special facilities
-
ఏసీ లేదు.. చిన్నమ్మ తమిళనాడుకూ రారు!
ఒక పక్క ఎండలు మండిపోతున్నాయి.. కానీ జైల్లో ఏసీ లేదు. కనీసం ప్రత్యేక సదుపాయాలు కూడా లేవు. మంచం ఇవ్వకపోవడంతో కటిక నేలమీద పడుకోవాల్సి వస్తోంది. ఇదీ బెంగళూరు పరప్పణ అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళ ప్రస్తుత పరిస్థితి. పొరుగు రాష్ట్రం కాబట్టి ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయని, సొంత రాష్ట్రం వెళ్లిపోతే కొంత మెరుగ్గా ఉంటుందని అనుకున్నా, అది కూడా సాధ్యం కావడం లేదు. జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలుశిక్ష పడిన అన్నాడీఎంకే నాయకురాలు శశికళను తమిళనాడులోని వేరే జైలుకు తరలించే అవకాశం ఉందంటూ వచ్చిన కథనాలను కర్ణాటక జైళ్ల శాఖ అధికారులు ఖండించారు. ఈ విషయమై సమాచార హక్కు చట్టం ప్రకారం న్యాయవాది ఎంపీ రాజవేలాయుధం పలు ప్రశ్నలు అడిగారు. దానికి పరప్పణ అగ్రహారలోని సెంట్రల్ జైలుకు చెందిన డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్ సమాధానం ఇచ్చారు. కర్ణాటక నుంచి తమిళనాడుకు ఆమెను తరలించాలంటూ అసలు తమకు ఇంతవరకు ఎలాంటి దరఖాస్తు అందనే లేదని ఆయన చెప్పారు. శశికళను, ఆమె బంధువు ఇళవరసిని కర్ణాటక నుంచి తమిళనాడుకు బదిలీ చేసే ప్రతిపాదన ఏమైనా ఉందా అని అడగ్గా, ఖైదీల నుంచి తమకు అలాంటి దరఖాస్తు రాలేదని లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అన్నడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్‌కు 35-40 నిమిషాల పాటు శశికళతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చామని కూడా ఆ సమాధానంలో చెప్పారు. ఆమె గదిలో ఒక్క టీవీ తప్ప అదనపు సదుపాయాలు ఏమీ లేవని స్పష్టం చేశారు. మంచం, పరుపు, ఫ్యాన్, ఏసీ, వాటర్ హీటర్, ప్రత్యేక బాత్రూం.. ఇవేమీ శశికళకు అందించలేదని వివరించారు. -
వారి కోసం త్వరలో ప్రత్యేక సౌకర్యాలు..
ఢిల్లీ: దివ్యాంగుల కోసం 144 ప్రముఖ పర్యాటక స్థలాలలో ప్రత్యేక సౌకర్యాలను కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. వీల్ చైర్లు, బ్యాటరీతో నడిచే బండ్లు, ప్రత్యేక టాయిలెట్లతోపాటు ప్రత్యేక మార్గాలను వారి కోసం ఏర్పాటు చేయనున్నారు. తొలివిడతలో 50 పర్యాటక స్థలాలలో ఆ సౌకర్యాలను కల్పించనున్నారు. గత డిసెంబరులో ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన 'సుగమ్య భారత్ అభియాన్' పథకంలో భాగంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సంకల్పించింది. వివిధ రకాలైన వైకల్యంతో వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్న సుమారు 50 నుంచి 80 లక్షల మంది సౌకర్యాల లేమి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నది విశ్లేషకుల మాట. కేవలం వారికి తగిన సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే పర్యాటక స్థలాలకు వెళ్లే హక్కును కోల్పోతున్నారు. అందరితోపాటు దివ్యాంగులకు కూడా సమాన సౌకర్యాలు కల్పించాలనే సంకల్పంతోనే 'సుగమ్య భారత్ అభియాన్' పథకాన్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దానిలో భాగంగా 2018 జూలై వరకు జాతీయ, రాష్ట్ర ముఖ్య నగరాల్లోని ప్రభుత్వ రంగ సంస్థల్లో కనీసం 50 శాతం భవనాల్లోనైనా దివ్యాంగులకు సకల సౌకర్యాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు సాంస్కృతిక శాఖ వెల్లడించింది. కట్టడాల నిర్మాణాన్ని మార్చకుండానే.. వారికి తగిన సౌకర్యాలను కల్పించే దిశగా అడుగులు పడనున్నాయి. తొలివిడతలో తాజ్ మహల్, జగన్నాథ ఆలయం, ఖజురహో, కుతుబ్ మినార్, ఎర్రకోట, హంపి, కోణార్క్ సూర్య దేవాలయం తదితర కట్టడాలను ఎంపిక చేశారు. అలాగే త్వరలోనే ప్రతి పర్యాటక స్థలంలోను సౌర విద్యుత్ వినియోగించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. -
ప్రొటోకాల్ పాటించండి
డ్యూటిప్స్ మహిళలకు ఇప్పుడు ప్రతి కార్యాలయంలో తప్పనిసరిగా ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆఫీసులో చేరే ముందుగానే వీటిని పరిశీలించుకోవాలి. {పొటోకాల్ ప్రకారం తమ పై అధికారులకు ఇవ్వాల్సిన గౌరవ మర్యాదల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అత్యవసరమై బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు తప్పకుండా అనుమతి తీసుకోవాలి. అది ఎంత అర్జంటు పనైనా సరే ఇతరుల పని డిస్ట్రబ్ చేసేలా జరిపే సంభాషణ, కాలక్షేపపు ముచ్చట్లలో వీలున్నంత వరకూ పాలు పంచుకోకుండా ఉండాలి. తమని ఇంప్రెస్ చేసేందుకు మగ కొలీగ్స్ చేసే ప్రయత్నాలపై కొంత అవగాహన ఉండాలి. అవి మితి మీరకుండా ముందుగానే కట్ చేయడం అవసరం. -
జైల్లో రాజభోగాలకు రూ 1.23 కోట్లు ఖర్చు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ చీఫ్ సుబ్రతా రాయ్ జైల్లోనూ రాజభోగాలు అనుభవించారు. ఏడాదికిపైగా ప్రత్యేక సెల్లో ఉన్న రాయ్ ఏ లోటూ లేకుండా విలాసవంతమైన జీవితం గడిపారు. ప్రత్యేక వసతులు కల్పించినందుకుగాను తీహార్ జైలు అధికారులకు ఆయన చెల్లించిన మొత్తం 1.23 కోట్ల రూపాయలు. భద్రత, విద్యుత్, కాన్ఫరెన్స్ రూమ్ అద్దె, భోజనం, నీళ్లు వంటి సౌకర్యాలు కల్పించినందుకు జైలు అధికారులు ఈ మొత్తాన్ని వసూలు చేశారు. ఆయనకు వీడియో కాన్ఫరెన్స్, వైఫై, ఏసీ గదులు ఏర్పాటు చేయడంతో పాటు రెండు ల్యాప్‌టాప్‌లు, ల్యాండ్ ఫోన్లు, ఓ సెల్‌ఫోన్, సహాయ సిబ్బందిని వినియోగించుకునేందుకు అనుమతించారు. సహారా గ్రూప్ జైలు అధికారులకు ఇంకా 7.5 లక్షల రూపాయలు చెల్లించాలని అధికారులు చెప్పారు. కాగా గత నెలలో రాయ్‌ను సాధారణ సెల్‌కు మార్చారు. డిపాజిటర్లకు 20 వేల కోట్ల రూపాయలు చెల్లించడంలో విఫలమైనందుకు రాయ్‌తో పాటు సహారా గ్రూపు డైరెక్టర్లు అశోక్ రాయ్ చౌదరి, రవి శంకర్ దుబెలను కోర్టు ఆదేశాల మేరకు గతేడాది మార్చిలో తీహార్ జైలుకు తరలించారు. రాయ్‌కు బెయిల్ మంజూరు చేయడానికి 10వేల కోట్ల రూపాయలను పూచీకత్తుగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది. 5 వేల కోట్లు రూపాయల నగదు, మరో ఐదు వేల కోట్లకు చెక్ రూపంలో సమర్పించాలని సూచించింది. అయితే ఈ డబ్బు చెల్లించలేని పరిస్థితిలో ఆయన విడుదల కాలేదు. తీహార్ జైల్లో రాయ్‌కు అత్యంత భద్రత ఉండే వార్డును కేటాయించారు. బెయిల్ కోసం డబ్బులు సమకూర్చుకునేందు కోసం న్యూయార్క్, లండన్‌లో ఉన్న రాయ్ హోటళ్లను అమ్ముకునేందుకు వీలుగా సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఆయనకు కాన్ఫరెన్స్ రూమ్ ఏర్పాటు చేశారు.