జనగామ: ప్లాస్టిక్ రహిత తెలంగాణ కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర బీసీ, టూరిజం కార్పొరేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. జనగామ మండలంలోని ఓబుల్‌కేశ్వాపూర్ గ్రామంలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆయలంలో శనివారం జరిగిన పూజా కార్యక్రమాల్లో స్టేట్ బీసీ వెల్ఫేర్ ఎండీ అశోక్‌కుమార్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం వెంకటేశం మాట్లాడుతూ పాస్టిక్ రహిత ఉద్యమాన్ని ఓబుల్‌కేశ్వాపూర్ నుంచి ప్రారంభంచాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామన్నారు.
ఇందు కోసం గ్రామానికి ఇద్దరు గీతాకార్మికుల కుటుంబాలకు చెందిన యువకుల శ్రీధర్, కర్ణాకర్‌కు తాటి కొమ్మలతో తయారు చేసే వస్తువులపై కేరళలో శిక్షణ ఇప్పించినట్లు తెలిపారు. అక్కడ శిక్షణ పొందిన కళాకారులు గ్రామంలోని చాలా మందికి దీనిపై అవగాహన కల్పిస్తున్నాన్నారు. తాటి కొమ్మలతో బుట్టలు, హ్యాండ్ బ్యాగులు ఇలా ప్రతి ఒక్కటి తయారు చేసే విధంగా తాము ప్రత్యేక దృష్టి సారిస్తున్నామన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే విధంగా వీటి తయారీ ఉంటుందన్నారు. అంతే కాకుండా ఓబుల్‌కేశ్వాపూర్‌ను ఓ మినీ ఇండస్ట్రియల్ కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు.
హారతి కర్పూరం, ఊది బత్తీలు తదితర పూజా సామాగ్రి ఇలా ప్రతి ఒక్కటి ఇక్కడే తయారు చేసి, ఎగుమతి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి కల్పించడం తమ బాధ్యత అన్నారు. ఇక్కడి సక్సెస్ రేటు ఆధారంగా వీటిని అన్ని చోట్ల విస్తరిం చేలా ప్రయత్నిస్తామన్నారు. ఇందుకు యువతకు ఆర్థిక భరోసా కల్పించేందుకు బీసీ కార్పొరేషన్ నుంచి నిధులు మంజూరు చే యాలని లోచిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ జయప్రకాష్‌రెడ్డి, ఎంపీడీఓ హశీమ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment