ఐసీసీ టీ20 ప్రపంచకప్-2024 వేదిక మారే సూచనలు కన్పిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది జూన్‌లో వెస్టిండీస్, అమెరికా వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగాల్సి ఉంది. అయితే ఇంతకుముందు వెస్టిండీస్ ఐసీసీ ఈవెంట్‌లను నిర్వహించినప్పటకీ.. అమెరికాకు మాత్రం ఒక ప్రధాన క్రికెట్ టోర్నమెంట్‌కు ఆతిధ్యం ఇవ్వనుండడం ఇదే తొలిసారి.
ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నీని నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలను అమెరికా ఇంకా సిద్దంచేయనట్లు తెలుస్తోంది. ఈ టోర్నీ ఆరంభానికి ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉన్నందన ఐసీసీ నిర్దేశించిన మౌలిక సదుపాయాలను అమెరికా ఏర్పాటు చేయడం కష్టమే అని చెప్పుకోవాలి. దీంతో టోర్నీ వేదికను మార్చాలనే ఆలోచనలో ఐసీసీ ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ మెగా ఈవెంట్‌ను ఇంగ్లండ్‌లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుతో ఐసీసీ సంప్రదింపులు జరిపినట్లు క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. కాగా టీ20 ప్రపంచకప్-2030 ఆతిధ్య హక్కలను ఇంగ్లండ్, ఐర్లాండ్, స్కాట్‌లాండ్ సంయుక్తంగా దక్కించుకున్నాయి. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్-2024ను ఇంగ్లండ్ నిర్వహిస్తే.. టీ20 ప్రపంచకప్-2030ను వెస్టిండీస్, అమెరికా నిర్వహించే ఛాన్స్ ఉంది.
చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆ జట్టే టైటిల్ ఫేవరేట్: పాకిస్తాన్ లెజెండ్
Comments
Please login to add a commentAdd a comment