Spinal cart
-
ఆ యువకుడి వైద్యానికి ఏటా రూ.1.80 కోట్ల ఖర్చు
కర్నూలు (హాస్పిటల్): ఆ యువకుడి వయసు 18 ఏళ్లు. ఇప్పటికీ సరిగ్గా నడవలేడు. స్వతహాగా కూర్చోలేడు. ప్రతి పనికీ ఇంకొకరి సహాయం కావాల్సిందే. అరుదైన ఈ ఆరోగ్య సమస్యను స్పైనల్ మస్కులర్ అట్రోఫి (వెన్నెముక కండరాల క్షీణత)గా వైద్యులు గుర్తించారు. అత్యంత అరుదైన ఈ వ్యాధి కర్నూలు జిల్లాలోని ఆలూరు మండలం మనేకుర్తి గ్రామానికి చెందిన పేదరైతు వి.లక్ష్మీకాంత్ కుమారుడు వి.విజయ్‌కుమార్(18)కి సోకింది. నడక మొదలైనప్పటి నుంచి సరిగ్గా నడిచేవాడు కాదు. నడుస్తూ నడుస్తూ కిందపడిపోయేవాడు. తల్లిదండ్రులు అతడిని కర్నూలు, హైదరాబాద్‌లోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఎన్ని మందులు వాడినా ఫలితం లేకపోయింది. ఇటీవల ఆదోనికి వెళ్లిన కర్నూలు న్యూరోఫిజీయన్ డాక్టర్ హేమంత్‌కుమార్‌కు ఆ యువకుడిని చూపించారు. అతనికి ఉన్న వ్యాధి లక్షణాలను గమనించి జెనెటిక్ టెస్ట్ చేయించారు. అందులో అతనికి అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫి సోకినట్టు నిర్ధారించారు. సాధారణంగా ఈ వ్యాధిని శిశువు గర్భంలో ఉన్నప్పుడు ఆరు నెలల్లోగా, జన్మించాక ఏడాదిలోపు, ఆ తర్వాత 18 నెలలలోపు, 30 ఏళ్లలోపు, 30 ఏళ్ల తర్వాత అనే రకాలుగా విభజిస్తారు. 2 ఏళ్లలోపు గుర్తిస్తే జొల్గొన్‌స్మా అనే ఇంజెక్షన్ (రూ.16 కోట్ల విలువ) వేస్తే సరిపోతుంది. కానీ ఆలూరుకు చెందిన ఈ యువకునికి ప్రస్తుతం 18 ఏళ్లు. ఇలాంటి వారికి ఆ ఇంజెక్షన్ పనిచేయదని డాక్టర్ హేమంత్‌కుమార్ తెలిపారు. ఈ వయసు వారికి వచ్చే ఈ వ్యాధికి స్విట్జర్లాండ్‌కు చెందిన రోష్ ఫార్మా కంపెనీ రిస్డిపాల్మ్ అనే పౌడర్‌ను 2020 ఆగస్టులో కనుగొందని చెప్పారు. 60 మిల్లీ గ్రాముల ప్యాకెట్ ఖరీదు రూ.6 లక్షల వరకు ఉంటుందని, దానిని రోజూ 5ఎంజీ ఇవ్వాల్సి ఉంటుందని, ఈ లెక్కన నెలకు రూ.15 లక్షలు, ఏడాదికి రూ.1.80 కోట్లు ఖర్చు అవుతుందన్నారు. ఈ మందును రోగి దీర్ఘకాలం వాడాల్సి ఉంటుందన్నారు. ఈ మందుకు శరీరం స్పందించే తీరును బట్టి చికిత్సను కొనసాగించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది చాలా అరుదైన వ్యాధి అని, ఇప్పటివరకు దేశంలో కేవలం 800 మంది మాత్రమే ఈ వ్యాధితో బాధపడుతున్నారని చెప్పారు. మేనరిక వివాహాలు, రక్త సంబం«దీకుల్లో వివాహం చేసుకోవడం కారణంగా ఇలాంటి వ్యాధులు వస్తాయని పేర్కొన్నారు. -
వెన్నుముక మార్పిడి... వైద్య శాస్త్రంలో సరికొత్త అధ్యయనం!..
Paralysed Man Walks Again: ఇంతవరకు పంది గుండె, కిడ్ని వంటివి మానవుడికి అమర్చడం వంటి సరికొత్త వైద్యా విధానాలను గురించి తెలుసుకున్నాం. పైగా అవయవాల కొరతను నివారించే ప్రక్రియలో భాగంగా జరిగిన సరికొత్త వైద్యా విధానాలుగా పేర్కొనవచ్చు. అయితే ఇంతవరకు మనం వెన్నముక ఇంప్లాంటేషన్(మార్పిడి) గురించి వినలేదు. వెన్నముకకి గాయాలై శరీరం చచ్చుబడి పోయి మంచానికి పరిమితమైన వారికి ఈ ఇంప్లాంటేషన్ వరం. అసలు విషయంలోకెళ్తే...వెన్నముకకు గాయాలవ్వడంతో మంచానికి పరిమితమైన వాళ్లు మళ్లీ తాము జీవితంలో లేచి నిలబడలేమని నిరాశ నిస్ప్రహలకి లోనవ్వాల్సిన అవసరంలేదంటున్నారు వైద్యులు. ఎందుకంటే ఎలక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నముక సాయంతో రోగులు నిలబడటమే కాక వ్యాయమాలు కూడా చేయగలరని అంటున్నారు. వెన్నుమక గాయం కారణంగా కాళ్లు చేతులు పక్షవాతానికి గురైన వాళ్లు సైతం లేచి నిలబడగలరిని ధీమాగా చెబుతున్నారు వైద్యులు. 2017లో మిచెల్ రోకాటి మోటర్‌బైక్ ప్రమాదంలో వెన్నముకకు అయిన గాయం కారణంగా దిగువ శరీర భాగం చచ్చుబడిపోయింది. అయితే రోకాటి ఎలక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నుముక ఇంప్లాంటేషన్‌తో అడుగులు వేయగలిగారని నేచర్ మెడిసిన్ జర్నల్ పేర్కొంది. అంతేకాదు ఇలాంటి సమస్యతో బాధపడుతున్న ముగ్గరు రోగులు ఈ ఎక్ట్రికల్ పల్స్‌తో కూడిన వెన్నముక ఇంప్లాంటేషన్ సాయంతో తమ శరీరాన్ని కదిలించగలిగారని తెలిపారు. ఆరు సెంటీమీటర్ల ఇంప్లాంట్‌ను చొప్పించి, పల్స్‌ను చక్కగా ట్యూన్ చేసిన కొద్దిసేపటికే ముగ్గురులో కదిలికలను గుర్తించాం అని అన్నారు. ఈ ఎలక్ట్రోడ్లు ఇంతకుముందు అమర్చిన వాటి కంటే పొడవుగా, పెద్దవిగా ఉంటాయని తెలిపారు. ఇవి కండరాలను యాక్సెస్ చేయగలవని జపాన్ లాసాన్ యూనివర్శిటీ హాస్పిటల్‌లోని న్యూరో సర్జన్ జోసెలిన్ బ్లాచ్ చెప్పారు. అంతేకాదు ప్రారంభ దశలో కదిలించటానికి తమ ముందు శరీర భాగాంలో కొంత బలం ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత రోగి ప్రాక్టీస్ చేయడం ద్వారా నిలబడటం, నడవటం వంటివి చేయగలుగుతారన్నారు. అంతేకాదు దాదాపు కిలోమీటర్ దూరం వరకు నడవగలుగుతారని చెప్పారు. పక్షవాతాన్ని పరిష్కరించడానికి ఎలక్ట్రికల్ పల్స్‌లను ఉపయోగించాలనే ఆలోచన నొప్పిని నియంత్రించడానికి ఉపయోగించే సాంకేతికత నుండి ఉద్భవించిందని తెలిపారు. ఈ ఎలక్ట్రిక్ పల్స్ కంప్యూటర్ ద్వారా యాక్టివేట్ అవుతుంటాయి. వీటిని రోజు రోగి యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. కొంతమంది ఈ ఎలక్ట్రిక్ పోల్స్‌ని యాక్టివేట్ చేయకుండా కూడా అవయవాలను కదిలించగలిగారని కానీ పూర్తిగా మాత్రం సాధ్యం కాదని న్యూరో సర్జన్లు చెబుతున్నారు. ఈ ఏడాది యునైటెడ్ స్టేట్స్ యూరప్‌లో సుమారు 50 నుంచి100 మంది రోగులపై ట్రయల్స్ నిర్వహించనున్నట్లు వైద్యులు పేర్కొన్నారు. -
ఆ డాక్టర్ వల్లే నాకు లోపం.. కోర్టు సంచలన తీర్పు
Spina bifida won the landmark legal case over her wrongful conception: ప్రెగ్నెన్సీ నిర్ధారణ అయిత తర్వాత మహిళలు వైద్యం, నెలవారీ చెకప్‌లకు కోసం డాక్టర్లను సంప్రదించి.. సూచనలు, జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే తాజాగా ఓ యువతి తన తల్లి గర్భంతో ఉన్న సమయంలో సరైన సలహాలు ఇవ్వలేదని డాక్టర్‌ను కోర్టుకు లాగింది. 20 ఏళ్ల యువతి ఈవీ టూంబ్స్.. తన తల్లికి తాను లోపంతో జన్మించడానికి డాక్టర్ కారణమైందని, సరైన సలహా ఇచ్చిఉంటే తాను జన్మించిన ఉండేదాన్ని కాదని పేర్కొంది. అయితే ఈవీ టూంబ్స్.. స్పైనా బిఫిడా అనే లోపంతో పుట్టారు. వెన్నెముక సరిగా ఏర్పకుండా లోపంతో పుట్టడం. దీంతో ఆమె రోజు మెడికల్ ట్యూబ్‌లను అమర్చుకొని వేదన అనుభవిస్తూ ఉన్నారు. ఆమె తన తల్లి ప్రెగ్నెన్సీ సమయంలో సరైన సూచనలు ఇవ్వలేదని డాక్టర్ ఫిలిప్ మిచెల్ ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా తనకు నష్టం పరిహారం చెల్లించాలని కోర్టులో దావా వేసింది. తాను పోషక ఆహారం తీసుకుంటే.. ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్ సలహా ఇచ్చినట్లు ఈవీ తల్లి పేర్కొంది. లండన్ హైకోర్టు న్యాయమూర్తి రోసలిండ్ కో క్యూసి ఈవీ టూంబ్స్ కేసును సమర్థించారు. ఆమె తల్లికి ముందుగానే సరైన సలహా ఇచ్చి ఉంటే ఈవీ టూంబ్స్ .. స్పైనా బిఫిడా వెన్నుముక లోపంతో జన్మించి ఉండేది కాదని తీర్పు నిచ్చారు. టూంబ్స్ కోరిన విధంగా తగిన నష్ట పరిహారం చెల్లించాలని డాక్టర్‌ను కోర్టు ఆదేశించింది.ఇక ఈవీ టూంబ్స్ దివ్యాంగ ‘షో జంపర్’గా పలు పోటీల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. -
వైద్య వ్యయాల తగ్గింపుపై కేంద్రం దృష్టి!
న్యూఢిల్లీ: రోగులకు వైద్య వ్యయాల తగ్గింపు లక్ష్యంగా రానున్న వార్షిక బడ్జెట్‌పై కసరత్తు జరుగుతోందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కొన్ని వైద్య పరికరాలపై దిగుమతి సుంకాల తగ్గింపును కేంద్రం పరిశీలిస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ముక్కుకు సంబంధించి ఆపరేషన్‌లో వినియోగించే పీడీఎస్ ప్లేట్స్‌పై కస్టమ్స్ సుంకాన్ని ప్రస్తుత 10 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని ఇండస్ట్రీ చాంబర్ సీఐఐ తన బడ్జెట్ ముందస్తు మెమోరాండంలో ప్రభుత్వాన్ని కోరింది. వెన్నుముక పరికరాలు, జాయింట్ రిప్లేస్మెంట్ పరికరాలపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించాలని కూడా సీఐఐ కేంద్రాన్ని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇది ఓట్–ఆన్–అకౌంట్ బడ్జెట్‌గా ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది. ఇప్పటికే పలు చర్యలు.. దేశంలో వైద్య పరికరాల తయారీకి ఊపునివ్వడం, ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణ, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో ఎగుమతులకు ప్రోత్సాహం వంటి లక్ష్యాల సాధనకు కేంద్రం ఇటీవల నేషనల్ మెడికల్ డివైజెస్ ప్రమోషన్ కౌన్సిల్ (ఎన్ఎండీపీసీ)ను నెలకొల్పింది. ఫార్మా రంగం విషయంలో భారత్ ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే వైద్య పరికరాల పరిశ్రమ విషయంలో మాత్రం అంత పురోగతి సాధించలేదు. ఈ అంశంపైనా దృష్టి పెట్టిన కేంద్రం, ఈ విభాగంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులూ లేకుండా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది. -
వెన్నెముకకు పక్షవాతం వచ్చినా నడవొచ్చు!
బోస్టన్: వెన్నెముకకు గాయమై పక్షవాతం బారిన పడి నడక సామర్థ్యాన్ని కోల్పోయిన వారిని తిరిగి నడవగలిగేలా చేసే చికిత్సను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ నూతన చికిత్సను ఎలుకలపై ప్రయోగించినప్పుడు 100 శాతం ఫలితాలతో నడక సామర్థ్యం కలిగినట్లు తెలిపారు. భవిష్యత్తులో ఈ చికిత్సను మానవులపై ప్రయోగించి సత్ఫలితాలను పొందవచ్చని వారు భావిస్తున్నారు. వెన్నెముకకు గాయమైన ప్రదేశం కింది భాగం పక్షవాతం బారిన పడి అత్యధికులు నడక సామర్థ్యాన్ని కోల్పోతున్నారని వివరించారు. గాయం కాని వెన్నుముక భాగాలు ఎందుకు పనిచేయకుండా పోతున్నాయో తెలుసుకునేందుకు గాను అమెరికాలోని బోస్టన్ చిల్డ్రన్స్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా సీఎల్పీ 290 అనే మిశ్రమాన్ని ఒక క్రమ పద్ధతిలో ఇంట్రాపెరిటోనియల్ ఇంజెక్షన్ ద్వారా ఎలుకలకు ఎక్కించారు. అనంతరం నాలుగైదు వారాల్లో ఎలుకల్లో నడక సామర్థ్యం కలిగినట్లు తెలిపారు. ఈ మిశ్రమం కారణంగా కాలి వెనుక భాగాల్లో కదలికలు ఏర్పడినట్లు ఎలక్ట్రోమయోగ్రఫీ రికార్డులో స్పష్టమైనట్లు వివరించారు. -
జీవశ్చవంలా..!
► బీటెక్ విద్యార్థి ఆశలపై నీళ్లు ►కుటుంబాన్ని వెక్కిరించిన ప్రమాదం ► దాతలు స్పందించాలనివేడుకోలు ఒక్కగానొక్క కుమారుడిని బాగా చదివిస్తే ప్రయోజకుడై కుటుంబానికి ఆసరాగా ఉంటారని తల్లిదండ్రులు కలగన్నారు. వారొకటి తలిస్తే.. విధి మరొకటి తలచింది. మరో ఏడాది ఉంటే చదువు పూర్తయి ఉద్యోగం వస్తుందని అందరూ అనుకుంటున్న తరుణంలో రోడ్డు ప్రమాదంలో ఆ కుటుంబం ఆశలపై నీళ్లు చల్లింది. ఉద్యోగం ద్వారా ఇంట్లో అందరికీ చేదోడు, వాదోడుగా నిలవాల్సిన కుమారుడికి తల్లిదండ్రులు, చెల్లెళ్లు సేవలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవనకొండ మండలం కరివేముల గ్రామానికి చెందిన బి. వెంకటేశ్వర్లు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు. ఒక్కగానొక్క కుమారుడు బి. వన్నూరప్ప చాలా తెలివైన కుర్రాడు. ఎంసెట్‌లో 6,023 ర్యాంకు రావడంతో అతనికి హైదరాబాద్‌లోని టి.రామిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజిలో ఈసీఈ బ్రాంచ్‌లో ఉచితంగా సీటు వచ్చింది. మరో ఏడాది ఉండగా చదువు పూర్తయి ఆ కుటుంబానికి ఆసరగా నిలుస్తాడని కుటుంబీకులు ఆశిస్తున్న తరుణంలో విధి వారిని వెక్కిరించింది. గత సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చిన వన్నూరప్ప ఆటో ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించగా వైద్యులు పిడుగులాంటి చేదునిజాన్ని చెప్పారు. ప్రమాదంలో అతని స్పైనల్కార్ట్ దెబ్బతినిందని, దీంతో కాళ్లు, చేతులు స్పర్శకోల్పోయాయని వివరించారు. అంతే ఆ వార్త విన్న కుటుంబం సైతం కుప్పకూలిపోయింది. కుటుంబంలో పెద్దవాడైన ఆ విద్యార్థి జీవితం అర్ధంతరంగా మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. మంచాన పడి ఉన్న అతనికి తల్లిదండ్రులు, చెల్లెళ్లు ఆసరాగా నిలుస్తున్నారు. ఐదు నెలల పాటు మంచంలోనే ఉండటంతో వీపుపై బొబ్బలు ఏర్పడ్డాయి. అతను మారుమూల గ్రామంలో ఉండటంతో ప్రతిరోజూ ఫిజియోథెరపి, పారామెడికల్ కేర్ చేయడానికి కుదరడం లేదు. ఫిజియోథెరపి వల్ల కనీసం చేతులైనా వస్తాయని చెప్పడంతో ఆ దిశగా కుటుంబసభ్యులు కష్టపడుతున్నారు. మంచానికే పరిమితమైన కుమారునికి అవసరమైన చికిత్సకు ఇప్పటికే రూ.3లక్షలకు పైగా ఖర్చు చేశారు. దాతలు స్పందించి తనకు అవసరమైన చికిత్స చేయిస్తే కాస్తయినా కోలుకుని కుటుంబానికి ఆసరాగా నిలుస్తానని వన్నూరప్ప కోరుతున్నారు. దాతలు చేయాల్సిన ఫోన్ నెంబర్ 96038 64433. బ్యాంకు అకౌంట్ వివరాలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ నెంబర్: 32684410386 ఐఎఫ్ఎస్సీ కోడ్ : ఆఐూ0011992 బ్రాంచ్ కోడ్ ఃn 992