SP Vikramjeet duggal
-
హరితహారంలో మొక్కలు నాటిన ఎస్పీ
మొక్కలు నాటుతున్న ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ ఆదిలాబాద్ క్రైం : హరితహారం కార్యక్రమంలో భాగంగా శనివారం వన్‌టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని శ్రీరాంనగర్ కాలనీలో జిల్లా ఎస్పీ విక్రమ్‌జిత్ దుగ్గల్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రకృతి సహజసిద్ధంగా ఉండటానికి ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత మొక్కలు నాటడం వల్ల కలిగే ఉపయోగాల గురించి తల్లిందడ్రులకు తెలియజేయాలన్నారు. ప్రతిఇంటిలో 5 మొక్కలు నాటాలని, జనమైత్రి అధికారులు ఇందుకోసం మొక్కలు సరఫరా చేస్తామని పేర్కొన్నారు. ఇంట్లో పూలచెట్లు, మునగచెట్లు, కూరగాయల మొక్కలు నాటడం వల్ల ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందన్నారు. చెట్లతో మానవ మనుగడ ఆధారపడి ఉందని, వర్షాలు కురవకపోవడానికి కారణం అడువులు అంతరించిపోవడమేన్నారు. పర్యావరణ మార్పులు గమనించి మొక్కలు నాటేందుకు ముందుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో వన్‌టౌన్ సీఐ సత్యనారాయణ, పాఠశాల హెచ్ఎం వెంకటస్వామి, వైస్ ప్రిన్సిపల్ నర్సయ్య, కాలనీ జనమైత్రి అధికారి అప్పారావులు ఉన్నారు. -
అమ్మా.. మందకృష్ణను మాట్లాడుతున్నా..
* ప్రభుత్వ విప్‌కు అగంతకుడి ఫోన్ * రెండు రోజుల్లో 17 కాల్స్ * అనుమానంతో మందకృష్ణకు ఫోన్ చేసిన సునిత * తాను కాదంటూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడి వివరణ * ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌కు ఫిర్యాదు చేసిన విప్ యాదగిరిగుట్ట : ‘‘అమ్మా.. నేను మందకృష్ణ మాదిగను మాట్లాడుతున్నా.. పేదింటి యువతికి వివాహం చేస్తున్నాం.. రూ. 6వేల ఆర్థికసాయం చేయాలి’’ అంటూ ఓ అగంతకుడు ప్రభుత్వ విప్ గొంగిడి సునితారెడ్డికి పలుమా ర్లు ఫోన్ చేశాడు. రెండు రోజుల్లోనే 17 సార్లు ఫోన్ చేశారు. దీంతో ఆమె విసిగి ఎస్పీకి చేశారు. విప్ సునీతారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. గత బుధవారం రాత్రి విప్ సునీతారెడ్డికి గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది. మందకృష్ణ మాదిగను మట్లాడుతున్న ఆర్థికసాయం కావాలని కోరగా సరే చూద్దాం లే అని ఆమె ఫోన్ కట్ చేసింది. మరుసటి రోజు ఉదయం 8.30 గంటల సమయంలో ఫోన్ చేయగా బిజీగా ఉన్నానన్డి ఫోన్ పెట్టేశారు. ఆ తర్వాత 11.15 వరకు వరుసగా 7 సార్లు ఫోన్ చేశాడు. అవసరమైతే ఎదైనా కల్యాణ మండపం ఇప్పిస్తానని విప్ సునీతారెడ్డి బదులు ఇచ్చారు. దీనికి ఫోన్ చేసిన వ్యక్తి లేదు లేదు రూ.ఆరు వేల సహాయమే కావాలని అడిగాడు. ఇలా బుధవారం, గురువారం రెండు రోజుల్లో ఓ నంబర్ నుం చి 14 సార్లు, మరో నంబర్ నుంచి 3 సార్లు ఫోన్ చేశాడు. రూ.ఆరు వేల కోసం మందకృష్ణ మాదిగ తనకు ఇన్ని సార్లు ఫోన్ చేయడం ఏమిటని అనుమానంతో విప్ మందకృష్ణ మాదిగకు ఫోన్ చేశారు. రూ. ఆరు వేలు ఎక్కడికి పంపించమంటారని అడగడంతో ఆయన అవాక్కయ్యారు. నేను మీకు ఫోన్ చేయలేదు అంటూ వివరణ ఇచ్చారు. దీంతో ఆమె వెంటనేఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్‌కు ఫిర్యాదు చేశారు. 25 రోజుల క్రితం కూడా ఓ అగంతకుడు ఫోన్ చేసి డబ్బులు అడిగాడని తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు. కాగా ఫోన్ నంబర్ల ఆధారంగా ఓ అనుమానితుడిని పోలీ సులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిసింది. -
ప్రమాదాల నివారణకు చర్యలు
దేవరకొండ/చింతపల్లి : రోజురోజుకూ పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపడుతున్నట్టు ఎస్పీ విక్రమ్‌జీత్‌దుగ్గల్ తెలిపారు. దేవరకొండ డివిజన్ పరిధిలోని పలు మండలాల పోలీస్స్టేషన్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది వివరాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను పరిశీలించి క్రైమ్‌రేట్ ఏ విధంగా ఉందో తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర రహదారులపై అవసమున్న చోట త్వరలోనే పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపించినట్టు వివరించారు. విద్యార్థులు, మహిళలను వేధించే పోకిరీల ఆగడాలను నిరోధించేందుకు షీటీమ్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు, సినిమా థియేటర్లు, కాలేజీలు, పార్కులతో పాటు పబ్లిక్ ప్రదేశాలలో మహిళలను వేధించే ఆకతాయిలు ఇకనుంచి జైలు ఊచలు లెక్కించాల్సిందేనన్నారు. జిల్లాలో మావోయిస్టుల కదలికలు లేవని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు కృషి జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నట్టు ఎస్పీ చెప్పారు. గురువారం ఆయన దేవరకొండ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి మాట్లాడారు. సమస్యాత్మక ప్రాంతాలలో నిరంతర నిఘా ఉంటుందన్నారు. దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలోని నాంపల్లి, మర్రిగూడ, చింతపల్లి, చందంపేట, డిండి పోలీస్స్టేషన్లను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. అంతకు ముందు ఆయనకు పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఆయన వెంట దేవరకొండ డీఎస్పీ చంద్రమోహన్, సీఐ రవీందర్‌రెడ్డి, ఎస్ఐ మోహన్‌రెడ్డి, రాఘవేందర్‌రెడ్డి, పోలీస్ సిబ్బంది తదితరులున్నారు.