spikes
-
కరాచీలో పెరిగిన యాచకుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం!
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి మరింత దారుణంగా తయారయ్యింది. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు, సంస్థల నుండి తీసుకున్న రుణాలతో పాక్ రోజులు నెట్టుకొస్తోంది. రంజాన్ మాసంలో పాకిస్తాన్‌లోని కరాచీ నగరం బిచ్చగాళ్ల రాజధానిగా మారింది. దేశంలోని నలుమూలల నుంచి నాలుగు లక్షలకు పైగా యాచకులు కరాచీ చేరుకున్నారని, దీంతో నగరంలో నేరాలు పెరిగాయనే వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రంజాన్ మాసంలో కరాచీలోని ప్రతి కూడలిలో యాచకులు దర్శనమిస్తున్నారని, దీనికితోడు నగరంలో ఇటీవలి కాలంలో నేర సంఘటనలు మరింతగా పెరిగాయని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఈ ఉదంతంపై పాక్‌కు చెందిన జియో న్యూస్ ఛానల్ ఒక నివేదికను అందజేసింది. దానిలో కరాచీ పోలీస్ ఆఫీసర్ ఇన్స్పెక్టర్ జనరల్ (ఏఐజీ) ఇమ్రాన్ యాకూబ్ మిన్హాస్ మాట్లాడుతూ, ఈద్, రంజాన్ సమయంలో పాకిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల నుంచి యాచకులు కరాచీకి వచ్చారని, వారి సంఖ్య సుమారు నాలుగు లక్షల వరకు ఉండవచ్చన్నారు. ప్రస్తుతం కరాచీలో యాచకుల సంఖ్య పెరిగిందని, అలాగే నేరాల సంఖ్య కూడా పెరిగిందని పోలీసు అధికారి ఒకరు చెప్పారు. నగర అదనపు ఐజీ మాట్లాడుతూ పాత పద్ధతుల్లో నేరస్తులను పట్టుకోవడం కష్టసాధ్యమని, అందుకే ప్రతి కూడలిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఇటీవలి కాలంలో నగరంలో చోటుచేసుకున్న పలు నేరాల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారని పలు మీడియా నివేదికలు తెలియజేస్తున్నాయి. -
పుర్రె ఎముకలు పెరుగుతున్నాయి
స్మార్ట్ఫోన్లతో ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో.. అంతేస్థాయిలో నష్టాలు ఉన్నాయని మనం తరచూ వింటుంటాం. సామాజిక సంబంధాలు తగ్గిపోతాయని.. అదేపనిగా టైప్ చేయడం వల్ల వేళ్లు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయని చెబుతుంటారు. తాజాగా స్మార్ట్‌ఫోన్ అతి వాడకం పుణ్యమా అని మన పుర్రెల్లో కొన్ని ఎముకలు అవసరానికి మించి పెరుగుతున్నాయని ఆస్ట్రేలియాలోని సన్‌షైన్ కోస్ట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఊరట కలిగించే విషయం ఏంటంటే దీంతో ఎలాంటి ఆరోగ్య సమస్యల్లేకపోవడం. ఒకప్పుడు ఇలాంటి ఎముక పెరుగుదల అరుదుగా.. లక్షల్లో కొందరికి జరుగుతాయని భావించినా.. స్మార్ట్ఫోన్ల పుణ్యమా అని ఇప్పుడు వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. పుర్రె వెనుక భాగంలో తాకితే తెలిసేంత సైజుకు ఎముకలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాము 18–30 ఏళ్ల మధ్య వయసున్న ఓ వెయ్యి మంది పుర్రెలను పరిశీలించిన తర్వాత తాము ఈ అంచనాకు వచ్చామని డాక్టర్ డేవిడ్ షహర్ అనే శాస్త్రవేత్త తెలిపారు. వైద్య వృత్తిలో 20 ఏళ్లుగా ఉన్న తాను గత పదేళ్ల నుంచి ఎముక పెరుగుదలకు సంబంధించిన కేసులను ఎక్కువగా చూస్తున్నట్లు డేవిడ్ తెలిపారు. స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లను వాడేటప్పుడు మనం మెడను వంచి కిందకు చూస్తూ ఉండటం సమస్యకు మూలకారణమని.. సాధారణ పరిస్థితుల్లో అతితక్కువగా ఉపయోగించే కండరాలను తల వంచినప్పుడు వాడుతుండటంతో ఆ అదనపు బరువును తట్టుకునేందుకు, తల నిలకడగా ఉండేందుకు ఈ ఎముకల పెరుగుదల అవసరమవుతుందని చెప్పారు. మెడను, వెన్నును కలిపే కండరాలపై ఎక్కువ ఒత్తిడి పడకుండా ఉండేందుకు శరీర వ్యవస్థ ఎముకలు పెరిగేలా చేస్తుందని అంచనా. అంగుళం మేర పెరుగుదల.. ఈ అధ్యయనంలో కొంతమంది యువకుల ఎముకలు ఒక అంగుళం మేర పెరిగినట్లు తెలిసింది. 1996 నాటితో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. గతేడాది నీల్సన్ సంస్థ జరిపిన ఒక సర్వే ప్రకారం భారత్‌లో మొబైల్‌ఫోన్ సగటు వినియోగం రోజుకు 90 నిమిషాలు. బాగా ఖరీదైన ఫోన్లు వాడే వారైతే 2 గంటల 10 నిమిషాలు వాడుతున్నారు. బ్రిటన్‌లో ఇది రెట్టింపు కంటే ఎక్కువ. కచ్చితంగా చెప్పాలంటే రోజుకు మూడున్నర గంటల పాటు యువత స్మార్ట్ఫోన్లను వాడుతోంది. -
3.19 శాతానికి టోకు ధరల సూచీ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం మార్చి మాసంలో 3.18గా నమోదైంది. ఇంధన ధరలు, ప్రామాణిక వస్తువుల ధరలు పుంజుకోవడంతో మార్చి నెలలో పెరుగుదలను నమోదు చేసింది. ఫిబ్రవరిలో ఇది 2.93గా ఉంది. మార్చి, 2018లో ఇది 2.74 శాతంగా ఉంది. మార్చినెలకు సంబంధించిన డబ్ల్యూపీఐ గణాంకాలను సోమవారం మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రామాణిక వస్తువుల ద్రవ్యోల్బణం 2. 83గా ఉంది. ఆహారేతర ఫుడ్ ఇన్ఫ్లేషన్ 3.89గా ఉంది. అలాగే కూరగాయల నెలవారీ ప్రాతిపదికన 11శాతం పెరిగింది. మార్చి నెలలో కూరగాయల ద్రవ్యోల్బణం 28.13 శాతంగా నమోదైంది. కాగా అంతకు ముందు నెలలో ఇది 6.82 శాతంగా ఉంది. -
వస్తోంది.. సూపర్‌సానిక్ జెట్ ఫ్లయిట్
వేగానికి కొత్త అర్థం చెప్పేలా మొదటితతరం సూపర్‌సానిక్ జెట్ విమానాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సన్ ఆఫ్ కాంకర్డ్గా పిలిచే కొత్తతరం సూపర్ సానిక్ జెట్ విమానాన్ని శనివారం ఇంగ్లండ్‌లో టెస్ట్ ఫ్లయింగ్ నిర్వహించారు. ఇంతవరకూ ఈ విమానానికి పేరు పెట్టకపోయినా.. ప్రొటోటైప్ ఎస్-512 క్విట్ సూపర్‌సానిక్ విమానంగా సైంటిస్టులు పిలుస్తున్నారు. శనివారం టెస్ట్ ఫ్లై పూర్తి చేసుకున్న ఈ విమానం.. వేగానికి మారుపేరుగా చెప్పుకోవచ్చు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని అవలీలగా మూడుగంటల్లా దాటేస్తుంది. ఇది ధ్వని వేగం కన్నా.. 1.6 రెట్లు అధికంగా ప్రయాణిస్తుంది. దీనిని అమెరికా విమానయాన సంస్థ అయిన స్పైక్ ఏరోస్పేస్ రూపొందించింది. సన్ ఆఫ్ కాంకర్డ్గా పిలుచుకునే ఈ విమానాన్ని 2021 నాటికి వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని స్పైక్ ఏరోస్పేస్ చెబుతోంది. 22 మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే ఈ విమానంలో అత్యంత లగ్జరీగా ఉంటుంది. -
‘రియల్’ బిల్లుకు చిక్కులు
నేడు రాజ్యసభ ముందుకు బిల్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ న్యూఢిల్లీ: స్థిరాస్తి వ్యాపారాన్ని నియంత్రించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుకు రాజ్యసభలో చిక్కులు ఎదురుకానున్నాయి. మంగళవారం పెద్దల సభలో చర్చకు రానున్న ఈ బిల్లుపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తన వ్యతిరేకతను ఉధృతం చేసింది. వాస్తవానికి గత బుధవారమే ఈ బిల్లును రాజ్యసభలో ఆమోదం కోసం ప్రవేశపెట్టాలని మోదీ సర్కారు తలచినప్పటికీ.. బిల్లును పార్లమెంటు ఎంపిక కమిటీకి నివేదించాలని కాంగ్రెస్ పట్టుపట్టడంతో.. ఎగువ సభలో సంఖ్యా బలం తక్కువగా ఉన్న సర్కారు బిల్లును వాయిదా వేసుకుంది. ప్రతిపక్షం ఎదురుదాడి చేయటంతో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు.. పార్టీలతో మరిన్ని సంప్రదింపులు జరపటానికి బిల్లును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచీ బిల్లుపై కాంగ్రెస్ వైఖరి మరింత కఠినంగా మారింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ గత శనివారం నాడు జాతీయ రాజధాని ప్రాంతానికి (ఎన్సీఆర్) చెందిన ఇళ్ల కొనుగోలుదారులను కలిసిన తర్వాత.. ప్రభుత్వం మధ్యతరగతి ఇళ్ల కొనుగోలుదారులకు వ్యతిరేకంగా పనిచేస్తోందని, బిల్లును బిల్డర్లకు అనుకూలంగా మార్చి తెస్తోందని ధ్వజమెత్తారు. ఫ్లాట్ యజమానుల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని వారి ప్రతినిధులకు రాహుల్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో యూపీఏ హయాంలో తెచ్చిన రియల్ ఎస్టేట్ బిల్లుకు, ఎన్డీఏ తెచ్చిన ప్రస్తుత బిల్లుకు తేడాలను విడమరచి చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇక ప్రభుత్వం బిల్లును ఆమోదింపచేసుకునేందుకు పలు ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. స్థిరాస్తి రంగాన్ని నియంత్రించేందుకు, ప్రోత్సహించేందుకు, వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ఈ బిల్లును తెస్తున్నట్లు ప్రభుత్వం చెప్తోంది. జీఎస్టీ బిల్లుకు తృణమూల్ మద్దతు వస్తువులు, సేవల పన్నుల (జీఎస్టీ) బిల్లుకు తృణమూల్ కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. కీలక ఆర్థిక సంస్కరణ లక్ష్యంగా తెస్తున్న ఈ బిల్లు మంగళవారం లోక్‌సభ ముందుకు రానుంది. గత నెల 26న బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా.. దానిని పార్లమెంటు స్థాయీ సంఘానికి నివేదించాలని కాంగ్రెస్, బీజేడీ, వామపక్షాలు సహా పలు ప్రతిపక్ష పార్టీలు గట్టిగా పట్టుపట్టాయి. ఈ పరిస్థితుల్లో.. తృణమూల్ కాంగ్రెస్ బిల్లుకు మద్దతు తెలపటం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ఊరటనిచ్చినట్లయింది. ‘‘స్థాయీ సంఘం, ఎంపిక కమిటీలు ఈ బిల్లుపై ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చాయి. కాబట్టి, దీనిని మళ్లీ స్థాయీ సంఘానికి తిప్పిపంపటంలో అర్థం లేదు’’ అని తృణమూల్ నేత డెరెక్ ఒ-బ్రీన్ సోమవారం పీటీఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించారు. జీఎస్టీ అమలు వల్ల రాష్ట్రాలు నష్టపోయే మొత్తాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చిందన్నారు.