కాపాడాడు...పార్టీకి రమ్మన్నాడు! | he saved me and after invited to party,says sruthihasan | Sakshi
Sakshi News home page

కాపాడాడు...పార్టీకి రమ్మన్నాడు!

Published Sat, Aug 23 2014 12:24 AM | Last Updated on Sat, Sep 2 2017 12:17 PM

కాపాడాడు...పార్టీకి రమ్మన్నాడు!

కాపాడాడు...పార్టీకి రమ్మన్నాడు!

అన్యాయాలను ఎదిరించడం, తన దారికి అడ్డొచ్చిన విలన్లను చితగ్గొట్టడం.. హీరోయిన్‌పై ఈగ వాలకుండా చూసుకోవడం... సినిమాల్లో హీరో ప్రధాన కర్తవ్యం దాదాపు ఇదే. రీల్ మీదే కాదు.. ఒక్కోసారి రియల్‌గా కూడా హీరోలవుతుంటారు కొంతమంది. ఇటీవల బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ అలానే మారారు. ఆయన కనబర్చిన హీరోయిజమ్ శ్రుతీహాసన్ పాలిట వరమైంది. అసలు విషయంలోకి వస్తే.. అర్జున్ కపూర్, సోనాక్షీ సిన్హా జంటగా ‘ఒక్కడు’ హిందీ రీమేక్ ‘తేవర్’ రూపొందుతోంది. ఈ చిత్రంలోని ఒక ప్రత్యేక పాటను శ్రుతీహాసన్ పాడారు.
 
అది మాత్రమే కాదు.. ఈ పాటకు అర్జున్ కపూర్‌తో కలిసి కాలు కదిపారామె. ఈ పాటకు సంబంధించిన ఓ సన్నివేశంలో గుర్రాలు కూడా ఉన్నాయి. ఆ సన్నివేశం చిత్రీకరణకు సంబంధించిన విరామంలో శ్రుతీహాసన్ రిలాక్స్ అవుతున్నారు. కళ్లు మూసుకుని హాయిగా రిలాక్స్ అవుతున్న శ్రుతి తనకు జరగబోతున్న ప్రమాదాన్ని పసిగట్టలేకపోయారట. ఓ గుర్రం ముందుకు ఉరుక్కుంటూ వచ్చి, శ్రుతిని కాలితో తన్నబోవడం అర్జున్ కపూర్ దృష్టిలో పడిందట.
 
ఆ గుర్రం కాలు సరిగ్గా శ్రుతి పొట్టవైపు ఉందట. అర్జున్ సకాలంలో శ్రుతిని అక్కణ్ణుంచి పక్కకు లాగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఊహించని ఈ పరిణామానికి శ్రుతీహాసన్ కంగారు పడినా, ప్రమాదం తప్పినందుకు హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, కాపాడినందుకు తనతో పార్టీకి రమ్మని శ్రుతిని ఆహ్వానించారట అర్జున్. వరుణ్ ధావన్ హీరోగా రూపొందుతున్న ‘బద్లాపూర్’ చిత్రం షూటింగ్ ముగియడంతో ఆ చిత్రబృందం ‘ర్యాప్ అప్ పార్టీ’ ఏర్పాటు చేశారట. ఆ పార్టీకి ఆహ్వానం అందుకున్న అర్జున్‌కపూర్ తనతో పాటు శ్రుతిని కూడా తీసుకెళ్లారని బాలీవుడ్ టాక్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement