'గిరిజనుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి'
విశాఖపట్టణం: గోదావరి పుష్కరాల్లో ఏజెన్సీ ప్రాంతాల నుంచి వచ్చే గిరిజనుల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి డిమాండ్ చేశారు. సోమవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె కోరారు. జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల నుంచి పుష్కరాలకు గిరిజనులు పుష్కరాలకు రానున్నారని ఆమె ఈ సందర్భంగా తెలిపారు.