‘హైదరాబాద్-రంగారెడ్డిలకు ప్రత్యేక జోన్ ’ అవసరం
ఉద్యోగాలు, ప్రమోషన్లలో స్థానికులకు అన్యాయం: సబిత
ముఖ్యమంత్రికి లేఖ
రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానికుల హక్కులను పరిరక్షించేలా రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ‘ప్రత్యేక ఎంప్లాయీమెంట్ జోన్’ ఏర్పాటు చేయాలని మాజీమంత్రి సబి తారెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాలు, ప్రమోషన్లలో జంటజిల్లాలకు జరుగుతున్న అన్యాయంపై సీఎం కేసీఆర్కు ఆమె లేఖ రాశారు. రెండు జిల్లాల్లోని డిప్యూటేషన్లను రద్దు చేసి దొడ్డిదారిన వచ్చిన వారిని సొంత జిల్లాలకు పంపాలని డిమాండ్ చేశారు.
ఫోకల్ (ప్రయార్టీ) పోస్టుల భర్తీలతో లోకల్ ఉద్యోగులకు ప్రాధాన్యమివ్వాలని, జంటజిల్లాలో ఖాళీల భర్తీలోనూ స్థానికులనే పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ప్రత్యేకరాష్ట్రంలో అవకాశాలు మెరుగుపడతాయని ఆశించిన నిరుద్యోగుల ఆశలు వమ్ము చేయొద్దని కోరారు.