special budget for farmers
-
కాంగ్రెస్ హామీలకు ఏటా అయ్యే ఖర్చెంత?
కాంగ్రెస్ పార్టీ మంగళవారం విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో కనీస ఆదాయ పథకం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, రైతులకు ప్రత్యేక బడ్జెట్,ఆరోగ్య సంరక్షణ వరకు అనేక హామీలు ఇచ్చింది.అయితే, ఈ హామీల అమలుకు ఏటా పది లక్షల కోట్ల రూపాయలు కావలసి ఉంటుందని, అది దేశ ఆర్థిక వ్యవస్థనే కుదేలు పరుస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ► కనీస ఆదాయ పథకం (న్యాయ్) ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 20శాతం నిరుపేద కుటుంబాలకు ఏటా 72వేల చొప్పున ఇవ్వాలి.అయితే, దీన్ని యథాతథంగా అమలు చేస్తే దేశ ఆర్థిక వ్యవస్థే తల్లకిందులవుతుందని నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు.కనీస ఆదాయ పథకం కోసం ఏటా 3.60 లక్షల కోట్లు కావాలి. మొదటి సంవత్సరం దీనికయ్యే ఖర్చు దేశ జీడీపీలో దాదాపు 1శాతం ఉంటుంది. రెండో ఏడాది అది 1.5శాతానికి పెరుగుతుంది. ► జీడీపీలో 6శాతం విద్యకే కావాలి విద్యారంగం వ్యయాన్ని పెంచడం మంచిదే.ఈ సొమ్ములో అధికభాగం మౌలిక సదుపాయాలు, టీచర్లకు వేతనాల కోసం వెచ్చించాల్సి ఉంటుంది.ప్రస్తుతం ప్రభుత్వం జీడీపీలో 4.6శాతాన్ని విద్యకోసం వెచ్చిస్తోందని హెచ్ఆర్డీ మంత్రి ప్రకాశ్‌జవదేకర్ చెబుతున్నారు. ఇది 8.76 లక్షల కోట్లకు సమానం.కాంగ్రెస్ తాజా హామీ అమలు పరచాలంటే అదనంగా ఏటా మరో 2.66 లక్షల కోట్లు అవసరం.అంటే, ఏటా మొత్తం 11.4 లక్షల కోట్ల రూపాయలు కావాలన్నమాట. ► ఆరోగ్య సంరక్షణకు 5 లక్షల కోట్లు 2023–24నాటికి ఆరోగ్య సంరక్షణ కోసం జీడీపీలో 3శాతం వరకు వెచ్చించనున్నట్టు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొంది. ప్రస్తుత వ్యయం కంటే ఇది రెండింతలు ఎక్కువ.నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం ప్రస్తుతం ఆరోగ్యంపై ఏటా 2.47 లక్షల కోట్లు (జీడీపీలో1.3శాతం) ఖర్చు చేస్తున్నారు. పౌరులందరికీ ఉచితంగా ఆరోగ్య సంరక్షణ కల్పించడం, వైద్య సదుపాయాలను మెరుగుపరచడం వంటి రాహుల్ గాంధీ హామీలను అమలు పరచాలంటే ఏటా 5.71లక్షల కోట్లు అవుతుంది. మొత్తం మీద కాంగ్రెస్ ఎన్నికల హామీలు వార్షిక బడ్జెట్‌పై 10 లక్షల కోట్ల అదనపు భారాన్ని వేస్తాయి. 2019–20 సంవత్సరంలో బడ్జెట్ వ్యయం 27.84 లక్షల కోట్లు మాత్రమే. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే రాహుల్ హామీలు ఎంత భారమో అర్థమవుతుంది. ప్రభుత్వ ఆదాయం ఏటా 12 నుంచి 14శాతం పెరుగుతోంది. 2018–19లో 24.57 లక్షల కోట్లు ఉన్న ఆదాయం 2023–24 నాటికి 45 లక్షల కోట్లకు పెరుగుతుంది. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అయితే, హామీల అమలుకు ఏటా 10లక్షల కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది. ఇప్పటికే సిబ్బంది వేతనాలు, వడ్డీల చెల్లింపులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సామాజిక పథకాల వ్యయం మొదలయిన వాటికి అయ్యే ఖర్చు ఆదాయానికి మించిపోతోంది. ఇలాంట పరిస్థితుల్లో ఏటా అదనంగా పది లక్షల కోట్లు భరించడం భారమేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్కారీ కొలువుల భర్తీ భారం 8వేల కోట్లకుపైనే.. 2020 మార్చి నాటికి 4 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని, రాష్ట్రాలు మరో 20 లక్షల ఖాళీలు భర్తీ చేసేలా చూస్తామని కాంగ్రెస్ మానిఫెస్టో హామీ ఇచ్చింది.7వ వేతన సంఘం సిఫారసు ప్రకారం ఉద్యోగి కనీస వేతనం 18వేలు. అంటే ఏడాదికి 2.16లక్షలు. రాహుల్ చెప్పినట్టు 4లక్షల మందిని నియమిస్తే వారికి కనీస వేతనం లెక్కన చూసినా ఏడాదికి 8,640 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది.రాష్ట్రాలు కూడా మరో 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే ఈ భారం తడిసిమోపెడవుతుంది. -
రైతు ‘పెట్టుబడి’కి 9,700 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రానున్న బడ్జెట్లో రైతు పెట్టుబడి పథకానికి రూ.9,700 కోట్లు కేటాయించాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఈ మేరకు ఆర్థిక శాఖకు విజ్ఞప్తి చేసింది. వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి ఈ మొత్తం అవసరమని తెలిపింది. ఈసారి వ్యవసాయశాఖకు ప్రత్యేక బడ్జెట్ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు వ్యవసాయ శాఖ బడ్జెట్ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. పెట్టుబడి పథకం నిధులతో కలిపి ప్రగతి పద్దు కింద మొత్తం రూ. 12,800 కోట్లు వ్యవసాయ బడ్జెట్‌గా ఉండే అవకాశముందని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నా యి. ఈ సారి వ్యవసాయ యాంత్రీకరణకు రూ.500 కోట్లు కేటాయించాలని ప్రతిపాదించారు. 2017–18 బడ్జెట్లో యాంత్రీకరణకు రూ.336 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ సారి అదనంగా రూ.164 కోట్ల మేరకు కోరుతున్నారు. ఇక వడ్డీలేని రుణాలకు ప్రస్తుత బడ్జెట్లో రూ.340 కోట్లు కేటాయిస్తే, వచ్చే బడ్జెట్లో రూ. 500 కోట్లు ప్రతిపాదించారు. విత్తన సబ్సిడీకి గత బడ్జెట్లో రూ.138 కోట్లు కేటాయిస్తే, రానున్న బడ్జెట్లో రూ.400 కోట్లు ప్రతిపాదించారు. ఖరీఫ్ పెట్టుబడి సాయం 6,480 కోట్లు రాష్ట్రంలో దాదాపు 1.62 కోట్ల ఎకరాల సాగు భూమి ఉన్నట్టు ప్రభుత్వం నిర్ధారణకు వచ్చిందని.. దాని ప్రకారం 1.62 కోట్ల ఎకరాలకు లెక్కవేసి వచ్చే ఖరీఫ్‌కు రూ.6,480 కోట్లు, మరో రూ.3,220 కోట్లు రబీ సీజన్‌కు ఇవ్వాలని కోరుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఆ భూములకు ‘పెట్టుబడి’ అందదు! పెట్టుబడి పథకంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సాగుకు యోగ్యంకాని భూములుంటే వాటిని పెట్టుబడి పథకం నుంచి మినహాయించాలని సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. సాగుకు యోగ్యం కాని భూమి మొత్తంగా రెండు శాతం ఉండొచ్చని, ప్రస్తుతం ఆ భూమిని గుర్తించాల్సి ఉందని చెబుతున్నారు. -
'రైతులకు ఉచిత విద్యుత్... ప్రత్యేక బడ్జెట్'
-
రైతులకు ఉచిత విద్యుత్... ప్రత్యేక బడ్జెట్: జగన్
రైతు సౌఖ్యంగా ఉన్నప్పుడే దేశం సుభిక్షంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వ్యవసాయానికి పెద్ద పీట వేస్తామన్నారు. ప్రతి రైతుకు 7 గంటలపాట ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. రైతులకు వడ్డీలేని రుణాలు కూడా అందిస్తామన్నారు. వ్యవసాయ శాఖను ఇద్దరు మంత్రులకు కేటాయిస్తామని చెప్పారు. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఆదివారం వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో జరిగిన ఆ పార్టీ రెండు ప్లీనరీ సమావేశంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రసంగించారు. రైతు సమస్యల కోసం 101, పశువు సమస్యల కోసం 101 ఉచితంగా పోన్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో 104, 108 సేవలు దాదాపుగా కనుమరుగైన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సేవలను పునరుద్దరిస్తామన్నారు. ఎన్నివేల కోట్లు ఖర్చు అయిన పిల్లలకు ఉచిత విద్యను అందిస్తామన్నారు. రైతు సంతోషంగా ఉన్ననాడే దేశం సౌఖ్యంగా ఉంటుందన్నారు. బెల్ట్ షాపుల నిర్మూలిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి సాంఘిక భద్రత, వృద్ధులు భద్రత తనదేనని స్పష్టం చేశారు. మహిళల పురోగతి కోసం ప్రత్యేక చర్యలు చేపడతామన్నారు. మద్య నియంత్రణ కోసం మహిళ పోలీసులు ఏర్పాటు చేస్తామన్నారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి జులై 8న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి ప్లీనరీ సమావేశం జరిగిందని జగన్ ఈ సందర్బంగా గుర్తు చేశారు. అనాటి నుంచి జరిగిన పరిణామాలను వైఎస్ జగన్ సోదాహరణగా వివరించారు. గత రెండున్నర ఏళ్లులో ఎన్నో కష్టాలు పడ్డామన్నారు. ఓట్లు, సీట్లు కోసం చేసిన కుట్రలు కుతంత్రాలు చూశామన్నారు. ఎన్నికుట్రలు కుంత్రాలు చేసిన వెంట్రుక కూడా పీకలేకపోయారని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాజకీయాలు ఇంత అన్యాయంగా ఉంటాయో అప్పుడే తెలిసిందన్నారు. తన ప్రసంగంలో చంద్రబాబు, కిరణ్ పాలనలపై వైఎస్ జగన్ నిప్పులు చెరిగారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రస్తుత ప్రభుత్వం కనుమరుగుచేసిందని ఆరోపించారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పరిపాలన చేసింది ఒక్క వైఎస్ రాజశేఖరరెడ్డి అని జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం కిరణ్ పాలనలో అనారోగ్యశ్రీగా మారిందని ఎద్దేవా చేశారు. ఆ పథకంలోని 129 సేవలను కిరణ్ సర్కార్ తొలగించిందని చెప్పారు. రాష్ట్ర విభజన చేస్తున్న యూపీఏ అధ్యక్షురాలు సోనియాపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని సమైక్యం ఉంచే క్రమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏనాడైన జాతీయస్థాయిలో ఏ నేతనైనా కలిశారా అని ప్రశ్నించారు. కనీసం ఏనాడు నిరాహారదీక్ష కూడ చేయలేదని జగన్ పేర్కొన్నారు.