కథ వినకుండానే.. | sruthi hasan in murugadoss next film | Sakshi
Sakshi News home page

కథ వినకుండానే..

Published Wed, Oct 21 2015 1:56 PM | Last Updated on Sun, Sep 3 2017 11:18 AM

కథ వినకుండానే..

కథ వినకుండానే..

చెన్నై: నమ్మకం ఏమైనా చేయిస్తుంది. ముందు వెనుక ఆలోచించకుండా చేస్తుంది. నటి శ్రుతీహాసన్ అలాంటి అపారమైన నమ్మకంతో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. భారతీయ నటిగా తన హవా సాగిస్తున్న శ్రుతీహాసన్‌కు ప్రస్తుతం తమిళం, తెలుగు, హిందీ అంటూ చేతి నిండా చిత్రాలున్నాయి. ఆమె నటించిన హిందీ చిత్రం వెల్‌కమ్ బ్యాక్ ఇటీవల విడుదలైంది. ఆ చిత్ర హీరో జాన్ అబ్రహంతోనే మరో చిత్రం చేసే అవకాశం వరించింది. రాఖీ హ్యాండ్సమ్ అనే చిత్రంలో శ్రుతీ జాన్ అబ్రహంకు జంటగా మరోసారి రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నారు.

నిజానికి ఈ చిత్రంలో దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రాలలో ఒకరిని ఎంపిక చేయాలని దర్శక నిర్మాతలు ముందు భావించారట. అలాంటిది శ్రుతీహాసన్ కు ఈ అవకాశం దక్కింది. తనకు కథ నచ్చితేనే చిత్రం చేయడానికి అంగీకరిస్తానని తెగేసి చెప్పే శ్రుతీహాసన్ ఏఆర్ మురుగదాస్‌కు మాత్రం కథ వినకుండానే ఆయన చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపారట. ఆమెను 7ఆమ్ అరివు చిత్రం ద్వారా తమిళ సినిమాకు పరిచయం చేసిన దర్శకుడు కావడంతో ఆయనపై గౌరవంతోనే తాజా చిత్రంలో నటించడానికి అంగీకరించారట.

ప్రస్తుతం అఖీరా అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న మురుగదాస్ తదుపరి ద్విభాషా చిత్రానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటించనున్నారు. ఆయనతో శృతీ మరోసారి జతకడుతున్నారు. వీరిద్దరూ కలిసి నటించిన తెలుగు చిత్రం శ్రీమంతుడు ఘన విజయం సాధించిన నేపథ్యంలో మురుగదాస్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో శ్రుతీహాసన్ బలమైన పాత్రను పోషించనున్నారట.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement