విహారి, రోహిత్, అన్షుల్ సెంచరీలు
సాక్షి, హైదరాబాద్: ఎ–1 డివిజన్ మూడు రోజుల క్రికెట్ లీగ్ టోర్నమెంట్లో స్పోర్టింగ్ ఎలెవన్, ఆర్. దయానంద్ జట్ల మధ్య జరి గిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలిరోజు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ రెండు రోజులు మాత్రమే జరిగింది. ఓవర్‌నైట్ స్కోరు 247/1తో శుక్రవారం మూడో రోజుతొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన ఆర్. దయానంద్ జట్టు ఆటముగిసే సమయానికి 142.1 ఓవర్లలో 6 వికెట్లకు 630 పరుగుల భారీ స్కోరు చేసింది.
దయానంద్ జట్టుకు ప్రాతిని ధ్యం వహిస్తున్న ఆంధ్ర రంజీ క్రికెటర్ హనుమ విహారి (96 బంతుల్లో 136; 10 ఫోర్లు, 12 సిక్సర్లు), పి. రోహిత్ రెడ్డి (92 బంతుల్లో 108; 6 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు సెంచరీలు చేయగా... జె. అన్షుల్ లాల్ (243 బంతుల్లో 122 నాటౌట్; 5 ఫోర్లు) అజేయ శతకంతో ఆకట్టుకున్నాడు. టి. ఆరోన్ పాల్ (50 నాటౌట్), భగత్ వర్మ (75) అర్ధ సెంచరీలు చేశారు. దీంతో ఈ మ్యాచ్‌లో స్పోర్టింగ్ ఎలెవన్ జట్టుకు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. మ్యాచ్ ‘డ్రా’గా ముగియడంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ లభించింది.
ఇతర ఎ–1 డివిజన్ మూడు రోజుల లీగ్ మ్యాచ్‌ల వివరాలు
ఆంధ్రాబ్యాంక్: 286 (కార్తి్తకేయ 4/86); జై హనుమాన్: 288/6 (రోహిత్ రాయుడు 97 నాటౌట్, విఠల్ అనురాగ్ 42).
డెక్కన్ క్రానికల్: 198 (నితీశ్ రెడ్డి 61, బి. రేవంత్ 92; రాజమణి ప్రసాద్ 4/52, అజయ్ దేవ్ 3/51); ఈఎంసీసీ: 179/7 (బెంజ మిన్ థామస్ 68 నాటౌట్; వరుణ్ గౌడ్ 3/43).
ఎస్బీఐ: 320/6 (డానీ డెరెక్ ప్రిన్స్ 86, బి. సుమంత్ 99, ఆకాశ్ భండారి 69; ప్రణీత్ రాజ్ 5/63); ఇన్‌కం ట్యాక్స్‌తో మ్యాచ్.
కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 337/7 డిక్లేర్డ్; ఇండియా సిమెంట్స్ తొలి ఇన్నింగ్స్: 302 (హృషికేశ్ సింహా 110, జయసూర్య 48; మెహదీ హసన్ 4/73, మీర్ ఒమర్ ఖాన్ 3/37).
జెమిని ఫ్రెండ్స్: 292 (ఎం. రాధాకృష్ణ 90; శ్రీ చరణ్ 4/106, రాజేంద్ర 5/53); హైదరాబాద్ బాట్లింగ్: 131/2 (జయరామ్ రెడ్డి 37, జి. రోహన్ యాదవ్67 నాటౌట్).
కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 190, ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ తొలి ఇన్నింగ్స్: 213 (టి. వంశీకృష్ణ 37, జి. చిరంజీవి 40, హేమంత్ సింగ్ 50; ఆకాశ్ సనా 5/32), కాంటినెంటల్ రెండో ఇన్నింగ్స్: 86/4 (సాయి ప్రణయ్ 34; ఎం. సురేశ్ 3/44);