స్పైసీ టేస్ట్స్
అచ్చమైన దక్షిణ భారత సంప్రదాయ రుచుల పండుగ
‘స్పైస్ ట్రయల్’ ఘుమఘుమలతో రారమ్మని ఆహ్వానిస్తోంది. విజయవాడ గేట్వే హోటల్ మాస్టర్ చెఫ్ బ్రహ్మాజీ వేడివేడిగా వండి వడ్డించే ఈ ఫీస్ట్ శుక్రవారం బంజారాహిల్స్ తాజ్బంజారా ‘వెస్ట్సైడ్ కేఫ్’లో ప్రారంభమైంది. అతిథులు కోరుకున్న రుచిని స్వయంగా తెలుసుకుని అందుకు తగ్గట్టుగా ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాడు బ్రహ్మాజీ. నీలగిరి కోడి రసం, మునగకాయ చారు, గోదావరి పీతల కూర, మటన్ పెప్పర్ ఫ్రై, రాగి సంకటి, కోడి పులుసు, బఠానీ కూర్మా, అవియల్, మట్టై చెట్టినాడు బిర్యానీ, మెంతు కూర పప్పు, వంకాయ-దోసకాయ ముక్కల పచ్చడి, పప్పుచారు వంటి ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ వెరైటీలెన్నో ఇక్కడ నోరూరిస్తున్నాయి. ఈ నెల 27 వరకు రాత్రి 7.30 నుంచి 11.30 వరకు ఈ ఫెస్ట్ అందుబాటులో ఉంటుంది.