Spice jets
-
ఆకట్టుకున్న 'వింగ్స్ ఇండియా 2022' ఏవియేషన్ షో
-
15కేజీల బ్యాగేజీ దాటితే వాతే!
న్యూఢిల్లీ: విమాన ప్రయాణికులపై ప్రైవేటు విమాన సంస్థలు భారం మోపేందుకు సిద్ధమయ్యాయి. ఇకపై ప్రయాణికుల బ్యాగేజీ 15 కేజీలు దాటితే.. అదనపు లగేజీకి వాతలు తప్పవు. ఇండిగో, గో ఎయిర్, స్పైస్ జెట్లు ఈ 15 కేజీల నిబంధనను తీసుకొచ్చాయి. పరిమితి తర్వాత ఒక్కో కేజీకి రూ.400 రూపాయలు వసూలు చేయనున్నారు. గో ఎయిర్లో శని వారం నుంచే ఈ వడ్డింపు అమల్లోకి రాగా.. ఇండిగో, స్పైస్ జెట్లలో వచ్చే శుక్రవారం నుంచి అమల్లోకి రానుంది. ఒకవేళ ముందుగానే బుక్ చేసుకున్నట్లయితే.. 5 కేజీలకు రూ.1,900, 10 కేజీలకు రూ. 3,800లు వసూలు చేస్తామని గో ఎయిర్ ఆఫర్ ఇచ్చింది. ఇండిగో, స్పైస్జెట్లలోనూ కాస్త అటు, ఇటుగా ఇదే వడ్డింపు ఉంటుంది. గత నెల్లో, జెట్ ఎయిర్వేస్ కూడా కొత్త బ్యాగేజీ నిబంధనలను (వచ్చే నెల నుంచి అమల్లోకి) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఎయిరిండియా మాత్రమే తమ ప్రయాణికులకు 25 కేజీల వరకు బ్యాగేజీ అనుమతినిస్తోంది. -
ఎయిర్ ఇండియా చార్జీలూ పెరిగాయ్
న్యూఢిల్లీ: విమానయాన ఇంధనం ధరలు 15 శాతానికి పైగా పెరగడం, రూపాయి పతనం కారణంగా విమాన యాన సంస్థలు విమానయాన చార్జీలను పెంచుతున్నాయి. చార్జీలను పెంచుతున్నట్లు తాజాగా ఎయిర్ ఇండియా కూడా ప్రకటించింది. ఇటీవలనే జెట్ ఎయిర్వేస్, స్పైస్ జెట్లు విమాన చార్జీలను 25 నుంచి 30 శాతం వరకూ పెంచాయి. ప్రయాణికులను ఆకర్షించడానికి ఎయిర్ ఇండియా, కొన్ని విమానయాన సంస్థలు జూన్లో విమాన చార్జీలను తగ్గించాయి. సాధారణ చార్జీల కంటే ఈ చార్జీలు 10-15 శాతం తక్కువగా ఉన్నాయి. సిరియా ఆందోళనలు, రూపాయి పతనం నేపథ్యంలో ముడి చమురు ధరలు భగ్గుమంటుండటంతో ప్రభుత్వ చమురు మార్కటెంగ్ కంపెనీలు విమానయాన ఇంధనం ధరలను పెంచాయి. ఈ నేపథ్యంలో పలు విమానయాన సంస్థలు విమాన చార్జీలను పెంచుతున్నాయి.