Special Activity
-
ప్లాస్టిక్ రహిత రాష్ట్రం కోసం ప్రణాళిక
జనగామ: ప్లాస్టిక్ రహిత తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర బీసీ, టూరిజం కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. జనగామ మండలంలోని ఓబుల్‌కేశ్వాపూర్ గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆయలంలో శనివారం జరిగిన పూజా కార్యక్రమాల్లో స్టేట్ బీసీ వెల్ఫేర్ ఎండీ అశోక్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం వెంకటేశం మాట్లాడుతూ పాస్టిక్ రహిత ఉద్యమాన్ని ఓబుల్‌కేశ్వాపూర్ నుంచి ప్రారంభంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు. ఇందు కోసం గ్రామానికి ఇద్దరు గీతాకార్మికుల కుటుంబాలకు చెందిన యువకుల శ్రీధర్, కర్ణాకర్‌కు తాటి కొమ్మలతో తయారు చేసే వస్తువులపై కేరళలో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. అక్కడ శిక్షణ పొందిన కళాకారులు గ్రామంలోని చాలా మందికి దీనిపై అవగాహన కల్పిస్తున్నాన్నారు. తాటి కొమ్మలతో బుట్టలు, హ్యాండ్ బ్యాగులు ఇలా ప్రతి ఒక్కటి తయారు చేసే విధంగా తాము ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా వీటి తయారీ ఉంటుందన్నారు. అంతే కాకుండా ఓబుల్కేశ్వాపూర్ను ఓ మినీ ఇండస్ట్రియల్ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. హారతి కర్పూరం, ఊది బత్తీలు తదితర పూజా సామాగ్రి ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడే తయారు చేసి, ఎగుమతి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించడం తమ బాధ్యత అన్నారు. ఇక్కడి సక్సెస్ రేటు ఆధారంగా వీటిని అన్ని చోట్ల విస్తరిం చేలా ప్రయత్నిస్తామన్నారు. ఇందుకు యువతకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు చే యాలని లోచిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ జయప్రకాష్‌రెడ్డి, ఎంపీడీఓ హశీమ్ ఉన్నారు. -
టెన్త్‌కు అంకితమై
ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక కార్యాచరణ ‘కమిట్మెంట్’ పేరిట 10 వారాల ప్రణాళిక ఏలూరు సిటీ : జిల్లాలో విద్యా కుసుమాలను వికసింపజేసేందుకు అంకితభావం (కమిట్మెంట్) పేరిట ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నారు. పది వారాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించేందుకు విద్యాశాఖ దీనిని రూపొందించింది. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లాను రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలబెట్టేందుకు సులువైన అష్టాంగ మార్గాలను సైతం పాటించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అర్ధ వార్షిక పరీక్షల్లో విద్యార్థుల సామర్థ్యాన్ని గుర్తించి, వారిని నాలుగు గ్రేడులుగా విభజించారు. ప్రతి విద్యార్థిపై దృష్టి సారించి పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించేలా కమిట్మెంట్ (కరిక్యులర్ ఆర్గనైజేషన్, మెథడ్స్ మోడిఫికేషన్ ఇన్ ది టెన్త్ క్లాస్ మెయిన్ ఎగ్జామ్స్ బై ఎంకరేజ్మెంట్ నేచురల్ టాలెంట్స్) పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నారు. ఆణిముత్యాలు, ఆశా జ్యోతులపై ప్రత్యేక దృష్టి : అర్ధవార్షిక పరీక్షల్లో 80నుంచి 100 శాతం మార్కులు పొందిన విద్యార్థులను ‘పశ్చిమ ఆణిముత్యాలు’, 61నుంచి 80శాతం మార్కులు వచ్చిన వారిని ‘పశ్చిమ వజ్రాలు’, 35-60 శాతం వస్తే ‘పశ్చిమ బంగారాలు’, 0 నుంచి 35శాతం మార్కులు వచ్చిన వారిని ‘పశ్చిమ ఆశాజ్యోతులు’గా వర్గీకరించారు. ఆణిముత్యాలు 2,104 మంది, వజ్రాలు 10,332 మంది, బంగారాలు 13,888 మంది, ఆశాజ్యోతులు 5,114 మంది ఉన్నట్టు గుర్తించారు. ఆణిముత్యాలు, ఆశా జ్యోతులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని నిర్ణయించారు. అర్ధ వార్షిక పరీక్షల్లో వెనుకబడిన విద్యార్థులను ఉపాధ్యాయులు దత్తత తీసుకుంటారు. పరీక్షల్లో వారు ఉత్తీర్ణత సాధించేలా తర్ఫీదు ఇస్తారు. అర్ధవార్షిక పరీక్షల్లో ఒక సబ్జెక్టులో ఫెయిలైన విద్యార్థులు 2,065 మంది, రెండు సబ్జెక్టుల్లో ఫెయిలైన వారు 1,418 మంది, మూడు కంటే ఎక్కువ సబ్జెక్టుల్లో తప్పినవారు 1,631 మంది ఉన్నారు. వీరందరికీ ప్రత్యేక తర్ఫీదు ఇచ్చేందుకు చర్యలు చేపట్టామని డీఈవో డి.మధుసూదనరావు చెప్పారు. పదో తరగతి ఉత్తీర్ణతలో అగ్రస్థానం సాధించేందుకు కమిట్మెంట్ పేరిట ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. అష్టాంగ మార్గాలను ఆయన వివరించారు అష్టాంగ మార్గాలివీ విద్యార్థుల్లో విద్యా సామర్థ్యాల గ్రేడింగ్ నిర్ణయించటం విద్యార్థుల దత్తత : ఒక్కో ఉపాధ్యాయుడు పదిమందిని దత్తత తీసుకోవటం గృహ సందర్శన : ఉపాధ్యాయులు విద్యార్థుల గృహాలను సందర్శించటం. గృహాల సందర్శన ప్రతిరోజూ సాయంత్రం 6.30 నుంచి 8.30 గంటల వరకు, ఉదయం 4.30 నుంచి 6.30గంటల వరకు ఉండాలి. హామీ పత్రాలు : ప్రతి ఉపాధ్యాయుడి నుంచి ‘నేను బోధించి సబ్జెక్ట్‌లో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా కృషి చేస్తా’నని హామీ పత్రాలు తీసుకుంటారు. ప్రత్యేక తరగతులు : ఉదయం 8.30నుంచి 9.30 గంటల వరకు, సాయంత్రం 4.40నుంచి 5.40 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహణ బృంద చదువులు : గ్రామాల్లో ఉపాధ్యాయుల ఇళ్లవద్ద లేదా అంగన్వాడీ కేంద్రాల వద్ద టెన్త్ విద్యార్థులకు బృంద చదువులు మార్గదర్శక బృందాలు : ప్రతి బుధవారం మార్గదర్శక బృందం గ్రామాల్లో తిరుగుతూ బృంద చదువుల పరిస్థితిని పరిశీలిస్తుంది. ఎంఈవో, నలుగురు సబ్జెక్టు నిపుణులతో ఈ బృందాన్ని ఏర్పాటు చేశారు. బడిలో బస : సంక్రాంతి సెలవుల అనంతరం బడిలో బస కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. విద్యా శాఖ అధికారులంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి స్టడీ మెటీరియల్ : టెన్త్ విద్యార్థులందరికీ స్టడీ మెటీరియల్ అందజేస్తారు. ప్రత్యేకంగా రూపొందిం చిన 10వారాల కమిట్మెంట్ ప్రోగ్రామ్ బుక్‌లెట్‌ను ఉపాధ్యాయులకు అందజేస్తారు. -
బస్సు..జీపీఎస్సు
మనం ప్రయాణిస్తున్న సిటీ బస్సు గంటకు కిలోమీటరు దూరమైనా వెళ్లకపోవడం... ట్రాఫిక్‌లో ఇబ్బందులు పడడం... ఆఫీసుకో... ఇంటికో... ఆలస్యంగా చేరుకోవడం... ట్రాఫిక్ పోలీసులను నిందించడం... నిత్యం నగరంలో ఎదురవుతున్న సమస్యే. ఈ సమస్య నుంచి బయట పడేందుకు అధికారులు యోచిస్తున్నారు. సిటీ బస్సు సాయంతోనే దీన్ని అధిగమించేందుకు యత్నిస్తున్నారు. - ‘సిటీబస్సు’తో ట్రాఫిక్ రద్దీ నియంత్రణ - కంట్రోల్ రూమ్‌తో ఆర్టీసీ జీపీఎస్ అనుసంధానం - వాహన కదలికల ఆధారంగా గుర్తింపు - ప్రత్యేక కార్యాచరణకు ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధం సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సు ఇక ట్రాఫిక్ పోలీసు అవతారమెత్తనుంది. గ్రేటర్ హైదరాబాద్‌లో వాహనాల రద్దీ నియంత్రణకు దిక్సూచిగా మారనుంది. బస్సు వేగం, కదలికల ఆధారంగా రోడ్లపై వాహనాల రద్దీ ఏ స్థాయిలో ఉందో తెలుసుకొనేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నద్ధమవుతున్నారు. నగరంలో ప్రస్తుతం మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఓల్వో బస్సులను ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లోని జీపీఎస్‌తో అనుంధానించిన సంగతి తెలిసిందే. వీటిలో ఏర్పాటు చేసిన వెహికల్ మానిటరింగ్ యూనిట్స్ ఆధారంగా బస్సు కదలికలు నమోదవుతాయి. బస్సు ఎంత వేగంతో వెళుతోందో ఇట్టే తెలిసిపోతుంది. ఒకే సారి నగరంలోని అన్ని ప్రధాన మార్గాల్లోనూ జీపీఎస్ ఆధారిత బస్సుల కదలికలను బట్టి ట్రాఫిక్ రద్దీ ఏ స్థాయిలో ఉందో తెలిసిపోతుంది. రద్దీ తీవ్రంగా ఉంటే నివారించేందుకు... అవ సరమైన చోట వాహనాలను దారి మళ్లించేందుకు చర్యలు తీసుకుంటారు. దీని కోసం ఆర్టీసీ రూపొందించిన జీపీఎస్ సాంకేతిక పరిజ్ఞానాన్ని త్వరలో పోలీస్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేయనున్నారు. కొన్ని ప్రైవేట్ క్యాబ్ సంస్థలు, ట్యాక్సీలు జీపీఎస్ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ వాటి కదలికల ఆధారంగా ట్రాఫిక్ రద్దీని తె లుసుకోవడం సాధ్యం కాదని అధికారులు గుర్తించారు. ఆర్టీసీ జీపీఎస్‌లో మాత్రమే ప్రతి 10 సెకన్లకు బస్సు వేగాన్ని తెలుసుకునే పరిజ్ఞానం అందుబాటులో ఉంది. దీనివల్ల వాహనాల రద్దీ తీవ్రతను కచ్చితంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జేఎన్ఎన్యూఆర్ఎం బస్సులకు మాత్రమే పరిమితమైన జీపీఎస్‌ను దశల వారీగా ఆర్డినరీ సర్వీసులకు విస్తరించేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. దీంతో పోలీసులు మరింత సమర్ధంగా ట్రాఫిక్ నియత్రణ చర్యలు తీసుకోగలుగుతారని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. రద్దీ రూట్లపై ప్రత్యేక శ్రద్ధ రోజు రోజుకూ వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ప్రస్తుతం గ్రేటర్లో 43 లక్షలకు పైగా వాహనాలు ఉన్నాయి. దీనికి అనుగుణంగా రహదారులు విస్తరించకపోవడం... మరోవైపు మెట్రో పనులతో అనేక మార్గాల్లో వాహనాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఇరుకు రోడ్లతో వాహనాల సగటు వేగం దారుణంగా పడిపోయింది. కనీసం గంటకు 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో వెళ్లవలసిన వాహనాలు పట్టుమని 10 కిలోమీటర్లు దాటడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రయాణం మరింత నరకప్రాయంగా మారింది. రద్దీ తీవ్రంగా ఉన్న సమయాల్లో సిటీబస్సుల వేగం మరింత పడిపోతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని పోలీసులు వీటి వేగాన్ని, కదలికలను ప్రామాణికంగా తీసుకున్నట్లు సమాచారం. ఉప్పల్-తార్నాక-సికింద్రాబాద్, లకిడికాఫూల్-అమీర్‌పేట్-కూకట్పల్లి, ఎల్బీనగర్-దిల్సుఖ్నగర్-కోఠి వంటి మార్గాల్లో ఆర్టీసీ వినియోగిస్తున్న జీపీఎస్ ఆధారంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టనున్నారు.