ఇస్లామాబాద్: టీమిండియా యంగ్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఈ ఐపీఎల్ సీజన్‌లో రెచ్చిపోతున్నాడు. అద్భుతమైన ప్రదర్శనతో కింగ్స్ పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఇతగాడిపై ప్రశంసలు జల్లు కురుస్తోంది. ఒకానొక టైంలో ఓపెనర్‌గా రోహిత్ శర్మను బదులు రాహుల్ తీసుకోవాలంటూ సోషల్ మీడియాలో ఓ డిమాండ్ కూడా కొందరు లేవనెత్తుతున్నారు. ఆ సంగతి పక్కన పెడితే పాకిస్థాన్ యాంకర్ ఒకరు రాహుల్ బ్యాటింగ్‌కు ఫిదా అయ్యారు.
రాజస్తాన్ రాయల్స్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రాహుల్ 54 బంతుల్లో 7 బౌండరీలు, 3 సిక్స్‌లు బాది 84 పరుగులు సాధించాడు. ఈ విజయంపై పాక్ యాంకర్ జైనబ్ అబ్బాస్ తన ట్వీటర్‌లో ఓ పోస్టు చేశారు. ‘కేఎల్ రాహుల్ టైమింగ్ అదిరింది. అత్యుత్తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. అతని ఆట చూడటం గొప్పగా ఉంది’ అంటూ ఓ ట్వీట్ చేశారు. స్పోర్ట్స్ యాంకర్ అయిన జైనబ్‌కు పాక్ యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇక ఈ ఐపీఎల్ సీజన్‌లో రాహుల్ వరుసగా అర్థ సెంచరీలతో రాణిస్తున్నాడు. 10 మ్యాచ్‌లలో 4 అర్థసెంచరీలతో 471 పరుగులు సాధించి టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. ఇదే సీజన్‌లో 14 బంతుల్లో అర్థ సెంచరీ చేసి ఐపీఎల్ ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ రికార్డును తన పేరిట నిలుపుకున్నాడు. మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ రాహుల్ (70 బంతుల్లో 95 నాటౌట్; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) కడదాకా పోరాడాడు. అయితే పంజాబ్ ఈ మ్యాచ్‌లో 15 పరుగుల తేడాతో ఓడింది.
KL Rahul impressive,superb timing,great to watch.. #RRvKXIP
— zainab abbas (@ZAbbasOfficial) May 6, 2018
Comments
Please login to add a commentAdd a comment