supersonic aircraft carrier
-
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానం.. కేవలం గంటలో!
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన విమానాన్ని వినియోగంలోకి తీసుకొచ్చేందుకు అనేక దేశాలు చాలా రోజుల నుంచి పోటీ పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఈ జాబితాలో ముందు వరుసలో చైనా, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ దేశాలు ఉన్నాయి. అయితే, ఈ దేశాల కంటే ముందే చైనాకు చెందిన ఏరోస్పేస్ సంస్థ స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్.. బిజినెస్ కోసం ఒక సూపర్ సోనిక్ జెట్ విమానాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపింది. చైనా ఏరోస్పేస్ సంస్థ అభివృద్ది చేస్తున్న సూపర్ సోనిక్ జెట్ విమానం గంటలో చైనా రాజధాని బీజింగ్ నుంచి న్యూయార్క్ నగరాన్ని చేరుకొనున్నట్లు తెలిపింది. ఇది గంటకు 2,600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని పేర్కొంది. ఈ జెట్ వాణిజ్య విమానాల కంటే ఆరు రెట్లు వేగం వెళ్లనున్నట్లు వివరించింది. స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ గత ఏడాది తన సూపర్ సోనిక్ జెట్ విమానం కోసం 46.3 మిలియన్ డాలర్లను ఫండ్ కూడా సేకరించినట్లు తెలిపింది. టియాన్క్సింగ్ 1, టియాన్క్సింగ్ 2 అని పిలిచే ఈ విమానాలను విజయవంతంగా పరీక్షించినట్లు కంపెనీ పేర్కొంది. అయితే, ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని వెల్లడించలేదు. స్పేస్ ట్రాన్స్ పోర్టేషన్ 2024లో తన మొదటి ఫ్లైట్ టెస్ట్ నిర్వహించడానికి ముందు 2023 చివరి నాటికి గ్రౌండ్ పరీక్షలు నిర్వహించాలని యోచిస్తోంది. ఇదే మొదటి కాదు ఇదే మొదటి సూపర్ సోనిక్ విమానం మాత్రం కాదు. గ్రేట్ బ్రిటన్, ఫ్రాన్స్ దేశానికి చెందిన విమాన తయారీ సంస్థలు సంయుక్తంగా కలిసి నిర్మించిన మొదటి కాంకార్డ్ సూపర్ సోనిక్ వాణిజ్య విమానాన్ని 1973 సెప్టెంబరు 26న అందుబాటులోకి తీసుకొని వచ్చాయి. 1976 జనవరి 21న ప్రపంచంలోని మొట్టమొదటి షెడ్యూల్డ్ సూపర్ సోనిక్ విమానం ప్యాసింజర్ సేవలను కూడా ప్రారంభించింది. ఈ జెట్లను బ్రిటిష్ ఎయిర్ వేస్, ఎయిర్ ఫ్రాన్స్ విస్తృతంగా ఉపయోగించాయి. అయితే, విమానం శబ్దం ఎక్కువగా రావడం, నిర్వహణ వ్యయం కూడా ఎక్కువ కావడంతో వాటి సేవలను నిలిపి వేయాల్సి వచ్చింది. చివరకు మే 2003లో ఎయిర్ ఫ్రాన్స్, అక్టోబర్ 2003లో బ్రిటిష్ ఎయిర్ వేస్ కాంకార్డ్ సేవలను నిలిపి వేశాయి. (చదవండి: లాంఛ్‌కు ముందే బుకింగ్‌కు టయోటా బ్రేకులు!) -
దేశ రక్షణలోకి 'స్మార్ట్'గా...
ఒడిశా: భారత్ సైనికుల చేతిలోకి మరో ఆయుధం చేరింది. 'సూపర్సోనిక్ మిస్సైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టోర్పెడో '(స్మార్ట్)ను ఒడిశాలోని వీలర్ ఐలాండ్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణికి సంబంధించిన అన్ని లక్ష్యాలు అనుకున్న స్థాయిలో ఉన్నాయని డీఆర్డీవో అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ డీఆర్డీవోకు అభినందనలు తెలిపారు. సాంకేతిక పరంగా ఇది గొప్ప విజయమని...యుద్ధ సమయంలో ఇది ఎంతో ఉపయోగపడుతుందని ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. 'యాంటీ సబ్ మెరైన్ వార్ఫేర్ ఆపరేషన్స్'లో స్మార్ట్ క్షిపణి కీలకంగా వ్యవహరిస్తుంని డీఆర్డీవో ఛైర్మన్ డి. సతీశ్ రెడ్డి అన్నారు. ఈ నెల ఆరంభంలో 'లేజర్ గైడెడ్ యాంటీ ట్యాంక్' క్షిపణిని డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది. -
బ్రహ్మోస్ క్షిపణి పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్ ఏరియల్ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్) బుధవారం వెల్లడించింది. సుఖోయ్ యుద్ధ విమానం ఎస్యు–30 ఎంకేఐ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. 2.5 టన్నుల బరువుండి, ఆకాశం నుంచి భూ ఉపరితలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. తద్వారా ఐఏఎఫ్ యుద్ధ సామర్థ్యాలను కూడా ఇది పెంచుతుందని మిలిటరీ అధికారులు చెప్పారు. బ్రహ్మోస్ క్షిపణి 2.8 మ్యాక్ వేగంతో ప్రయాణిస్తుంది. ‘విమానం నుంచి ఈ క్షిపణిని ఏ సమస్యలూ లేకుండా ప్రయోగించగలిగాం. నిర్దేశించిన మార్గంలో అది ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించింది’ అని ఐఏఎఫ్ అధికార ప్రతినిధి గ్రూప్ కెప్టెన్ అనుపమ్ బెనర్జీ చెప్పారు. -
వస్తోంది.. సూపర్‌సానిక్ జెట్ ఫ్లయిట్
వేగానికి కొత్త అర్థం చెప్పేలా మొదటితతరం సూపర్‌సానిక్ జెట్ విమానాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సన్ ఆఫ్ కాంకర్డ్గా పిలిచే కొత్తతరం సూపర్ సానిక్ జెట్ విమానాన్ని శనివారం ఇంగ్లండ్‌లో టెస్ట్ ఫ్లయింగ్ నిర్వహించారు. ఇంతవరకూ ఈ విమానానికి పేరు పెట్టకపోయినా.. ప్రొటోటైప్ ఎస్-512 క్విట్ సూపర్‌సానిక్ విమానంగా సైంటిస్టులు పిలుస్తున్నారు. శనివారం టెస్ట్ ఫ్లై పూర్తి చేసుకున్న ఈ విమానం.. వేగానికి మారుపేరుగా చెప్పుకోవచ్చు. అట్లాంటిక్ మహాసముద్రాన్ని అవలీలగా మూడుగంటల్లా దాటేస్తుంది. ఇది ధ్వని వేగం కన్నా.. 1.6 రెట్లు అధికంగా ప్రయాణిస్తుంది. దీనిని అమెరికా విమానయాన సంస్థ అయిన స్పైక్ ఏరోస్పేస్ రూపొందించింది. సన్ ఆఫ్ కాంకర్డ్గా పిలుచుకునే ఈ విమానాన్ని 2021 నాటికి వినియోగదారులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని స్పైక్ ఏరోస్పేస్ చెబుతోంది. 22 మంది ప్రయాణికులు ప్రయాణించగలిగే ఈ విమానంలో అత్యంత లగ్జరీగా ఉంటుంది. -
చైనా మీదికి క్షిపణి పేల్చిన తైవాన్
తైవాన్: తైవాన్ దేశ వైమానిక దళం పెద్ద తప్పిదం చేసింది. పొరపాటున ఓ క్షిపణి విధ్వంసక అణుక్షిపణిని పొరపాటున చైనా మీదుగా పరీక్షించింది. అయితే, ఈ సమాచారం ఇంకా బీజింగ్‌కు చెరలేదంట. ఇప్పటికే చైనా తైవాన్ మధ్య అడపాదడపా ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో తాజా విషయం దానికి మరింత ఊపిరిపోసేలా ఉంది. శుక్రవారం ఉదయం 8గంటల ప్రాంతంలో 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని తుత్తునియలు చేయగల స్వదేశీ సియుంగ్-ఫెండ్ 3(బ్రేవ్ విండ్) అనే విధ్వంసకర అణుక్షిపణిని తైవాన్ ఐలాండ్ గ్రూప్ పరీక్షించింది. ఇది కాస్త చైనాలో భాగమైన పెంగూకు 75 కిలో మీటర్ల దూరంలోనే సముద్రంలో పడిపోయిందట. ఈ విషయం స్వయంగా తైవాన్ చెప్పింది. అసలు ఈ తప్పిదం ఎలా జరిగిందనే విషయంపై దర్యాప్తు ప్రారంభించామని అధికారులు చెప్తున్నారు. సోయింగ్ నగర పరిధిలోని సముద్ర జలాల్లో ఉన్న నౌక ద్వారా పరీక్షించగా అది చైనా వైపు దూసుకెళ్లిందని అన్నారు. తామే స్వయంగా ఈ విషయాన్ని చైనాకు చెప్పుకొని వివరణ ఇచ్చుకుంటామని పరోక్షంగా చెప్పారు. 1949లోనే చైనా నుంచి తైవాన్ విడిపోయినప్పటికీ తైవాన్ తమ పరిధిలోని ప్రాంతమే అన్నట్లుగా అజమాయిషీ చెలాయిస్తుంటుంది. గత జనవరి నుంచి ఈ రెండు దేశాలకు అస్సలు పొగడం లేదు.