సోనాక్షికి శ్రుతి పాట! | sruthihasan sing a song on sonakshi movie | Sakshi

సోనాక్షికి శ్రుతి పాట!

Aug 12 2014 12:18 AM | Updated on Sep 2 2017 11:43 AM

సోనాక్షికి శ్రుతి పాట!

సోనాక్షికి శ్రుతి పాట!

ఓ వైపు అగ్ర తారగా కొనసాగుతూ, మరో వైపు తోటి కథానాయికలకు ప్లేబ్యాక్ పాడటం నిజంగా అరుదైన విషయమే. ఈ విధానానికి తెరలేపింది నిత్యామీనన్ అనే అనాలి.

ఓ వైపు అగ్ర తారగా కొనసాగుతూ, మరో వైపు తోటి కథానాయికలకు ప్లేబ్యాక్ పాడటం నిజంగా అరుదైన విషయమే. ఈ విధానానికి తెరలేపింది నిత్యామీనన్ అనే అనాలి. ఆ మధ్య ఓ సినిమా కోసం తోటి కథానాయికకు ప్లేబ్యాక్ పాడారామె. ఇప్పుడు ఆ ట్రెండ్‌ని కొనసాగించే పనిలో ఉన్నారు శ్రుతీహాసన్. ఇటీవలే ‘అలా మొదలైంది’ తమిళ రీమేక్ కోసం అందులో కథానాయికగా నటిస్తున్న రకుల్ ప్రీత్‌సింగ్‌కి ప్లేబ్యాక్ పాడారు శ్రుతి. త్వరలో ‘ఒక్కడు’ బాలీవుడ్ రీమేక్ ‘తేవర్’ సినిమా కోసం అందులో కథానాయికగా నటిస్తున్న సోనాక్షీ సిన్హాకు తన గాత్రాన్ని అరువు ఇవ్వబోతున్నారు.
 
అమిత్ శర్మ దర్శకత్వంలో అర్జున్‌కపూర్, సోనాక్షి జంటగా ఈ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ చిత్ర సంగీత దర్శకుడు సాజిత్ ఫర్హాద్... కథానుగుణం వచ్చే ఓ రొమాంటిక్ సాంగ్‌ని ఏదైనా ఫ్రెష్ గొంతుతో పాడిస్తే బావుంటుందని భావించారట. వెంటనే ఆయనకు శ్రుతీహాసన్ గుర్తొచ్చారట. శ్రుతి ముందు ఈ ప్రపోజల్ ఉంచడంతో మారు మాట్లాడకుండా, ఆ పాట పాడటానికి అంగీకారం తెలిపారట శ్రుతీహాసన్. త్వరలోనే ఈ పాటను రికార్డ్ చేయనున్నారు. అంటే శ్రుతి గానం, సోనాక్షి అభినయం... ప్రేక్షకులకు డబుల్ ధమాకా అనమాట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement