వస్తోంది.. సూపర్‌సానిక్‌ జెట్‌ ఫ్లయిట్‌ | SON OF CONCORDE is coming | Sakshi
Sakshi News home page

వస్తోంది.. సూపర్‌సానిక్‌ జెట్‌ ఫ్లయిట్‌

Published Sun, Oct 15 2017 5:32 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

SON OF CONCORDE is coming - Sakshi

వేగానికి కొత్త అర్థం చెప్పేలా మొదటితతరం సూపర్‌సానిక్‌ జెట్‌ విమానాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సన్‌ ఆఫ్‌ కాంకర్డ్‌గా పిలిచే కొత్తతరం సూపర్‌ సానిక్‌ జెట్‌ విమానాన్ని శనివారం ఇంగ్లండ్‌లో టెస్ట్‌ ఫ్లయింగ్‌ నిర్వహించారు. ఇంతవరకూ ఈ విమానానికి పేరు పెట్టకపోయినా.. ప్రొటోటైప్‌ ఎస్‌-512 క్విట్‌ సూపర్‌సానిక్‌ విమానంగా సైంటిస్టులు పిలుస్తున్నారు.

శనివారం టెస్ట్‌ ఫ్లై పూర్తి చేసుకున్న ఈ విమానం.. వేగానికి మారుపేరుగా చెప్పుకోవచ్చు. అట్లాంటిక్‌ మహాసముద్రాన్ని అవలీలగా మూడుగంటల్లా దాటేస్తుంది. ఇది ధ్వని వేగం కన్నా.. 1.6 రెట్లు అధికంగా ప్రయాణిస్తుంది. దీనిని అమెరికా విమానయాన సంస్థ అయిన స్పైక్‌ ఏరోస్పేస్‌ రూపొందించింది.

సన్‌ ఆఫ్‌ కాంకర్డ్‌గా పిలుచుకునే ఈ విమానాన్ని 2021 నాటికి వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని స్పైక్‌ ఏరోస్పేస్‌ చెబుతోంది. 22 మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే ఈ విమానంలో అత్యంత లగ్జరీగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement