజంలో ఆడవాళ్లకు గౌరవం పెరిగిందా? లేదా? అనే విషయానికొస్తే.. పెద్దగా పెరగలేదు. రావాల్సినంత మార్పు రాలేదు’’ అన్నారు. ఆడవాళ్లందరూ బాగా చదువుకోవాలనీ, ఉద్యోగం చేయాలనీ, ఎవరి కాళ్ల మీద వాళ్లు నిలబడాలనీ ఈ సందర్భంగా శ్రుతి పేర్కొన్నారు. -
కథ వినకుండానే..
చెన్నై: నమ్మకం ఏమైనా చేయిస్తుంది. ముందు వెనుక ఆలోచించకుండా చేస్తుంది. నటి శ్రుతీహాసన్ అలాంటి అపారమైన నమ్మకంతో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భారతీయ నటిగా తన హవా సాగిస్తున్న శ్రుతీహాసన్‌కు ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ అంటూ చేతి నిండా చిత్రాలున్నాయి. ఆమె నటించిన హిందీ చిత్రం వెల్కమ్ బ్యాక్ ఇటీవల విడుదలైంది. ఆ చిత్ర హీరో జాన్ అబ్రహంతోనే మరో చిత్రం చేసే అవకాశం వరించింది. రాఖీ హ్యాండ్సమ్ అనే చిత్రంలో శ్రుతీ జాన్ అబ్రహంకు జంటగా మరోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు. నిజానికి ఈ చిత్రంలో దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలలో ఒకరిని ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు ముందు భావించారట. అలాంటిది శ్రుతీహాసన్ కు ఈ అవకాశం దక్కింది. తనకు కథ నచ్చితేనే చిత్రం చేయడానికి అంగీకరిస్తానని తెగేసి చెప్పే శ్రుతీహాసన్ ఏఆర్ మురుగదాస్‌కు మాత్రం కథ వినకుండానే ఆయన చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారట. ఆమెను 7ఆమ్ అరివు చిత్రం ద్వారా తమిళ సినిమాకు పరిచయం చేసిన దర్శకుడు కావడంతో ఆయనపై గౌరవంతోనే తాజా చిత్రంలో నటించడానికి అంగీకరించారట. ప్రస్తుతం అఖీరా అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మురుగదాస్ తదుపరి ద్విభాషా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించనున్నారు. ఆయనతో శృతీ మరోసారి జతకడుతున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన తెలుగు చిత్రం శ్రీమంతుడు ఘన విజయం సాధించిన నేపథ్యంలో మురుగదాస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ బలమైన పాత్రను పోషించనున్నారట. -
అజిత్‌కు టాటా చెప్పేసింది
చెన్నై : నటుడు అజిత్‌కు అందాల భామ శ్రుతిహాసన్ బై చెప్పేశారు. ఏమిటీ వారిద్దరి మధ్య ఏముంది? అజిత్‌కు శ్రుతిహాసన్ టాటా చెప్పడానికి అనేగా మీ సందేహం. వారిద్దరి మధ్య చాలానే ఉంది. ఇద్దరూ కలిసి ఒక క్రేజీ చిత్రంలో నటిస్తున్నారు. అది చాలదా అజిత్‌కు శ్రుతికి మధ్య చక్కని సాన్నిహిత్యం ఉందనడానికి. వీరిద్దరి తొలి కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం వేదాళమ్ దీపావళికి సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఆరంభం, ఎన్నై అరిందాల్ వంటి విజయవంతమైన చిత్రాల తరువాత అజిత్ హీరోగా నిర్మాత ఏ.ఎం.రత్నం నిర్మిస్తున్న మూడవ చిత్రం వేదాళమ్. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇలాంటి సమయంలో శ్రుతిహసన్ అజిత్‌కు బై చెప్పేశారు. విషయం ఏమిటంటే ఈ చిత్రానికి సంబంధించి శ్రుతిహాసన్ తను నటించాల్సిన సన్నివేశాలను పూర్తి చేసేశారట. దీంతో అజిత్‌తో పాటు చిత్ర యూనిట్‌కు శ్రుతి టాటా బైబై చెప్పారట. ఈ విషయాన్ని శ్రుతిహాసన్ తన ట్విట్టర్లో పేర్కొంటూ వేదాళమ్ చిత్రంలో నటించడం మంచి అనుభవం అన్నారు. ఎంతో వినయంగా ప్రవర్తించే దర్శకుడు శివ దర్శకత్వంలో నటించడం తీయని అనుభవం అని పేర్కొన్నారు. వేదాళం చిత్ర యూనిట్ ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో బిజీ అయ్యారు.మరో పక్క చిత్ర టీజర్ విడుదలై అభిమానుల్ని విశేషంగా అలరిస్తోంది. దీపావళికి తెరపైకి రానున్న వేదాళమ్ చిత్రంపై అజిత్ అభిమానులతో పాటు చిత్ర వర్గాల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. -
శృతిహాసన్పై క్రిమినల్ చర్యలు !
హైదరాబాద్: హైదరాబాద్: ప్రముఖ సినీ నటి శృతిహాసన్పై కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తోంది. ఒప్పందం ప్రకారం ఓ మల్టీ స్టారర్ చిత్రంలో నటించకుండా తప్పుకున్నందుకు ఆమెపై క్రిమినల్, సివిల్ చర్యలు తీసుకోవచ్చని కోర్టు ఆదేశించింది. మరోపక్క, తదుపరి ఆదేశాలవరకు కొత్త చిత్రాలకు సంతకం చేయొద్దని, నటించొద్దని శృతిహాసన్‌కు ఆదేశాలు జారీచేసింది. పిక్చర్ హైజ్ మీడియా లిమిటెడ్ నటుడు నాగార్జున, తమిళనటుడు కార్తీని హీరోలుగాపెట్టి ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఈ చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు నిర్మాణ సంస్ధ నటి శృతిహాసన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాల్షీట్ల సర్దుబాటుకు ప్రణాళిక సిద్ధం చేసింది. ఇటీవలె ఆ చిత్రం తొలి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది. కానీ, అనూహ్యంగా తనకు డేట్లు కుదరడం లేదంటూ షూటింగ్‌కు హాజరులేనని శృతి ఈ-మెయిల్ ద్వారా సమాచారం పంపించింది. ఆమె నిర్ణయంతో తమ చిత్ర నిర్మాణానికి ఆలస్యం అవడమేకాకుండా, భారీ మొత్తంలో నష్టపోతామని, ఆమె అనైతికంగా తీసుకున్న ఈ మోసపూరిత నిర్ణయంపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా ఈ వ్యవహారంపై సినిమా నిర్మాణ సంస్ధ కోర్టుకు వెళ్లింది. దీంతో కోర్టు అందుకు ఆదేశిస్తూ ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఆదేశాలిచ్చింది. -
కాపాడాడు...పార్టీకి రమ్మన్నాడు!
అన్యాయాలను ఎదిరించడం, తన దారికి అడ్డొచ్చిన విలన్లను చితగ్గొట్టడం.. హీరోయిన్‌పై ఈగ వాలకుండా చూసుకోవడం... సినిమాల్లో హీరో ప్రధాన కర్తవ్యం దాదాపు ఇదే. రీల్ మీదే కాదు.. ఒక్కోసారి రియల్‌గా కూడా హీరోలవుతుంటారు కొంతమంది. ఇటీవల బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అలానే మారారు. ఆయన కనబర్చిన హీరోయిజమ్ శ్రుతీహాసన్ పాలిట వరమైంది. అసలు విషయంలోకి వస్తే.. అర్జున్ కపూర్, సోనాక్షీ సిన్హా జంటగా ‘ఒక్కడు’ హిందీ రీమేక్ ‘తేవర్’ రూపొందుతోంది. ఈ చిత్రంలోని ఒక ప్రత్యేక పాటను శ్రుతీహాసన్ పాడారు. అది మాత్రమే కాదు.. ఈ పాటకు అర్జున్ కపూర్‌తో కలిసి కాలు కదిపారామె. ఈ పాటకు సంబంధించిన ఓ సన్నివేశంలో గుర్రాలు కూడా ఉన్నాయి. ఆ సన్నివేశం చిత్రీకరణకు సంబంధించిన విరామంలో శ్రుతీహాసన్ రిలాక్స్ అవుతున్నారు. కళ్లు మూసుకుని హాయిగా రిలాక్స్ అవుతున్న శ్రుతి తనకు జరగబోతున్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారట. ఓ గుర్రం ముందుకు ఉరుక్కుంటూ వచ్చి, శ్రుతిని కాలితో తన్నబోవడం అర్జున్ కపూర్ దృష్టిలో పడిందట. ఆ గుర్రం కాలు సరిగ్గా శ్రుతి పొట్టవైపు ఉందట. అర్జున్ సకాలంలో శ్రుతిని అక్కణ్ణుంచి పక్కకు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఊహించని ఈ పరిణామానికి శ్రుతీహాసన్ కంగారు పడినా, ప్రమాదం తప్పినందుకు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కాపాడినందుకు తనతో పార్టీకి రమ్మని శ్రుతిని ఆహ్వానించారట అర్జున్. వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న ‘బద్లాపూర్’ చిత్రం షూటింగ్ ముగియడంతో ఆ చిత్రబృందం ‘ర్యాప్ అప్ పార్టీ’ ఏర్పాటు చేశారట. ఆ పార్టీకి ఆహ్వానం అందుకున్న అర్జున్‌కపూర్ తనతో పాటు శ్రుతిని కూడా తీసుకెళ్లారని బాలీవుడ్ టాక్. -
సోనాక్షికి శ్రుతి పాట!
ఓ వైపు అగ్ర తారగా కొనసాగుతూ, మరో వైపు తోటి కథానాయికలకు ప్లేబ్యాక్ పాడటం నిజంగా అరుదైన విషయమే. ఈ విధానానికి తెరలేపింది నిత్యామీనన్ అనే అనాలి. ఆ మధ్య ఓ సినిమా కోసం తోటి కథానాయికకు ప్లేబ్యాక్ పాడారామె. ఇప్పుడు ఆ ట్రెండ్‌ని కొనసాగించే పనిలో ఉన్నారు శ్రుతీహాసన్. ఇటీవలే ‘అలా మొదలైంది’ తమిళ రీమేక్ కోసం అందులో కథానాయికగా నటిస్తున్న రకుల్ ప్రీత్‌సింగ్‌కి ప్లేబ్యాక్ పాడారు శ్రుతి. త్వరలో ‘ఒక్కడు’ బాలీవుడ్ రీమేక్ ‘తేవర్’ సినిమా కోసం అందులో కథానాయికగా నటిస్తున్న సోనాక్షీ సిన్హాకు తన గాత్రాన్ని అరువు ఇవ్వబోతున్నారు. అమిత్ శర్మ దర్శకత్వంలో అర్జున్‌కపూర్, సోనాక్షి జంటగా ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర సంగీత దర్శకుడు సాజిత్ ఫర్హాద్... కథానుగుణం వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్‌ని ఏదైనా ఫ్రెష్ గొంతుతో పాడిస్తే బావుంటుందని భావించారట. వెంటనే ఆయనకు శ్రుతీహాసన్ గుర్తొచ్చారట. శ్రుతి ముందు ఈ ప్రపోజల్ ఉంచడంతో మారు మాట్లాడకుండా, ఆ పాట పాడటానికి అంగీకారం తెలిపారట శ్రుతీహాసన్. త్వరలోనే ఈ పాటను రికార్డ్ చేయనున్నారు. అంటే శ్రుతి గానం, సోనాక్షి అభినయం... ప్రేక్షకులకు డబుల్ ధమాకా అనమాట. -
బీహార్ మంత్రితో శ్రుతిహాసన్!
బీహార్ మంత్రితో శ్రుతిహాసన్ అనగానే వెంటనే ఏవేవో ఊహించుకోకండి. పూజై చిత్రంలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న తాజా చిత్రం పూజై. శ్రుతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి హరి దర్శకుడు. పూజై చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బీహార్ యువజన సంక్షేమ శాఖ మంత్రి వినయ్ బీహారి కలెక్టర్‌గా ముఖ్య పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆయన నటించడం అన్నది కాకతాళీయంగా జరిగిందట. పూజై చిత్రం కథ కొంత భాగం బీహార్‌లో జరుగుతుందట. దీంతో విశాల్ పోరాట దృశ్యాలను అక్కడ చిత్రీకరించారు. అయితే ఆ లొకేషన్స్ అనుమతి కోసం మంత్రి వినయ్ బీహారీ చిత్ర దర్శక నిర్మాతలు కలిశారు. అప్పుడు మీ చిత్రంలో నటించే అవకాశం కల్పించామని మంత్రి దర్శకుడు హరిని కోరారు. తాను పలు బోజ్‌పురి చిత్రాల్లో నటించినట్లు, ఒక చిత్రానికి దర్శకత్వం కూడా నెరపినట్లు మంత్రి తెలపడంతో పూజై చిత్రంలో కలెక్టర్ పాత్రలో నటించే అవకాశం ఇచ్చినట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి.