గంటకు 160 కి.మీ వేగంతో రైళ్ల పరుగులు!
న్యూఢిల్లీ: ఢిల్లీ–హౌరా(1,400 కి.మీ), ఢిల్లీ–ముంబై(1,500 కి .మీ) మార్గాల్లో రైళ్లను గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిపేందుకు రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది.
ఇందుకోసం ఆ మార్గాల్లోని పట్టాలను పటిష్టం చేసి, సిగ్నలింగ్ వ్యవస్థను ఉన్నతీకరించాల్సి ఉంటుంది. రూ.10 వేల కోట్ల అంచనా వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టు పూర్తవ్వడానికి మూడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.