sports anchor
-
బుమ్రానే బౌల్డ్ చేసింది.. ఎవరీ సంజన?!
గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఇండియన్ క్రికెటర్, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా వివాహం గురించిన చర్చే ఎక్కుగా నడిచింది. బుమ్రా ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడనే దాని గురించి పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో పలువురు పేర్లు కూడా తెరమీదకు వచ్చాయి. అయితే నేటితో ఈ ఊహాగానాలకు తెర పడింది. బుమ్రా మనసు గెలిచింది.. తన జీవితంలోకి ప్రవేశించింది ఎవరో తెలిసిపోయింది. కొన్ని గంటల క్రితమే బుమ్రా.. టీవీ ప్రెజెంటర్ సంజనా గణేశన్‌ను వివాహమాడారు. సిక్కు సంప్రదాయం ప్రకారం చాలా సింపుల్‌గా వీరి పెళ్లి వేడుక సోమవారం జరిగింది. తమ పెళ్లి ఫొటోలను బుమ్రా, సంజన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ‘‘ప్రేమ, ఇది విలువైనదని మీరు గుర్తిస్తే.. అదే మీకు మార్గనిర్దేశం చేస్తుంది’’ అని మెసేజ్ కూడా ఇచ్చారు. ‘‘ప్రేమికులుగా ఉన్న మేము కలిసి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టాం. మా జీవితాల్లో ఎంతో సంతోషకరమైన రోజుల్లో ఈరోజు ఒకటి. మా పెళ్లి వార్తను, మా సంతోషాన్ని మీతో పంచుకోవడం ఆశీర్వాదంగా భావిస్తున్నాం. జస్ప్రీత్ అండ్ సంజన’’ అని తమ ఇన్స్టాగ్రామ్ పోస్టుల్లో వీరిద్దరు పేర్కొన్నారు. ఇక పెళ్లికి ముందు వరకు కూడా వీరిద్దరు తమ రిలేషన్ గురించి ఒక్క మాట మాట్లడలేదు. ఎక్కడా బయటపడలేదు. ఈ రోజు ఏకంగా పెళ్లి ముచ్చట చేప్పేశారు. బుమ్రా నాలుగో టెస్టు నుంచి తప్పుకోవడం పట్ల బీసీసీఐ తన ప్రకటనలో ‘ఆయన వ్యక్తిగత కారణాల వల్ల’ అని మాత్రమే పేర్కొంది. ఎక్కడా పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. కానీ, రెండు రోజులుగా బుమ్రా పెళ్లి వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మొత్తానికి సోమవారం నాడు సంజనను పెళ్లాడి బుమ్రా ఓ ఇంటివాడు అయ్యాడు. ఇదిలా ఉంటే, అసలు బుమ్రా పెళ్లి చేసుకున్న సంజనా గణేషన్ ఎవరు.. అసలు వీరిద్దరికి ఎలా పరిచయం ఏర్పడింది అనే తదితర అంశాల గురించి చర్చిస్తున్నారు నెటిజనులు. వాటికి సమాధానమే ఈ స్టోరి.. క్రీడలను ముఖ్యంగా క్రికెట్‌ను అభిమానించే వారికి సంజనా గణేశన్ పరిచయమే. ఎందుకంటే స్టార్ స్పోర్ట్స్‌లో క్రికెట్, బ్యాడ్మింటన్ టోర్నమెంట్ల సందర్భంగా పలు స్పేషల్ షోలు హోస్ట్ చేశారు సంజన. ఇక ఆమె వ్యక్తిగత వివరాలకు వస్తే.. సంజనా గణేశన్ స్వస్థలం పుణె. 1991 మే 6న ఆమె జన్మించారు. అక్కడే బీటెక్ వరకు చదివారు. మోడలింగ్‌లో తన కెరీర్‌ను మొదలుపెట్టిన సంజన.. ‘ఫెమినా అఫిషీయల్లీ గార్జియస్’ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. అలాగే, ఫెమినా మిస్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ఈ కాంపిటీషన్లో ఫైనలిస్ట్‌గా నిలిచారు. 2014లో ఎంటీవీ స్ల్పిట్స్‌విల్లా షో సీజన్ 7 ద్వారా సంజన గుర్తింపు తెచ్చుకున్నారు. సన్నీ లియోనీ, నిఖిల్ చిన్నప్ప హోస్ట్ చేసిన ఈ షో మధ్యలోనే గాయం కారణంగా సంజన తప్పుకున్నారు. ప్రస్తుతం స్టార్ స్పోర్ట్స్‌లో టీవీ ప్రెజెంటర్‌గా పనిచేస్తున్నారు సంజన. తన ఇన్స్టాగ్రామ్ బయోగ్రఫీలో ‘‘టీవీ ప్రెజెంటర్ ఫర్ స్టార్ స్పోర్ట్స్ ఇండియా, డిజిటల్ హోస్ట్, దట్ మిస్ ఇండియా గర్ల్’’ అని పేర్కొన్నారు. గతేడాది దుబాయ్‌లో జరగిన ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్‌కు ప్రజెంటర్‌గా పని చేశారు సంజన. ఈ సందర్భంగా సంజనా.. ఇండియా ఉమెన్స్ టీం మాజీ కెప్టెన్ అంజుమా చోప్రాతో కలిసి దిగిన ఫోటోతో పాటు టీమిండియా మాజీ కెప్టెన్ ధోనిని ఇంటర్వ్యూ చేస్తూ దిగిన ఫోటోలని షేర్ చేశారు. 2019 క్రికెట్ ప్రపంచ కప్‌లో ‘మ్యాచ్ పాయింట్’, ‘చీకీ సింగిల్స్’ వంటి షోలను ఆమె హోస్ట్ చేశారు. క్రికెట్ మాత్రమే కాకుండా బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ వంటి ఇతర స్పోర్ట్స్ ఈవెంట్స్‌ను కూడా సంజన హోస్ట్ చేశారు. వీటితో పాటు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌తోనూ సంజన ఒప్పందం చేసుకున్నారు. కోల్‌కతా నైట్ రైడర్స్ కమర్షియల్ షో ‘ద నైట్ క్లబ్’కు సంజన యాంకర్‌గా వ్యవహరించారు. చదవండి: బుమ్రా ఓ ఇంటివాడయ్యాడు.. సంజనా 'ప్యా'ర్కర్కు బుమ్రా క్లీన్ బౌల్డ్.. -
'ఐపీఎల్ యాంకరింగ్ మిస్సవుతున్నా'
ముంబై : పలు ఐపీఎల్ సీజన్లలో యాంకరింగ్‌తో మంచి పాపులరిటీ సంపాదించిన మాయంతి లాంగర్ ఆరువారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తన భర్త ప్రముఖ క్రికెటర్ స్టువర్ట్ బిన్నీతో కలసి చేతిలో బిడ్డతో దిగిన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆమె స్పందిస్తూ.. 'ఈసారి ఐపీఎల్ 2020 యాంకరింగ్ మిస్సవుతున్నా.. కానీ ఇంట్లోనే ఉంటూ రోజువారి ఐపీఎల్ మ్యాచ్‌లను స్టార్‌స్పోర్ట్స్‌లో చూస్తూ ఎంజాయ్ చేయబోతున్నా. ఈ సందర్భంగా మా గ్యాంగ్ సభ్యులైన జతిన్ సపారు, సుహైల్ చాందోక్, క్రికెట్ ఆకాశ్, సంజన గణేషన్, స్కాట్ బైరిస్, బ్రెట్ లీ లాంటి వాళ్లను మిస్సవుతున్నా.. అంటూ' పేర్కొన్నారు. (చదవండి : 'మేం లేకపోయినా.. చెన్నైకి నష్టం లేదు') 'గత ఐదేళ్లుగా స్టార్‌స్పోర్ట్స్ తన కుటుంబంలో నన్ను ఒకదానిలా చూసింది. వారు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో ఒక యాంకర్‌గా బాధ్యతను సక్రమంగా నిర్వర్తించా. కరోనా లేకపోయుంటే మార్చిలో ఐపీఎల్ జరుగుంటే.. ఐదు నెలల ప్రెగ్నెన్సీతో యాంకరింగ్ చేద్దామనుకున్నా. కరోనా వల్ల దాదాపు నెలల తర్వాత ఐపీఎల్ మొదలవుతుంది. కానీ స్టార్‌స్పోర్ట్స్ యాజమాన్యం నాకు ఈ విషయంలో చాలా మద్దతునిచ్చింది. ఆ విషయంలో వారికి కృతజ్ఞత తెలుపుకుంటున్నా. ఆరు వారాల క్రితం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చా. స్టువర్ట్ బిన్నీ, బిడ్డతో కలిసి మధురక్షణాలను అనుభవిస్తున్నా.. బాబు మా జీవితంలోకి ప్రేవేశించాకా చాలా కొత్తగా అనిపిస్తుందంటూ' తెలిపారు.(చదవండి : 'ఆర్సీబీలో కోహ్లి, డివిలియర్స్ ఫేవరెట్ కాదు') So I’m going to love watching the IPL @StarSportsIndia all the best to the team 😁 @jatinsapru @suhailchandhok @cricketaakash @SanjanaGanesan @ProfDeano @scottbstyris @BrettLee_58 @Sanjog_G and the full gang!! pic.twitter.com/fZVk0NUbTi — Mayanti Langer Binny (@MayantiLanger_B) September 18, 2020 స్పోర్ట్స్ వ్యాఖ్యాతల్లో తనదైన ముద్ర వేసిన మయాంతి ఐసీసీ నిర్వహించే ప్రపంచకప్ టోర్నీలతో పాటు ఇండియన్ కౌన్సిల్ లీగ్(ఐసీఎల్), ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లాంటి టోర్నీలకు యాంకర్‌గా వ్యవహరించారు. ఇక మయాంతి భర్త క్రికెటర్ స్టువర్ట్ బిన్నీ టీమిండియా తరపున 14 వన్డేలు, 6 టెస్టులు ఆడాడు. రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బిన్నీని గతేడాది ఐపీఎల్ వేలం సందర్భంగా జట్టు నుంచి రిలీజ్ చేసింది. -
రాహుల్‌కి పాక్ యాంకర్ ఫిదా
ఇస్లామాబాద్: టీమిండియా యంగ్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ సీజన్లో రెచ్చిపోతున్నాడు. అద్భుతమైన ప్రదర్శనతో కింగ్స్ పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇతగాడిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఒకానొక టైంలో ఓపెనర్‌గా రోహిత్ శర్మను బదులు రాహుల్ తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో ఓ డిమాండ్ కూడా కొందరు లేవనెత్తుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే పాకిస్థాన్ యాంకర్ ఒకరు రాహుల్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు. రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాహుల్ 54 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్స్‌లు బాది 84 పరుగులు సాధించాడు. ఈ విజయంపై పాక్ యాంకర్ జైనబ్ అబ్బాస్ తన ట్వీటర్లో ఓ పోస్టు చేశారు. ‘కేఎల్ రాహుల్ టైమింగ్ అదిరింది. అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతని ఆట చూడటం గొప్పగా ఉంది’ అంటూ ఓ ట్వీట్ చేశారు. స్పోర్ట్స్ యాంకర్ అయిన జైనబ్‌కు పాక్ యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ ఐపీఎల్ సీజన్లో రాహుల్ వరుసగా అర్థ సెంచరీలతో రాణిస్తున్నాడు. 10 మ్యాచ్‌లలో 4 అర్థసెంచరీలతో 471 పరుగులు సాధించి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇదే సీజన్లో 14 బంతుల్లో అర్థ సెంచరీ చేసి ఐపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నిలుపుకున్నాడు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రాహుల్ (70 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కడదాకా పోరాడాడు. అయితే పంజాబ్ ఈ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఓడింది. KL Rahul impressive,superb timing,great to watch.. #RRvKXIP — zainab abbas (@ZAbbasOfficial) May 6, 2018 A rare candid shot on the sidelines,with my usual cup of ☕️! A post shared by Zainab Abbas (@zabbasofficial) on Apr 25, 2018 at 1:09pm PDT -
స్పోర్ట్స్ యాంకర్‌గా రాణిస్తున్న అంజలి
►స్పోర్ట్స్ యూంకర్‌గా రాణిస్తున్న భీమవరం యువతి ► సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్న వైనం క్రీడా పోటీల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ, క్రీడాభిమానులను ఉత్సాహపర్చడంతో పాటు ఆట తీరు, క్రీడాకారుల నైపుణ్యాలను వర్ణిస్తుంటారు స్పోర్ట్స్ యూంకర్లు. ఐపీఎల్, వరల్డ్ కప్, ఐబీఎల్ వంటి టోర్నమెంట్‌ల్లో మహిళా స్పోర్ట్స్ యాంకర్లు వీక్షకులను కట్టిపడేస్తుంటారు. వీరిని చూసి స్ఫూర్తి పొందిన ఓ యువతి స్పోర్ట్స్ యూంకర్‌గా రాణిస్తోంది. జిల్లాలో జరుగుతున్న ఫుట్‌బాల్ లీగ్ ఆఫ్ వెస్ట్ గోదావరి (ఫ్లో) టోర్నమెంట్లో క్రీడాభిమానులను అలరిస్తోంది. యూంకరింగ్లో దూసుకుపోవడంతో పాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటోంది భీమవరానికి చెందిన అంజలి షెహన. అనుభవం లేకపోయినా అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నారు నేటితరం యువత. భీమవ రానికి చెందిన అంజలి షెహన ఈ కోవకు చెందిన అమ్మాయే. కొద్దిరోజులుగా జిల్లాలో జరుగుతున్న ఫ్లో టోర్నమెంట్లో యూంకరింగ్ చేస్తూ మన్ననలు పొందుతోంది. అభిమానులను ఉత్సాహపరుస్తూ, క్రీడాకారుల నైపుణ్యాన్ని వర్ణిస్తూ పోటీలకు కొత్త ఊపు తె స్తోంది. ఈ నెల 2వ తేదీ నుంచి జరుగుతున్న ‘ఫ్లో’ పోటీల్లో అంజలి స్పోర్ట్స్ యాంకర్‌గా ఆకట్టుకుంటోంది. మైక్ పట్టుకుని పోటీలు చూసేందుకు వస్తున్న అభిమానుల్లో జోష్ పెంచుతోంది. తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురం, ఏలూరు, జంగారెడ్డిగూడెం, భీమవరం జట్ల అభిమానుల మధ్య యూంకరింగ్తో రసవత్తరమైన పోటీను సృష్టిస్తోంది. ఫుట్‌బాల్‌పై ఆసక్తిని పెంచుతూ పోటీల విజయవంతానికి కృషిచేస్తోంది. సినీ నటిగా రాణిస్తూ.. ఐపీఎల్, ఐబీఎల్, వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌ల్లో లేడీ యాంకరింగ్‌ను చూసిన ఫ్లో అభిమానులు అంజలి యూంకరింగ్ను చూసి ముగ్ధులవుతున్నారు. యూంకరింగ్లో రాణించాలనే ఆసక్తి ఉన్న యువకులలో ఆమె స్ఫూర్తి నింపుతోంది. బీకాం చదివిన అంజలి సినీ నటిగానూ అవకాశాలు దక్కించుకుంటోంది. ఆ ఇద్దరు, అలా సరదాగా, అన్నౌన్ సినిమాల్లో నటించింది. ‘ నీకై పడిపోయా’ అనే కొత్త సినిమాలో హీరో హేమంత్‌రెడ్డి సరసన నటించేందుకు అవకాశం దక్కించుకుంది. ఐదేళ్లుగా సాంస్కృతిక, అందాల పోటీల్లో పాల్గొంటూ అవార్డులు అందుకుంటోంది. ఆత్మ విశ్వాసంతో రాణించాలి క్రీడారంగంలో పలు అవకాశాలు వస్తున్నాయి. ఆటలపై అవగాహన పెంచుకోవాలి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని ఆత్మవిశ్వాసంతో రాణించాలి. భయాన్ని వీడి ఇష్టపడి పనిచేస్తే ఏ రంగంలోనైన రాణించవచ్చు అనేది నా నమ్మకం. - అంజలి షెహన